ముంబై : మహారాష్ర్టలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో కోవిడ్ కలకలం సృష్టించింది. గడిచిన వారం రోజుల్లో 21 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సోమవారం ప్రకటించింది. దీంతో వీరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి అపార్ట్‌మెంట్ చుట్టు పక్కల ప్రాంతాల్లో శానిటైజేషన్ నిర్వహించారు. వైరస్ సోకిన వారిలో 19 మంది వివిధ ఇళ్లలో పనిచేసేవారు, డ్రైవర్లు, సెక్యురిటీ సిబ్బంది తదితరులు ఉన్నారని పేర్కొంది. దీంతో వీరి ద్వారా వైరస్ మరింత మందికి సోకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మిగతా అపార్ట్‌మెంట్ వాసులకి కూడా విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. కరోనా పరీక్షలు తేలాల్సి ఉందని పేర్కొన్నారు. (60 వేలు దాటిన కరోనా కేసులు.. మదురైలో మళ్లీ లాక్‌డౌన్ )
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ర్టలోనే రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్‌లో 24 గంటల్లోనే 14,821 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, మొత్తంలో కేసుల సంఖ్య 4,25,282కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ( ఎమ్మెల్యేతో పాటు కుటుంబమంతా పాజిటివ్ )
Comments
Please login to add a commentAdd a comment