న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కావాల్సిన భేటీ వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం రేపు చంద్రబాబు, ప్రధానితో భేటీ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 తేదీలోపు చంద్రబాబు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలుస్తారని సమాచారం.