సాక్షి, చెన్నై : స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్లపై మధురైలోని మద్రాసు హైకోర్టు బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. దేశంలోని స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించి.. వెతుక్కుంటూ ఇంటింటికి వెళ్లి మరీ పింఛన్లు అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బెంచ్ ఆదేశించింది.
స్వాతంత్ర్య సమరయోధులకు పింఛన్లు అందజేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం నేపథ్యంలో మధురై హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment