నరేంద్ర మోడీ భార్య కూడా కావాలంటారు!
జార్ఖండ్ మంత్రి మన్నన్ మల్లిక్ వ్యాఖ్య
రాంచీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కోసం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రజల నుంచి ఇనుము కోరుతున్న నేపథ్యంలో జార్ఖండ్ పశుసంవర్ధక శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మన్నన్ మల్లిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ ఇదివరకు ఇటుకలు(అయోధ్యలో రామమందిర నిర్మాణానికి) కోరింది. ఇప్పుడు మోడీ ఇనుము అడుగుతున్నారు. తర్వాత బంగారం అడుగుతారు. ఆ తర్వాత భార్య కావాలని ప్రజలను కోరే రోజు కూడా వస్తుంది. మోడీ ఇప్పుడు బేవా(భార్యలేని వ్యక్తి)’ అని మల్లిక్ సోమవారం ధన్‌బాద్‌లో విలేకర్లతో అన్నారు. ఈ వ్యాఖ్యలపై జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రాయ్ మండిపడ్డారు. మల్లిక్‌కు మానసిక స్థిమితం లేదని, ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.