మీడియాతో ఆశాదేవీ
సాక్షి, న్యూఢిల్లీ : ‘ ఇన్నాళ్లకు నా కుమార్తెకు న్యాయం జరిగింది.. ఆత్మకు శాంతి కలిగింది’’ అన్నారు నిర్భయ తల్లి ఆశాదేవీ. శుక్రవారం నిర్భయ దోషులను ఉరితీయటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ. ‘‘ ఏడేళ్లపాటు పోరాటం చేశా. ఆలస్యమైనా చివరకు న్యాయం గెలిచింది. ఇప్పటికైనా చట్టంలోని లోపాలను సరిచేయాలి. నిర్భయ ఫొటోను పట్టుకుని నీకు ఇవాళ న్యాయం జరిగిందని ఏడ్చాను. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాలని న్యాయపోరాటం చేస్తా. ఇప్పటికైనా చట్టంలోని లోపాలను సరిచేయాలి. మన ఇంట్లో, మన చుట్టుప్రక్కలి మహిళలపై ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వారికి తోడుగా నిలవాల’ని కోరారు. ( నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు )
కాగా, నిర్భయ తల్లి ఆశాదేవీ 7ఏళ్ల సుదీర్ఘ పోరాటం నేడు ఫలించింది. ఈ కేసులో దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలకు తెల్లవారుజామున 5:30 గంటలకు తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు చేశారు. జైలు అధికారుల సమక్షంలో తలారి పవన్ వారిని ఉరితీశారు. దేశ చరిత్రలో ఒకే సారి నలుగురు వ్యక్తులను ఉరి తీయటం ఇదే ప్రథమం.
చదవండి : ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’
Comments
Please login to add a commentAdd a comment