ముంబై: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్సీపీకి మంచి శక్తి లభించింది. ఓ మంత్రితోసహా మొత్తం తొమ్మిది మంది తొమ్మిదిమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. కొత్తగా చేరిన వారిలో మంత్రి దిలీప్ సొపల్ కూడా ఉన్నారు. దిలీప్‌తోపాటు మాన్‌సింగ్ నాయక్, బాలాసాహెబ్ పాటిల్, మక్రంద్ పాటిల్, సురేశ్ దేశ్‌ముఖ్, శరద్‌గావిత్, సాహెబ్‌రావ్ పాటిల్, రమేష్ థొరత్ తదితరులు ఉన్నారు. అయితే దిలీప్ ఎన్సీపీ కార్యాలయానికి రాలేదు. ఎన్సీపీలో చేరతానంటూ అజిత్‌పవార్‌కు ఫోన్‌ద్వారా తెలియజేశారు.
మరోవైపు రాష్ట్రంలోని మొత్తం 288 శాసనసభా నియోజకవర్గాలకుగాను 144 స్థానాలను తమకు కేటాయించాలనే విషయంలో ఎన్సీపీ ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
బంతి కాంగ్రెస్ కోర్టులో ఉంది: అజిత్
బంతి కాంగ్రెస్ పార్టీ కోర్టులోనే ఉందని ఎన్సీపీ నాయకుడు, ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిర్ణయం తీసుకోవాల్సింది ఆ పార్టీయేనన్నారు. ఆ పార్టీ స్పందన కోసం తాము ఎదురుచూస్తున్నామన్నారు. తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ 144 స్థానాలను కేటాయించాల్సిందేనన్నారు. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా పోటీ చేస్తారా అని ప్రశ్నించగా ప్రస్తుతానికి అటువంటి ఆలోచన ఏదీ లేదన్నారు.
ఎన్సీపీ స్థానాల్లో బరిలోకి దించాల్సిన అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది కదా అని అడగ్గా, అలా చేస్తే తాము మౌనంగా ఉండబోమన్నారు. అలా చేస్తే తాము కూడా అదే దారి పట్టాల్సి ఉంటుందంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. అయితే ఏదిఏమైనప్పటికీ లౌకిక ఓట్లు చీలిపోకూడదన్నారు. ఇదిలాఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర మంత్రి నారాయణ్‌రాణే అనుచరుడు రాజన్ తేలి ఎన్సీపీలో చేరారు.
తొమ్మిదిమంది స్వతంత్రులు ఎన్సీపీలోకి
Published Mon, Sep 15 2014 9:53 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement