'ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇవ్వాలి' | Union Govt should give Special Status to AP: Vijay Sai Reddy | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇవ్వాలి'

Published Fri, Jul 29 2016 4:26 PM | Last Updated on Tue, Jul 24 2018 1:16 PM

'ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇవ్వాలి' - Sakshi

'ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇవ్వాలి'

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ తీర్మానం ఆమోదించింది కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తుండగా ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు.

'రెండు అంశాలను ఆర్థికమంత్రి దృష్టికి తెస్తా. ఆర్టికల్ 280 గురించి ప్రస్తావించారు. దాని ప్రకారం 14వ ఆర్థిక సంఘం ఇచ్చినవి కేవలం సూచనలు మాత్రమే. దాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇ‍వ్వాలా, వద్దా అని నిర్ణయించవలసింది ప్రభుత్వమే. ఇప్పటివరకు ఇచ్చిన రాష్ట్రాలన్నింటికీ ప్రభుత్వం నిర్ణయంతోనే ఇచ్చార'ని విజయసాయిరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement