'జిల్లాలకు ప్రత్యేక హోదా ఇవ్వండి'
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కాదు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని శిరోమణి అకాలీదళ్ ఎంపీ నరేశ్ గుజ్రాల్ సూచించారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే కొన్ని ప్రాంతాలకే మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని అన్నారు. ఆంధప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో శుక్రవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తర్వాత చర్చకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని వైస్ చైర్మన్ పీజే కురియన్ విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ సభ్యులే చర్చను అడ్డుకుంటే ఎలా అని టీడీపీ ఎంపీలను ఉద్దేశించి అన్నారు. సభ్యులు శాంతిచడంతో అరుణ్ జైట్లీ తన ప్రసంగం కొనసాగించారు.