లెక్కల చిట్టా విప్పిన కరుణానిధి | Narrow miss for DMK in capturing power: Karunanidhi | Sakshi
Sakshi News home page

లెక్కల చిట్టా విప్పిన కరుణానిధి

Published Sun, May 22 2016 6:47 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

లెక్కల చిట్టా విప్పిన కరుణానిధి

లెక్కల చిట్టా విప్పిన కరుణానిధి

చెన్నై: తమిళనాడులో స్వల్ప తేడాతో తాము అధికారం కోల్పోయామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి తెలిపారు. తమ పార్టీకి, అధికార అన్నాడీఎంకేకు మధ్య ఓట్ల తేడా 1.1 శాతం మాత్రమేనని ఆయన వెల్లడించారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు.

తమ పార్టీ కంటే అన్నాడీఎంకే కు 4,41,646 ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలకు 1,76,17,060 ఓట్లు రాగా, డీఎంకే కూటమికి 1,71,75,374 ఓట్లు వచ్చాయని వెల్లడించారు. కేవలం 1.1 శాతం ఓట్ల స్వల్ప తేడాతో తాము అధికారం కోల్పోయామని, ఇది వాస్తవమని కరుణానిధి ఒక ప్రకటనలో తెలిపారు.

172 స్థానాల్లో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరగ్గా డీఎంకే 89, అన్నాడీఎంకే 83 సీట్లు గెలిచాయన్నారు. కాంగ్రెస్, ఐయూఎంఎల్ సహా తమ కూటమిలో ఉన్న పార్టీలు పోటీ చేసిన 60 స్థానాల్లో అన్నాడీఎంకే 51 సీట్లు కైవసం చేసుకుందని వివరించారు. దీన్నిబట్టి చూస్తే ప్రజలు తమకు మద్దతు పలికారని అన్నారు. అయితే మిత్రపక్షాలను తాము తప్పుబట్టడం లేదన్నారు. డీఎంకే కూటమి మొత్తం 98 సీట్లు గెలవగా కరుణానిధి పార్టీ 89, కాంగ్రెస్ 8, ఐయూఎంఎల్ ఒక్క సీటు దక్కించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement