ఫ్రీడం ఫైటర్స్కు 20శాతం పెన్షన్ హైక్ | Modi announces hike in freedom fighters pensions | Sakshi
Sakshi News home page

ఫ్రీడం ఫైటర్స్కు 20శాతం పెన్షన్ హైక్

Published Mon, Aug 15 2016 10:26 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

ఫ్రీడం ఫైటర్స్కు 20శాతం పెన్షన్ హైక్ - Sakshi

ఫ్రీడం ఫైటర్స్కు 20శాతం పెన్షన్ హైక్

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమర యోధులకు మరో శుభవార్త. వారికిప్పుడు ఇస్తున్న పెన్షన్ను 20శాతం పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చెప్పాడు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎర్రకోట సాక్షిగా ఆయన ఈ ప్రకటన వెలువరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురువేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ...

'మన స్వాతంత్ర్య సమరయోధులకు ఇస్తున్న పెన్షన్ను 20శాతానికి పెంచుతున్నాం. ఇప్పుడు ఎవరైతే 25 వేలు పొందుతున్నారో ఇక నుంచి వారికి 30 వేల రూపాయలు అందుతాయి' అని మోదీ చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు చాలామందికి తెలియకుండా పోయిన గిరిజన స్వాతంత్ర సమరయోధుల గురించి అందరికీ తెలిసేలా ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ప్రదర్శన శాలలు ఏర్పాటుచేస్తామని మోదీ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజనులు కీలక పాత్ర పోషించారని, ఈ నేపథ్యంలోనే వారి త్యాగాలకు గౌరవంగా ప్రత్యేక మ్యూజియాలను దేశ వ్యాప్తంగా ఏర్పాటుచేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement