న్యూఢిల్లీ : ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాన నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా నివారణపై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెస్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెస్స్‌లో కరోనా నియంత్రణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష చేపట్టారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎంలతో చర్చించారు. కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు కూడా పాల్గొన్నారు.
నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు.విదేశాల నుంచి వచ్చివారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మోదీ తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే క్వారంటైన్‌కు తరలించాలన్నారు. ఎండలు ఎక్కువగా వైరస్ వ్యాపించదని తొలుత భావించాం.. కానీ గల్ఫ్ దేశాల్లో ఎండలు ఎక్కువగా ఉన్న కూడా కరోనా వ్యాపించిందని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
చదవండి : ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు
Comments
Please login to add a commentAdd a comment