ప్రభుకు ప్రధాని మోదీ అభినందన | narendra modi congratulates suresh prabhu | Sakshi
Sakshi News home page

ప్రభుకు ప్రధాని మోదీ అభినందన

Published Thu, Feb 25 2016 2:30 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

narendra modi congratulates suresh prabhu

న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. రైల్వే మంత్రిని, రైల్వే శాఖ సిబ్బందిని మోదీ అభినందించారు.

'గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లను విమర్శించదలచుకోలేదు. ఈ బడ్జెట్ వ్యయం రెండున్నర రెట్లు పెరిగింది. దేశ పురోభివృద్ధికి దోహదపడుతుంది. దేశాభివృద్ధిలో దీర్ఘకాలం ప్రభావం చూపుతుంది. ఛార్జీలు పెంచకుండా ప్రయాణికులకు ఊరట కలిగించారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా పురోగతి కనిపించింది. ఈ బడ్జెట్ వల్ల మరింత అభివృద్ధి జరుగుతుంది. దేశాభివృద్ధిలో రైల్వే బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుంది' అని మోదీ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement