తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తున్నామని తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ వెల్లడించారు.
ఢిల్లీ: తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో డీవోపీటీ అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై డీవోపీటీ అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అదనంగా 45 మంది ఐఏఎస్‌లు, 30 మంది ఐపీఎస్లు కావాలని రాజీవ్ శర్మ పేర్కొన్నారు.