డిసెంబర్‌లో నీట్‌ పీజీ డిప్లొమా ప్రవేశ పరీక్ష | NEET-PG 2017 to held from December 5-13 | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో నీట్‌ పీజీ డిప్లొమా ప్రవేశ పరీక్ష

Published Thu, Sep 22 2016 1:25 PM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

NEET-PG 2017 to held from December 5-13

న్యూఢిల్లీ: వైద్య విద్యలో పీజీ డిప్లొమా కోర్సులకు నీట్‌ (జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష) ప్రవేశ పరీక్షను డిసెంబర్‌ 5 నుంచి 13 వరకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌(ఎన్‌బీఈ) నిర్వహించనుంది. ఎండీఎస్‌(డెంటల్‌) కోర్సులకు నీట్‌ పరీక్ష నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 3 వరకు జరగనుంది.

2017 పీజీ, ఎండీఎస్‌ వైద్య విద్యకు సంబంధించి ఇవి ఏకైక అర్హత, ప్రవేశ పరీక్షలు. కశ్మీర్, తెలంగాణ, ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లోని కేంద్ర కోటా( 50 శాతం) సీట్లు వీటి కిందే ఉంటాయి. ఈ పరీక్షలకు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 26–అక్టోబర్‌ 31 మధ్య నమోదు చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement