
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయేకు ఆధిక్యం
పాట్నా: బీహార్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మెజార్టీ సీట్లు దక్కాయి. మొత్తం 24 స్థానాలకు జరిగిన ఎన్నికలో ఎన్డీయే 13 సీట్లను కైవసం చేసుకుంది. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా వివిధ పార్టీలు కలిసి కూటమిగా అవతరించిన జనతాపరివార్కు కేవలం పది స్థానాలే దక్కాయి.
ఒక సీటు మాత్రం స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నాడు. ఈ ఫలితాలతో బీహార్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపట్ల ఒక అవగాహనకు రాకపోయినా.. వీటి ప్రభావం కొంత మేర అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. ఈ విజయం కొంతమేర బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.