meeting postponed
-
ఈ నెల 19వ తేదీకి వాయిదా పడిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
-
టీఆర్ఎస్ బహిరంగ సభ వాయిదా..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ‘గులాబీ’ దళపతి కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తలపెట్టిన బహిరంగ సభ అనూహ్యంగా వాయిద పడినట్లు తెలిసింది. జిల్లా టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న వివాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈనెల 3 నుంచి మొదటి విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఏడో తేదీన వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే ఏడు నియోజకవర్గాల్లో అసమ్మతి తీవ్రంగా ఉందని, వీటిని నిలువరించడంలో స్థానిక నాయకత్వం విఫలమైందని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ జన సభను వాయిదా వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొండా దంపతులు పార్టీ నుంచి వెళ్తూ చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం దీటుగా తిప్పికొట్టలేకపోయిందనే ఆగ్రహంతో ఆయన ఉన్నట్లు తెలిసింది. ఇటువంటి విభేదాల నేపథ్యంలో సభకు ప్రజలను ఎలా తీసుకొస్తారని, వాయిదా వేయడమే మంచిదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
షీప్ ఫెడరేషన్ సమావేశం వాయిదా
అనంతపురం అగ్రికల్చర్ : గొర్రెలు, మేకల సహకార సంఘాల జిల్లా సమాఖ్య (షీప్ అండ్ గోట్ ఫెడరేషన్)లో నెలకొన్న విభేదాల వల్ల బోర్డు మీటింగ్ కోరం లేక వాయిదా పడింది. బుధవారం స్థానిక పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఉన్న ఫెడరేషన్ కార్యాలయంలో బోర్డు మీటింగ్‌కు హాజరు కావాలని ఎగ్జిక్యూటివ్ అధికారి ఫెడరేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మరో 10 మంది డైరెక్టర్లకు అజెండా ప్రతులతో ఆహ్వానాలు పంపారు. సమావేశానికి అధ్యక్షుడు రామకృష్ణతో పాటు మరో ముగ్గురు డైరెక్టర్లు మాత్రమే హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో ఎగ్జిక్యూటివ్ అధికారి హాజరు కాలేదు. పశుశాఖ జేడీ డాక్టర్ బి.సన్యాసిరావు సమక్షంలో జరిగిన బోర్డు మీటింగ్‌లో సహకార అధికారి హాజరయ్యారు. కనీసం 8 మంది హాజరైతే అజెండా ప్రకారం చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని సహకార అధికారి తెలిపారు. అధ్యక్షుడు, మరో ముగ్గరు డైరెక్టర్లు మాత్రమే హాజరు కావడంతో కోరం లేదని ప్రకటిస్తూ, మరోరోజు సమావేశం నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జేడీ ఆదేశించారు. కాగా, బోర్డు మీటింగ్ ఉందని తెలియడంతో గొర్రెలు, మేకల సహకార సంఘాల అధ్యక్షులు పలువురు తరలివచ్చి జేడీ బి.సన్యాసిరావుతో సమావేశమయ్యారు. ఉపాధ్యక్షుడు, మరో ఏడుగురు డైరెక్టర్లు ఉద్దేశపూర్వకంగా బోర్డు మీటింగ్‌కు రానందున, వారితో ప్రమేయం లేకుండా సమావేశం నిర్వహించాలని కోరారు. సొసైటీలకు త్వరలోనే ఎన్సీడీసీ కింద రుణాలు మంజూరయ్యే పరిస్థితి ఉన్నందున ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు మీటింగ్ వాయిదా పడితే ఇబ్బందులు ఎదురవుతాయని జేడీ దృష్టికి తీసుకెళ్లారు. ఫెడరేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి సొసైటీల అభివృద్ధి, గొర్రెల కాపర్ల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మరోపక్క ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడిపై తమకు విశ్వాసం లేనందున ఆయనపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించడానికి అజెండా రూపొందిస్తే బోర్డు మీటింగ్ హాజరవుతాయని రెండో వర్గం నాయకులు జేడీకి కబురు పంపినట్లు సమాచారం. అన్ని అంశాలు పరిశీలించి, సహకార నిబంధనల ప్రకారం త్వరలో నిర్ణయం తీసుకుంటామని జేడీ తెలిపారు. -
ఆధిపత్యం కోసం టీడీపీ కౌన్సిలర్ యత్నం
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీరంగం సమావేశ మందిరం వైపు దూసుకు వెళ్లిన తెలుగు తమ్ముళ్లు కౌన్సిలర్ హడావుడితో సమావేశం వాయిదా తాడేపల్లి రూరల్ : ప్రజాభివృద్ధిపై చర్చ జరిగి ఒకరినొకరు సమన్వయపరచుకుంటూ నిర్వహించాల్సిన మునిసిపల్ సమావేశం తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ నిర్వాకంతో ఆరంభం కాకుండానే వాయిదా పడింది. ప్రజా సమస్యలపై చర్చించే సమయాన్ని జన్మభూమి కమిటీల చర్చతో సదరు కౌన్సిలర్ పక్కదోవ పట్టించారు. తాడేపల్లి మునిసిపల్ సంఘం ప్రత్యేక, సాధారణ సమావేశాలను బుధవారం నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి అధ్యక్షతన సమావేశం ప్రారంభించారు. అయితే ఆరంభంలోనే కమిషనర్ శివారెడ్డి జన్మభూమి కమిటీలను నూతనంగా ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ విషయంపై చర్చ ప్రారంభించారు. ఈ క్రమంలో నూతన కమిటీలను ఎన్నుకోవాల్సిన అవసరం ఏముందంటూ వైస్ చైర్మన్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు బుర్రముక్కు వేణుగోపాలరెడ్డి, గోరేబాబు, ఈదులమూడి డేవిడ్, ఓలేటి రాము, మాచర్ల అబ్బు తదితరులు ప్రశ్నించారు. మరో రెండు రోజుల్లో జన్మభూమి జరగబోతుంటే ఇప్పుడు కమిటీలు ఎలా వేస్తారంటూ వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా కమిషనర్ మాట్లాడుతూ మంత్రి జీవో జారీ చేశారని, దాన్ని అనుసరించే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. జీవో నెంబర్ 20ను అమలు చేసి తీరాలని, పాత కమిటీలను ఎలా రద్దు చేస్తారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీంతో టీడీపీ ఫ్లోర్ లీడర్ ఇట్టా భాస్కర్ స్పందిస్తూ అధికార పార్టీ మాది, మేం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని, మీరెవరు ప్రశ్నించడానికి అంటూ కౌన్సిలర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో మిగతా కౌన్సిలర్లు ‘మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కమిటీలు వేసుకుని, మీకు నచ్చిన విధంగా చేసుకోవాల’ని సూచించారు. దాంతో భాస్కర్ మా పార్టీని, మా నాయకుడిని అవమానిస్తారా? అంటూ వీరంగం వేస్తూ చైర్‌పర్సర్ చాంబర్ ముందు బైఠాయించి, అజెండా పత్రాలను చించివేశాడు. ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నాడంటూ మిగతా కౌన్సిలర్లు వ్యాఖ్యానించడంతో, నన్ను సస్పెండ్ చేయండి, బయటకు పంపేయండి అంటూ సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు జన్మభూమి కొత్త కమిటీలను ఎన్నుకోవడానికి మేము వ్యతిరేకం అంటూ సమావేశ మందిరం నుండి బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో తాడేపల్లి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇట్టా పెంచలయ్య.. ‘ఎవర్రా మా పార్టీ గురించి మాట్లాడింది, మీ సంగతి తేలుస్తా’నంటూ వేలు చూపిస్తూ కౌన్సిలర్లకు వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో కౌన్సిలర్లు జరిగిన విషయాన్ని తెలియజేసేసరికి అక్కడ నుండి జారుకున్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ చాంబర్లో చైర్పర్సన్ మహాలక్ష్మి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ అయిన వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీ కౌన్సిలర్లు సమావేశ మందిరాల్లో లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వారి నియోజకవర్గ ఇన్చార్జి ఇచ్చిన లేఖ మేరకు జన్మభూమి కమిటీలను ఎలా ఎంచుకుంటారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కేళి వెంకటేశ్వరరావు, దాసరి ప్రమీలారాణి, మేకా పావని, వేముల లక్ష్మీరోజా, చింతపల్లి సుమలత, దర్శి విజయశ్రీ, చిట్టిమళ్ల స్నేహసంధ్య, కాటాబత్తుల నిర్మల, జమ్మలమడుగు విజయలక్ష్మి, సింకా గంగాధర్‌రావు, తమ్మా ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి బోర్డు భేటీ వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అధికారుల విజ్ఞప్తి మేరకు నేడు జరగాల్సిన గోదావరి బోర్డు సమావేశం వాయిదా పడింది. తిరిగి సెప్టెంబర్ 23న బోర్డు సమావేశం నిర్వహిస్తారు. రక్షాబంధన్‌తో పాటు అసెంబ్లీ సమావేశాలకు సమాయత్తం కావాల్సి వున్నందున భేటీని వాయిదా వేయాల్సిందిగా ఏపీ అధికారులు కోరడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
ప్రధానితో చంద్రబాబు భేటీ వాయిదా
-
ప్రధానితో చంద్రబాబు భేటీ వాయిదా
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కావాల్సిన భేటీ వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం రేపు చంద్రబాబు, ప్రధానితో భేటీ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 తేదీలోపు చంద్రబాబు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలుస్తారని సమాచారం. -
డీసీసీబీ బోర్డు సమావేశం వాయిదా
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బోర్డు సమావేశం ఈ నెల 22న శుక్రవారం జరగాల్సి ఉండగా వాయిదా వేశారు. అనివార్యకారణాల కారణంగా బోర్డు సమావేశం వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ దానికి కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తుంది. వాయిదా తేదీని తరువాత ప్రకటించనున్నట్లు బ్యాంకు అధికారులు చెపుతున్నా ఇప్పట్లో సమావేశం జరిగే అవకాశాలు లేవని కొందరు బోర్డు డెరైక్టర్లు చెపుతున్నారు. వారం రోజుల క్రితం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆడిట్ నివేదికను ఆడిట్ అధికారులు ఆడిట్ కమిటీకి నివేదించారు. దానిని వారం రోజుల ముందు ఇస్తే క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించేవారమని చెబుతూ వారం తరువాత కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదిస్తామన్న కమిటీ సభ్యులు దాన్ని తిరస్కరించారు. తిరిగి ఆడిట్ కమిటీ సమావేశాన్ని బుధవారం ఏర్పాటుచేసినప్పటికీ ఖర్చుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపిస్తూ నివేదికను తిరస్కరించినట్లు సమాచారం. అసలు ఆడిట్ కమిటీ నివేదికను బుధవారం ఆమోదిస్తే వెంటనే శుక్రవారం జరగాల్సిన పాలకమండలి సమావేశంలో దానిని ప్రవేపెట్టి నివేదికకు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కాని నివేదికను కమిటీ ఆమోదించని కారణంగా బోర్డు సమావేశం నిర్వహించని పరిస్థితి ఏర్పడడంతో దానిని వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అయితే బోర్డు డెరైక్టర్ల సమాచారం మేరకు వాయిదాకు మరో కారణం కూడా తోడైనట్లు సమాచారం. అక్రమాల చిట్టా పెరుగుతుండడంతో.. ఇటీవల దేవరకొండ అక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుండడంతో అక్రమాల చిట్టా పెరుగుతుండడం వలన బోర్డు సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి పరోక్షంగా, ప్రత్యక్షంగా సహరించిన జిల్లాస్థాయి అధికారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సమావేశంలో బోర్డు సభ్యుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం లేకపోలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు సమావేశం వాయిదా వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా చైర్మన్ పదవి విషయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డిని రాజీనామా చేయాలని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్ చేసే అవకాశం కూడా ఉండడంతో సమావేశం వాయిదా వేసినట్లు వినికిడి. ఏదిఏమైనా డీసీసీబీలో నెలకొన్న పరిస్థితులు రైతులకు ఖరీఫ్ పంటరుణాలు అందక వారి పాలిటశాపంగా మారాయని చెప్పవచ్చు.