దేశంలో కరోనా విజృంభన తగ్గుతుందనుకున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన ఒక్కసారిగా అందరిలోనూ దడపుట్టిస్తోంది. తాజాగా అస్సాంలోని ముగ్గరు వ్యక్తులకు కరోనా సోకింది. దీంతో 36 గంటల్లోనే అస్సాంలో కోవిడ్-19 కేసులు సున్నా నుంచి 16కి పెరిగాయి. వీరందరూ గత నెలలో నిజాముద్దీన్‌లోని తబ్లీగి జమాత్‌కు హాజరైనవారే. దీంతో ఈ బృందం నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అస్సాంలో ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో ముఖ్యమంత్రి సర్భనాడ సోనోవాల్ స్పందించారు." రాష్ర్టం ఇప్పుడు క్లిష్టమైన దశకు చేరుకుంది. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలి". అని కోరారు.
ఇక నిజాముద్దీన్ కరోనా సెగ పక్కనే ఉన్న మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌కూ తాకింది. ఇప్పటికే మణిపూర్‌లో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. రాష్ర్టంలో రెండవ కరోనా కేసు నమోదైందని చెప్పడానికి చాలా బాధేస్తుంది అని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్‌సింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో నమోదైన మొదటి కరోనా బాధితుడు మారుమూల తేజు జిల్లాలకు చెందినవాడు. ఇప్పుడతను క్వారైంటైన్‌లో ఉన్నాడు. కోవిడ్-19 సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి మేం సిద్ధంగా ఉన్నామని సీఎం పెమా ఖండు అన్నారు. ఈశాన్య భారతంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment