వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటంతో వారిని ఆకర్షించేలా ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటంతో వారిని ఆకర్షించేలా ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దేశంలో కొత్తగా ఓటుహక్కు వచ్చినవారు 1.70 కోట్ల మంది ఉన్నారు. వీరంతా 18-19 ఏళ్ల వయసువారే కావడంతో వీరిని ఆకర్షించేందుకుగాను ‘రిజిస్టర్ టు ఓట్’ అనే ఫీచర్‌ను ప్రారంభించినట్లు ఫేస్‌బుక్ వర్గాలు వెల్లడించాయి.