Asha Devi
-
దీదీ.. రాజీనామా చేయండి: నిర్భయ తల్లి డిమాండ్
ఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. ఈ సందర్బంగా హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారామె.ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనపై 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి స్పందిస్తూ.. అఘాయిత్యాలను నిలువరించడంలో సీఎం మమతా బెనర్జీ విఫలమైనట్లు విమర్శించారు. నిందితులను శిక్షించడానికి బదులుగా.. నిరసన ప్రదర్శనలతో డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రజలను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమె కూడా మహిళే అని, రాష్ట్ర సీఎంగా ఉన్న ఆమె నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ఇదే సమయంలో అత్యాచారాలకు పాల్పడుతున్న వారి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన శిక్షను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. కోల్‌కతా మెడికల్ కాలేజీలో అమ్మాయిలకు రక్షణ లేకుంటే, అప్పుడు దేశంలోని మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు.మరోవైపు.. ఆగస్టు 9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్యకు గురైంది. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వైద్యసేవలను నిలిపివేశారు. ఇక, కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. -
నా కూతురి ఆత్మ శాంతించింది!
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావడంపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు న్యాయం లభించిందని, ఇప్పుడు భద్రంగా ఉన్నామని మహిళలు భావిస్తారని వ్యాఖ్యానించారు. శిక్ష అమలు ఇంతగా వాయిదా పడటానికి కారణమైన చట్టపరమైన లోపాలపై ఇకపై తాము పోరాటం చేస్తామన్నారు. నిర్భయ తల్లి ఆశాదేవి, తండ్రి బద్రీనాథ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని ఆశాదేవి వ్యాఖ్యానించగా, తమ కూతురికి న్యాయం జరిగిందని, ఇలాంటి అన్యాయానికి గురైన బాధితుల కోసం ఇకపై పోరు కొనసాగిస్తామని బద్రీనాథ్ పేర్కొన్నారు. ఉరిశిక్ష అమలు మూడుసార్లు వాయిదా పడటంపై స్పందిస్తూ.. శిక్ష అమలును వాయిదా వేసేందుకు చేసే ఇలాంటి కుయుక్తులకు అడ్డుకట్ట వేసేలా మార్గదర్శకాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టును వారు అభ్యర్థించారు. ‘ఇప్పటికైనా మిగతా బాధితులకు సకాలంలో న్యాయం జరగాలి. అందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు జరగాలి. ఆ దిశగా పోరాటం సాగిస్తాం’ అన్నారు. ఈ రోజు తన కూతురి ఆత్మ శాంతించిందని భావిస్తున్నానని భావోద్వేగంతో ఆశాదేవి వ్యాఖ్యానించారు. మా ఊరి ప్రజలు ఈ రోజే హోళి పండుగ జరుపుకుంటారన్నారు. ఈ శిక్ష తరువాతైనా.. తల్లిదండ్రులు మహిళలతో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తమ కుమారులకు నేర్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ‘గురువారం రాత్రి సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఇంటికి వచ్చి నా కూతురు ఫొటోను హత్తుకుని, బేటీ.. నీకు న్యాయం జరిగింది’ అని విలపించానని ఆశాదేవి తెలిపారు. రాత్రంతా తామిద్దరికి కంటి మీద కునుకు లేదన్నారు. మార్చి 20వ తేదీ చరిత్రలో నిలిచిపోవాలని, ఈ రోజును ఏటా ‘నిర్భయ న్యాయ దివస్’గా జరుపుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశాదేవి ఇంటి వద్ద తెల్లవారు జామున గుమికూడిన ప్రజలు ఉరిశిక్ష అమలుపై ‘కౌంట్ డౌన్’ నిర్వహించారు. -
నా కుమార్తెకు న్యాయం జరిగింది
-
నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ
సాక్షి, న్యూఢిల్లీ : ‘ ఇన్నాళ్లకు నా కుమార్తెకు న్యాయం జరిగింది.. ఆత్మకు శాంతి కలిగింది’’ అన్నారు నిర్భయ తల్లి ఆశాదేవీ. శుక్రవారం నిర్భయ దోషులను ఉరితీయటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ. ‘‘ ఏడేళ్లపాటు పోరాటం చేశా. ఆలస్యమైనా చివరకు న్యాయం గెలిచింది. ఇప్పటికైనా చట్టంలోని లోపాలను సరిచేయాలి. నిర్భయ ఫొటోను పట్టుకుని నీకు ఇవాళ న్యాయం జరిగిందని ఏడ్చాను. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాలని న్యాయపోరాటం చేస్తా. ఇప్పటికైనా చట్టంలోని లోపాలను సరిచేయాలి. మన ఇంట్లో, మన చుట్టుప్రక్కలి మహిళలపై ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వారికి తోడుగా నిలవాల’ని కోరారు. ( నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు ) కాగా, నిర్భయ తల్లి ఆశాదేవీ 7ఏళ్ల సుదీర్ఘ పోరాటం నేడు ఫలించింది. ఈ కేసులో దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలకు తెల్లవారుజామున 5:30 గంటలకు తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు చేశారు. జైలు అధికారుల సమక్షంలో తలారి పవన్ వారిని ఉరితీశారు. దేశ చరిత్రలో ఒకే సారి నలుగురు వ్యక్తులను ఉరి తీయటం ఇదే ప్రథమం. చదవండి : ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’ -
ఉరి ఖాయం.. ఇక నా కూతురి ఆత్మకు శాంతి!
సృష్టిలోని ప్రతీ తల్లికి తన బిడ్డ అపురూపమే. ప్రాణాలు పణంగా పెట్టి జన్మనిచ్చిన తన పాపాయికి చిన్న ఆపద కలిగినా అమ్మ మనసు తట్టుకోలేదు. ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో ఆ మాతృమూర్తి మనోభావాలు మరింత సున్నితంగా ఉంటాయి. కూతురు ఉన్నతోద్యోగం చేస్తూ.. పదిమందిని శాసించే స్థాయిలో ఉన్నా చంటి బిడ్డలాగే తనను లాలిస్తుంది. చిన్ననాడు తన చీర కట్టుకుని మురిసిపోయిన తన చిట్టితల్లి .. అత్తింటికి వెళ్లి... తనో బిడ్డకు తల్లిగా మారితే చూసి మురిసిపోవాలనుకుంటుంది. ఢిల్లీకి చెందిన ఆశాదేవి కూడా తన కూతురి విషయంలో సరిగ్గా ఇలాగే ఆలోచించారు. అయితే ఆమె ఆశలను చెల్లాచెదురు చేశారు ఆరుగురు మృగాళ్లు. ఆమె కూతురిపై అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి.. తీవ్రంగా హింసించి ఈ లోకంలో లేకుండా చేశారు. ఆశాదేవికి గర్భశోకం మిగిల్చారు. అవును... సామూహిక అత్యాచారానికి గురై అత్యంత దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలు విడిచిన నిర్భయకు తల్లి ఆమె. రెండు గంటల్లో తిరిగి వచ్చేస్తానమ్మా బయటకు వెళ్లిన కూతురిపై ఏ మృగం దాడి చేసిందో తెలియనంతగా.. కూతురి శరీరం రక్తంతో తడిసిపోతే కళ్లారా చూసి గుండె పగిలేలా రోదించింది. పెదవులు చిట్లిపోయి... తలమీద చర్మం ఊడిపోయి... మాంసపు ముద్దలా ఆస్పత్రి మంచం మీద పడి ఉన్న బిడ్డకు ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురుచూసింది. తమ కెరీర్లో ఇంతటి ఘోరమైన కేసును ఎప్పుడూ చూడలేదని వైద్యులు వాపోయినా.. ఏదో ఒక అద్భుతం జరిగి తన చిన్నారి తల్లి కళ్లు తెరుస్తుందనుకుంది.(నిర్భయ దోషులకు ఏ అవకాశాలు లేవు: ఢిల్లీ కోర్టు) కానీ నిర్భయ తన తల్లి కలలను కల్లలు చేస్తూ శాశ్వతంగా ఆమెకు దూరమైంది. చికిత్స పొందుతున్న క్రమంలో ఏనాడు కనీసం గుక్కెడు మంచి నీళ్లు కూడా తాగకుండానే ఈ ప్రపంచాన్ని విడిచివెళ్లిపోయింది. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి కోలుకోవడం ఏ తల్లికైనా సాధ్యం కాదు. ఆశాదేవి కూడా ఇందుకు అతీతురాలు కాదు. కూతురిని తలుచుకుని అందరిలాగే కుంగిపోయింది. బిడ్డ జ్ఞాపకాలతో పిచ్చిపట్టినదానిలా అయిపోయింది. అయితే ఇలా ఏడుస్తూ కూర్చుంటే.. తన కూతురికి న్యాయం జరగదనే సత్యం ఆమెకు తొందరగానే బోధపడింది. అందుకే తనకు కడుపుకోత మిగిల్చిన వాళ్లకు సరైన శిక్ష పడేలా చేసేందుకు నడుం బిగించింది. ఓ తల్లిగా తాను సర్వం కోల్పోయినా.. మనసును బండరాయి చేసుకుంది. బాధను దిగమింగి తనలోని శక్తినంతటినీ కూడగట్టుకుని ఏడేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తోంది.( ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’: నిర్భయ దోషి భార్య) ఈ క్రమంలో ఆశాదేవికి ఎదురైన చేదు అనుభవాలకు లెక్కేలేదు. ‘‘ఆడపిల్లను ఒంటరిగా ఎందుకు బయటకు పంపిస్తారు. అలా అబ్బాయిలతో స్నేహం చేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురుకాక ఇంకేమవుతుంది. రాత్రీ పగలూ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఇలాగే అవుతుంది’’అని సామాన్యుల నుంచి దోషుల లాయర్ వరకు ప్రతీ ఒక్కరు సూటిపోటి మాటలతో ఆమెను చిత్రవధ చేశారు. అయినా వాటన్నింటినీ ఆమె లెక్కచేయలేదు. తన కూతురి కోసం వీధుల్లో నిరసన కార్యక్రమాలకు దిగిన యువత ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగింది. జిల్లా కోర్టు మొదలు.. హైకోర్టు.. సుప్రీంకోర్టు ఇలా న్యాయం కోసం ఆమె ఎక్కని కోర్టు మెట్టులేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో మార్చి 13, 2014లో అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డారనడానికి సరైన ఆధారాలు లభించిన మీదట నిర్భయ దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే వాళ్లు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దిగువకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లారు.(ఉరితీయొద్దు.. సరిహద్దుకు పంపండి : దోషుల లాయర్) ఈ నేపథ్యంలో 2017 మే 5న నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఆశాదేవి మనస్సు కాస్త శాంతించింది. ఇక మరణశిక్ష అమలే తరువాయి అని ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ తీర్పును కేవలం ఆశాదేవి మాత్రమే కాదు సగటు ఆడపిల్లల తల్లితండ్రులు, నిర్భయకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరు స్వాగతించారు. అయితే శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వచ్చినంత మాత్రాన అది సత్వరమే అమలు కాదని తెలుసుకోవడానికి ఆశాదేవికి ఎక్కువ సమయం పట్టలేదు. అయినా ఆమె తన పోరాటం ఆపలేదు. భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో అలుపెరుగక కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యతను మారుతున్న ప్రభుత్వాలు, ప్రసంగాలు దంచే నాయకులకు గుర్తుచేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో అనేక పిటిషన్లు, రివ్యూ పిటిషన్లు, న్యాయ ప్రక్రియల అనంతరం జనవరి 22, 2020లో ఉరిశిక్ష అమలు చేసేందుకు ఢిల్లీ పటియాలా హౌజ్‌కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. అయితే దోషుల వరుస పిటిషన్లతో.. ఫిబ్రవరి 1 తర్వాత మార్చి 3కు వాయిదా పడింది. అనంతరం మార్చి 20న నలుగురు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ ఉరితీయాలంటూ తాజా డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే ఉరిశిక్ష అమలు తేదీ సమీపిస్తున్న వేళ.. తాజాగా నిర్బయ దోషులు మరోసారి కోర్టు తలుపు తడుతున్నారు. భారత్‌లో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు ఏ పాపం తెలియదని.. తమను బలిపశువులు చేశారంటూ ఐసీజేకు విన్నవించారు. (‘ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు’) మరోవైపు వారి కుటుంబ సభ్యులు తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాయగా.. దోషుల్లో ఒకడైన అక్షయ్ భార్య మంగళవారం ఔరంగాబాద్ కుటుంబ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు తాము దాఖలు చేసిన పిటిషన్ల విచారణ పూర్తయ్యేంత వరకు శిక్ష అమలు నిలిపివేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు దోషులు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మరోసారి శిక్ష అమలు వాయిదా పడుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇన్నిసార్లు వాయిదాల గురించి వింటున్న, ఈ కేసు గురించిన వార్తలు చదువుతున్న మనకే ఇంతగా విసుగు వస్తుంటే.. ఇక ఆశాదేవి మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా భూదేవి అంత సహనంతో.. తన కూతురికి ఆలస్యంగానైనా తప్పక న్యాయం జరుగుతుందనే ఆశతో ఆమె ఎదురుచూస్తోంది. ఆ నలుగురికి ఎన్నడూ ఉరిశిక్ష అమలు కానివ్వని దోషుల తరపు లాయర్ తనను సవాలు చేసినా పోరాట పటిమతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతోందని ఒక్కోసారి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేసినా.. మానవ హక్కుల సంఘాల తీరును విమర్శించినా.. దాని వెనుక తల్లి ప్రేమ, ఏడేళ్ల సంఘర్షణ, మానసిక వేదనే తప్ప మరే ఇతర కారణాలు లేవన్న విషయాన్ని గ్రహించాలి. ఇంకోవిషయం... ఇన్నేళ్లుగా ఇంతగా పోరాడుతున్న ఆశాదేవి సంపన్నురాలేమీ కాదు. మెడలో కేవలం నల్లపూసల గొలుసు మాత్రమే ధరించే సాధారణ గృహిణి. భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పొలం అమ్మేసి మరీ కూతురిని చదివించిన వ్యక్తికి భార్య. ఇక గురువారం నాడు దోషులకు ఏ అవకాశాలు లేవంటూ కోర్టులు వారి పిటిషన్లను కొట్టివేసిన నేపథ్యంలో ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘‘వారిని ఉరితీయబోతున్నారు. ఏడేళ్ల తర్వాత నా కూతురి ఆత్మకు శాంతి చేకూరబోతోంది. నాకు కూడా మనశ్శాంతి కలుగుతుంది’’ అని ఆశాదేవి వ్యాఖ్యానించారు.(‘నిర్భయకు ఇక న్యాయం జరుగుతుంది’) దేశ వ్యాప్తంగా సాగుతున్న అకృత్యాల గురించి.. ఆ దోషులను(నిర్భయ దోషులు) కోర్టులో చూసిన ప్రతీసారీ నేను చచ్చిపోయినట్లుగా అనిపిస్తుంది. నాలాగే నా కూతురికి ఈ పరిస్థితి ఎదురవనందుకు సంతోషం. వాళ్లను చూసేందుకు ఈ రోజు నా కూతురు బతికి లేనందుకు కాస్త సంతోషంగా ఉంది. లేకుంటే తాను కూడా ఎంతో వేదన అనుభవించేది. న్యాయం కోసం నేను చాలా ఓపికగా పోరాడుతున్నాను. అయితే 2012 నాటికి.. నేటికీ ఏమీ మారలేదు. ఈ న్యాయపోరాటంలో నాకు నేనే ప్రశ్నగా మారాను. అయినా మా కూతుళ్లు ఏం తప్పు చేశారు. వాళ్లపై ఎందుకు అత్యాచారాలకు పాల్పడి కాల్చివేస్తున్నారు. తల్లిదండ్రులుగా మా తప్పేం ఉంది. మేము ఇంకా ఎన్నాళ్లు న్యాయం కోసం ఎదురుచూడాలి. ఓవైపు న్యాయపోరాటం జరుగుతుండగానే.. మరోవైపు అత్యాచారాలు, ఆడపిల్లల సజీవ దహనాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి సమస్యలకు వ్యవస్థ, సమాజం ఎందుకు పరిష్కారాలను కనుగొనలేకపోతుంది. ముఖేశ్ సింగ్ తల్లి తనను అభ్యర్థించిన సందర్భంలో.. మా కూతురిని కోల్పోయాం. రక్తపు మడుగులో మునిగిన తన శరీరాన్ని చూశా. తన శరీరంపై ఉన్న గాయాలు.. తనపై క్రూర మృగాలు దాడి చేశాయా అన్నట్లు ఉన్నాయి. ఆనాటి నుంచి నా కళ్ల నుంచి రక్తం కారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ... దయ చూపమని అర్థించడం నాపై ఎటువంటి ప్రభావం చూపదు. ఏడేళ్లుగా ఏడ్చీ ఏడ్చీ నేనొక బండరాయిలా మారాను. అత్యంత దారుణ పరిస్థితుల్లో నా కూతురు కొట్టుమిట్టాడటం కళ్లారా చూశాను. రోజూ చస్తూ.. బతుకుతున్నాను. అందుకే నాకు ఎలాంటి భావోద్వేగాలు ఉండవు. రక్తపు కన్నీరు కారుస్తూ న్యాయ పోరాటం చేస్తున్నా. రాజకీయ పార్టీల పరస్పర విమర్శల నేపథ్యంలో నా కూతురిని చంపిన వారికి వేలకొద్దీ అవకాశాలు లభిస్తున్నాయి. కానీ మాకు ఏ హక్కులు లేవా? ఇన్నేళ్లలో నేను ఇంతవరకు రాజకీయాల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయితే ఒక్క విషయం.. 2012లో ఎవరైతే నా కూతురి కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారో.. ఈ రోజు వాళ్లే నా కూతురి చావును అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. 2014లో అధికారంలోకి వస్తే మహిళలపై దాడులు జరగవని చెప్పారు. రెండోసారి కూడా అధికారం చేపట్టి వేల కొద్దీ పనులు చేశారు. ట్రిపుల్ తలాక్ వంటి కీలక అంశాల్లో నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నా కూతురి విషయంలో కూడా త్వరగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోండి. చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఆ నలుగురికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయండి. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి
న్యూఢిల్లీ: ‘‘నాకు చావు అంటే భయం లేదు. నా కూతురిపై ఆ మృగాళ్లు అత్యాచారం చేసిన రోజే నేను చచ్చిపోయాను. ఇప్పుడు కూడా నేను వాళ్లను నిందించాలనుకోవడం లేదు. న్యాయ వ్యవస్థలోని లొసుగులు అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్న తీరును విమర్శిస్తున్నా’’ అని అత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. దోషులకు వెంటనే శిక్ష అమలు చేయడం వల్ల తన కూతురు లాంటి ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడే సాహసం ఇకముందు ఎవరూ చేయలేరని పేర్కొన్నారు. ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం, పలు సార్లు దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేలు, అనేక పిటిషన్ల అనంతరం నిర్భయ దోషులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌ను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఆశాదేవి.. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. డిసెంబరు 16, 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తుచేసుకున్నారు. తన కూతురిపై జరిగిన అత్యాచార కాండ, హత్య, దోషులకు శిక్ష వేయించడానికి తాము చేసిన పోరాటం గురించి పంచుకున్నారు. మానవ హక్కుల పేరిట దోషులను రక్షిస్తున్నారంటూ విమర్శించారు. మరోసారి నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడితే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.(నిర్భయ దోషులను ఎప్పుడో చంపేశారు) తన జాడ తెలియలేదు.. శరీరమంతా రక్తం ‘‘ఆరోజు ఆదివారం. దాదాపు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో నిర్భయ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రెండు- మూడు గంటల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పింది. రాత్రి ఎనిమిది అవుతున్నా తన నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో తనకు పలుమార్లు ఫోన్ చేశాం. కానీ కాల్ కట్ అయ్యింది. వెంటనే నేను, నా కొడుకు బస్టాండ్‌కు వెళ్లి తనకోసం వెతికాం. అయినా తన జాడ తెలియరాలేదు. దాదాపు రాత్రి 10 గంటలకు అనుకుంటా. నిర్భయ వాళ్ల నాన్న ఇంటి వచ్చారు. ఆయన కూడా తనకోసం వెదకడం ఆరంభించారు. పదకొండు గంటల వరకు మేం బయటే నిల్చుని ఉన్నాం. తనకోసం ఎదురుచూస్తున్నాం. ఇంతలో సఫ్దార్జంగ్ ఆస్పత్రి నుంచి కాల్ వచ్చింది. మా ఆయన ఫోన్ ఎత్తగానే.. నిర్భయ ఆస్పత్రిలో ఉందని.. తనకు గాయాలయ్యాయని చెప్పారు. వెంటనే మేం అక్కడికి చేరుకున్నాం. ఆలోగా తనను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. నన్ను చూడగానే నిర్భయ ఏడ్వడం మొదలుపెట్టింది. (తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని) తన శరీరమంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నాకు ఒక్కసారిగా ఏం అర్థంకాలేదు. నేర తీవ్రతను కూడా అంచనా వేయలేకపోయాం. అప్పుడే తన మీద ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. తన పెదాలు చీరుకుపోయి ఉన్నాయి. తన తల మీద చర్మం అంతా ఊడిపోయింది. ఒంటి నిండా కోతలు, గాయాలు, వాటి నుంచి కారుతున్న రక్తం. కొన్నిచోట్ల మాంసం కూడా బయటకు వచ్చింది. తన పరిస్థితి చూసి డాక్టర్లకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. తనను ఎలా బతికించాలో వారికి అంతుపట్టలేదు. ఇరవై ఏళ్ల కెరీర్లో తాను ఎంతో మందిని బతికించాను గానీ.... ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఓ సీనియర్ డాక్టర్ మాకు చెప్పారు. అంటే నా కూతురి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా మాలో ఆశ చావలేదు. తనకు స్పృహ వస్తుందని ఎంతగానో ఎదురుచూశాం. ఆశించినట్టే తను కళ్లు తెరిచింది. తనకు నయం అవుతుందని భావించాం. అయితే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తను బతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. తనకు స్పృహ వచ్చిన వెంటనే మంచినీళ్లు కావాలని అడిగింది. కానీ డాక్టర్లు అందుకు నిరాకరించారు. చెంచాడు నీళ్లు తాగేందుకు కూడా తన శరీరంలో ఏ వ్యవస్థ సహకరించదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నా కూతురు దాదాపు 10- 20 రోజులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. కానీ ఈ ప్రపంచం నుంచి ఒక్క చుక్క మంచినీరు కూడా తీసుకోలేకపోయింది’’అని ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటూ ఆశాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.(‘నా కూతురు బతికిలేదు.. చాలా సంతోషం’) తన న్యాయం పోరాటం గురించి చెబుతూ... ‘‘ గడిచిన ఏడు- ఎనిమిదేళ్ల కాలంలో మేం ఎక్కని కోర్టు మెట్టులేదు. మొదట జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు.. అనంతరం సుప్రీంకోర్టు ఇలా అన్నిచోట్లకు వెళ్లాం. సర్వోన్నత న్యాయస్థానం దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే మాకు న్యాయం జరిగినట్లేనని భావించాం. దోషుల రివ్యూ పిటిషన్‌ను 2018లో కోర్టు తిరస్కరించగానే సంతోషపడ్డాం. అప్పటి నుంచి నేటి దాకా ప్రతీ విచారణకు నేను హాజరవుతూనే ఉన్నాను. నా కుటుంబాన్ని వదిలేసి మరీ కోర్టుల చుట్టూ తిరిగాను. న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. (లాయర్‌ను తొలగించా.. టైం కావాలి: నిర్భయ దోషి) అయితే నా కూతురి పట్ల అత్యంత హేయంగా వ్యవహరించిన ఆ మృగాళ్లు తమ లాయర్‌ను అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తారని నేను అస్సలు ఊహించలేదు. వాళ్లను నేరస్థులుగా చిత్రీకరించామని వాళ్లకు వాళ్లు చెప్పుకోవచ్చు. వాళ్ల తీరు నన్నెంతగానో బాధ పెట్టి ఉండవచ్చు. వాళ్ల ఎత్తుగడల వల్ల... నా కూతురి మీద అత్యాచారం జరిగిందని నేను పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోంది. ఈ అయినా నేను పోరాటం ఆపలేదు. ఎందుకంటే ఇలాంటి అకృత్యాలు కేవలం నా కూతురి ఘటనతోనే ఆగిపోలేదు. ఆగిపోవు కూడా. వాళ్ల ఉరిశిక్ష వాయిదా పడటం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. ఇలాంటి దోషుల వల్లే న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయి.(సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా..) మానవ హక్కుల పేరిట వ్యాపారం.. ఇక ఎప్పుడైతే దోషుల మెడకు ఉరి బిగుసుకుపోతుందని వాళ్ల కుటుంబాలకు, లాయర్‌కు తెలుస్తుందో.. అప్పుడే వాళ్లు పేదవాళ్లు అనే సంగతి గుర్తుకువస్తుంది. ఇంకో విషయం.. ప్రపంచ మానవ హక్కుల సంస్థ.. ఇలాంటి నేరస్థుల హక్కుల గురించి మాట్లాడుతుంది. వాళ్లకు మద్దతుగా నిలుస్తుంది. పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి పేరు సంపాదించుకుంటుంది. మానవ హక్కుల పేరిట పెద్ద వ్యాపారమే చేస్తోంది’’అని ఆశాదేవి విమర్శించారు. ఒకవేళ ఇలాంటి నేరగాళ్లు బెయిలు మీద బయటకు వస్తే.. బాధితులను, బాధితుల కుటుంబాలను చంపడానికైనా సిద్ధపడతారు. తగులబెట్టేందుకు కూడా వెనుకాడరు. మన కూతుళ్లు సురక్షితంగా ఉండాలంటే.. ఇలాంటి మృగాళ్లను ఉరితీయాల్సిందే’’ అని అభిప్రాయపడ్డారు.(దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి) -
వారి చావును చూడాలనుంది : ఆశాదేవి
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార దోషులకు పటియాల హౌస్‌కోర్టు తాజాగా డెత్‌వారెంట్లు జారీచేయడంపై ఆమె తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. దోషుల ఉరితీతపై గురువారం విచారణ సందర్భంగా కోర్టు వద్దకు చేరుకున్న ఆమె.. తీర్పు అనంతరం ఆమె తరఫున వాదించిన న్యాయవాదిని కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. డెత్‌వారెంట్లు జారీ అనంతరం ఆశాదేవి మీడియా మాట్లాడారు. ‘నా కూతురిపై అత్యాచారం జరిపిన నలుగురు దోషులను ఉరితీసే సమయం ఆసన్నమైంది. నలుగురు కామాంధులను ఉరితీసిన రోజే నా కూతురికి న్యాయం జరిగినట్టు. అదే మాకు పెద్ద విజయం. ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటం విచారం. ఇక వారికున్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోయాయి. దోషులు చట్టం నుంచి ఇక తప్పించుకోలేరు. అవకాశం ఉంటే.. వారి చావును నాకు చూడాలని ఉంది’ అని అన్నారు. (నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ) నిజానికి ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3 ఉదయం 6 గంటలకు ఉరితీయాల్సి ఉంది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉరితీత మూడోసారి వాయిదాపడింది. తాజాగా ట్రయల్‌కోర్టు కొత్త డెత్‌వారెంట్లు జారీచేస్తూ మార్చి 20న ఉరితీయాలని ఆదేశించింది. అయితే దోషులకు ఉన్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోవడంతో ఈసారి శిక్ష అమలు జరిగి తీరుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
నిర్భయకు న్యాయం జరగకుంటే..
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయకు న్యాయం జరగకుంటే హత్యాచారం వంటి తీవ్ర నేరాలకు గురైన ఇతర బాధితులెవరికీ న్యాయం జరిగే పరిస్థితి ఉండదని నిర్భయ తల్లి ఆశాదేవి స్పష్టం చేశారు. నిర్భయకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ సమిష్టిగా ముందుకు రావాలని ఆమె ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ కోరారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నిర్భయ హత్యాచార ఘటన జరిగి ఎనిమిదేళ్లయినా ఇంతవరకూ దోషులను ఉరితీయని క్రమంలో ఆశాదేవి తన కుమార్తెకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలని, ప్రాధేయపడాల్సిన అవసరం లేదని అన్నారు. పరిస్థితులు మారినా తాను ఇంకా కోర్టు ముందు చేతులు జోడించి తమ కుమార్తెకు న్యాయం చేయాలని వేడుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. దోషులను ఉరితీసినా తన పోరాటం కొనసాగుతుందని, ఇది తన ఒక్కరి పోరాటం కాదని, ఈ దేశం బిడ్డల కోసం తన పోరాటం సాగుతుందని ఆశాదేవి స్పష్టం చేశారు. దోషులను వదిలివేయాలని తనను అడుగుతున్న వారు తమ బిడ్డలకు ఇదే జరిగితే వారు దోషులను వదిలివేస్తారా అని ఆమె ప్రశ్నించారు. కోర్టులపై విశ్వాసం సన్నగిల్లినందునే దిశ నిందితుల ఎన్కౌంటర్ అనంతరం హైదరాబాద్‌లో ప్రజలు స్వీట్లు పంచుకున్నారని గుర్తుచేశారు. మహిళలపై నేరాలను తగ్గించేందుకు నిర్భయకు న్యాయం చేయాలని తాను సుప్రీంకోర్టును కోరతానని అన్నారు. మానవహక్కుల కార్యకర్తలు వారి మనుగడ కోసం చెప్పే మాటలు తాను వినదల్చుకోలేదని, దోషులను ఉరితీయాల్సిందేనని తేల్చిచెప్పారు. కోర్టు తన ఎదుటే దోషుల హక్కుల గురించి మాట్లాడుతూ తన బాధను విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా నిర్భయ దోషులను మార్చి 3న ఉరితీయాలని కోర్టు తాజా డెత్‌వారెంట్ జారీ చేసింది. చదవండి : మార్చి 3న ఉరితీయండి -
లాయర్ లేడట.. నేనేమో అడుక్కోవాలి
-
లాయర్‌ను తొలగించా.. టైం కావాలి: నిర్భయ దోషి
న్యూఢిల్లీ: తన తరఫున వాదిస్తున్న ప్రస్తుత లాయర్‌ను తొలగించిన కారణంగా తనకు మరింత గడువు ఇవ్వాలని నిర్భయ దోషి పవన్ గుప్తా కోర్టును అభ్యర్థించాడు. కొత్త లాయర్‌ను నియమించుకునేంత వరకు విచారణ వాయిదా వేయాలని కోరాడు. కాగా నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన (ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా) వాళ్లందరికీ ఒకేసారి శిక్ష విధించాలని... చట్టపరంగా వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్లకు ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు ఫిబ్రవరి 5న పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఈ క్రమంలో నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా.. తన తరఫున వాదించేందుకు ఎవరూ లేని కారణంగా మరింత సమయం ఇవ్వాలని కోరాడు. ఇందుకు స్పందించిన కోర్టు.. తామే లాయర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు హాలులోనే ఉన్న నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శిక్ష అమలును జాప్యం చేసేందుకే దోషులు నాటకాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.(ఒకేసారి కాదు.. ఒక్కొక్కరిని ఉరి తీయండి: నిర్భయ తల్లి) ‘‘దోషుల ఉరిశిక్ష అమలుకు సంబంధించి న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని ఏడాదిన్నరగా అడుగుతూనే ఉన్నాను. ఢిల్లీ హైకోర్టు తీర్పును అనుసరించి వారికి డెత్ వారెంట్లు జారీ చేయలేదు. వారం రోజుల గడువు ఇచ్చారు. ఇప్పుడు వాళ్లు లాయర్ లేకుండా కోర్టుకు హాజరయ్యారు. బాధితురాలి తల్లినైన నేను ఇక్కడ ఉన్నాను. చేతులు కట్టుకుని న్యాయం కోసం అర్థిస్తున్నాను. మరి నా హక్కులు ఏమై పోయినట్లు’’ అని న్యాయమూర్తి ముందు తన బాధను వెళ్లగక్కారు. ఇందుకు స్పందించిన జడ్జి.. ‘‘ఇక్కడ ప్రతీ ఒక్కరు మీ హక్కుల గురించి ఆలోచిస్తున్నారు. అందుకే ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి’’ అని సమాధానమిచ్చారు. (తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని) ఇక నిర్భయ తరఫు లాయర్ వాదిస్తూ.. సోమవారం దాకా దోషులకు లాయర్‌గా వ్యవహరించిన ఏపీ సింగ్ ఏమయ్యారని.. ఇప్పుడు పవన్ గుప్తా తన లాయర్‌ను తొలగించుకోవడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన జడ్జి.. ‘‘అతడికి గొప్ప లాయర్‌ను పెడతాం. ఇంకా వేరే ఏమైనా ఆప్షన్లు ఉన్నాయో ఆలోచిస్తాం’’అని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో నిర్భయ తండ్రి మాట్లాడుతూ దోషులకు కోర్టు లాయర్‌ను నియమిస్తే.. నిర్భయకు అన్యాయం చేసినవాళ్లు అవుతారు అని పేర్కొనగా.. వాళ్లకు లాయర్‌ను పెట్టకపోవడం అన్యాయం అవుతుందని జడ్జి సమాధానమిచ్చారు. ఈ క్రమంలో నిర్భయ తల్లిదండ్రులు, మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా కోర్టు ప్రాంగణంలో నిరసనకు దిగారు. దోషులను ఉరి తీయాలంటూ నినాదాలు చేస్తున్నారు.(దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి) కాగా ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్ న్యాయపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకోగా.. వినయ్ శర్మ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించగా... పవన్ గుప్తా కేవలం రివ్యూ పిటిషన్ మాత్రమే దాఖలు చేశాడు. ఇంకా అతడికి క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక ఒకే కేసులో దోషులైన వాళ్లందరికీ ఒకేసారి శిక్ష విధించాలని... చట్టపరంగా వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. దోషులు వరుసగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగా.. తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వినయ్ శర్మ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాడు. ఇక ఈరోజు పవన్ తనకు లాయర్ లేడంటూ కొత్త నాటకానికి తెరతీశాడు. కాగా నిర్భయ దోషులను జనవరి 22న ఉరితీయాలంటూ తొలుత డెత్ వారెంట్లు జారీ కాగా... వారికి చట్టపరంగా అన్ని హక్కులు కల్పించాలంటూ దోషుల తరఫు లాయర్ వాదించడంతో.. ఫిబ్రవరి 1 ఉరితీసేందుకు ఢిల్లీ పటియాలా కోర్టు మరోసారి వారెంట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా అన్ని అవకాశాలు వినియోగించాలంటూ కోర్టు సూచించగా.. లాయర్ లేడంటూ మరోసారి శిక్ష అమలులో జాప్యం నెలకొంది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాలు చేసిన దోషి! -
ఆ తీర్పును స్వాగతిస్తున్నా: నిర్భయ తల్లి
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు వారం రోజుల గడువు ఇస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బాధితురాలి తల్లి ఆశాదేవి తెలిపారు. న్యాయస్థానం విధించిన గడువుతో దోషులను ఉరితీస్తారనే నమ్మకం కలిగిందన్నారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు విధించిన మరణ శిక్ష అమలులో ఆలస్యాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. శిక్ష అమలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. అదే సమయంలో దోషులందరికీ న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకునేందుకు వారం రోజుల గడువు విధించింది. అదే విధంగా ఈ కేసులోని దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ... ‘‘ఢిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు ఆ నలుగురు దోషులకు వారం సమయం ఇచ్చింది. ఇక వాళ్లను త్వరలోనే ఉరితీస్తారు’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా... నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్‌కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించినట్లు హోంశాఖ అధికారులు బుధవారం తెలిపారు. ఇక ఈ కేసులో దోషులైన అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే. (నిర్భయ కేసు: నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలి..) నిర్భయ దోషులకు త్వరలోనే ఉరి: కేంద్ర మంత్రి నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై జాప్యం గురించి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ... ఉరిశిక్ష అమలు జరిగితీరుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ లోక్‌సభలో తెలిపారు. దోషులు ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నిర్భయ కేసులో ఇప్పటికే దోషులకు ఉరిశిక్ష విధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్రం చాలా కఠినంగా ఉందనీ, త్వరలోనే దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తారనీ సభకు తెలిపారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేకి వ్యతిరేకంగా కేంద్రం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నిర్భయ దోషులకు శిక్ష అమలు విషయంలో ఇక ఎంతో కాలం వేచి ఉండలేమనీ, క్షమాభిక్ష అర్జీలతో సహా న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకున్నందున దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా... -
దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి
-
దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లకు శనివారం అమలు జరగాల్సిన మరణ శిక్షను నిలుపుదల చేస్తూ పాటియాలా హౌజ్ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో... కోర్టు ప్రాంగణంలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్.. ఆ నలుగురికి ఎన్నడూ ఉరిశిక్ష అమలు కానివ్వని తనను సవాలు చేశాడని పేర్కొన్నాడు. అయితే తాను మాత్రం తన కూతురికి న్యాయం జరిగేంత వరకు.. దోషులను ఉరి తీసేంత వరకు పోరాటం ఆపబోనని స్పష్టం చేశానని తెలిపారు.(సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా..) ఎందుకు ఆశలు కల్పించారు? కోర్టు ప్రాంగణంలో ఆశాదేవి విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం.. ప్రతీ ఒక్కరూ వినండి. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు నేరస్తుల ముందు తలవంచుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఇక్కడే వేచి చూస్తున్నాను. ఒకవేళ న్యాయస్థానం వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని భావిస్తే మమ్మల్ని ఇన్ని గంటలు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టినట్లు? మాకు ఎందుకు ఆశలు కల్పించినట్లు. మమ్మల్ని అప్పుడే ఇంటికి పంపివేయాల్సింది కదా. ఏడేళ్లుగా మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏదేమైనా నా పోరాటం ఆగదు’’ అని భావోద్వేగానికి గురయ్యారు. (నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా) ఇక నిర్భయ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో వినయ్ శర్మ మినహా మిగతా ముగ్గురిని శనివారం ఉరితీస్తామని భావించామని.. అయితే కోర్టు ఆదేశాలతో మరోసారి నిరాశకు గురయ్యామన్నారు. దోషులకు శిక్ష అమలయ్యేంత వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. దోషుల హక్కుల గురించి మాట్లాడుతున్న వారు.. బాధితుల హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.(నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీంకోర్టు షాక్) ఒకేసారి కాదు.. ఒక్కొక్కరిని ఉరి తీయండి: నిర్భయ తల్లి తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని ఆరోజే నా కూతురికి న్యాయం.. -
కంగన మాటల్లో తప్పులేదు: నిర్భయ తల్లి
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు. నిర్భయ దోషులకు క్షమించాలని కోరిన న్యాయవాది ఇందిరా జైసింగ్‌పై కంగనా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇందిరా జైసింగ్‌ను నాలుగు రోజులు దోషులతో బంధిస్తే ఆమెకు బాధ తెలిసి వస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఆశాదేవి స్పందిస్తూ.. ‘‘నేను కంగనా మాటలను పూర్తిగా అంగీకరిస్తున్నాను. అమె చెప్పింది నిజమే. ఇందిరా జైసింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు, నాకు ఒకరు మద్దతుగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. రేపిస్టులను బహిరంగంగా ఉరి తీయాలన్న కంగన వ్యాఖ్యల్లో తప్పు లేదు. ఇలా చేస్తేనే భవిష్యత్తులో జరిగే నేరాలను అరికట్టవచ్చు’ అని అన్నారు. అలాగే తన కుమార్తెపై ఇంతటి దారుణం జరిగినప్పుడు ఏమి జరిగిందో తనకు మాత్రమే తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2012 డిసెంబర్ 16 న కదులుతున్న బస్సులో 23 ఏళ్ల నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. వీరిలో నలుగురికి ఫిబ్రవరి 1న మరణశిక్ష అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. (ఇందిర విజ్ఞప్తి: కంగనా ఘాటు వ్యాఖ్యలు) -
దేవుడే అడిగినా
‘‘పాపం ఆ పిల్లలకు మీరైనా క్షమాభిక్ష ప్రసాదించవచ్చు కదా’’ అని నిర్భయ తల్లి ఆశాదేవిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అడిగినప్పుడు.. ‘‘దేవుడే వచ్చి అడిగినా నేను క్షమించను’’ అని ఆశాదేవి అన్నారంటే.. దేవుడిక్కూడా వాళ్లను క్షమించమని సిఫారసు చేసే హక్కు లేదని ఆమె గట్టిగా చెప్పడమే. మాధవ్ శింగరాజు ఉరిశిక్ష పడిన ‘నిర్భయ’ దోషులు చరిత్రలో కలిసిపోడానికి మెడ దగ్గరి ఎముక ‘టప్’మన్నంత క్షణకాల సమయం చాలు. ఆ క్షణం తర్వాత ఎవరైనా మాట్లాడేందుకేమీ ఉండదు. ఎవరికీ గుర్తొచ్చేందుకూ ఏమీ ఉండదు. ‘ముఖేశ్ సింగ్ అండ్ కో’ ఏమీ భగత్‌సింగ్ అండ్ టీమ్ కాదు.. మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఉరితీసిందని ఏటా చెప్పుకుని ఘనమైన నివాళి ఘటించడానికి. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ‘నిర్భయ’ దోషులకు ఉరి అంటున్నారు కాబట్టి.. ఆ రోజు మనం నిద్రలేచి ఏ ఏడుగంటలకో పేపర్లోనో, టీవీలోనో వార్తను చూసి.. ‘ఉరి తీసేశారా..’ అనుకుంటాం తప్ప, షాక్ కొట్టినట్లుగా ‘అయ్యో ఉరి తీసేశారా!’ అని పెద్దగా అరుస్తూ చేతిలోని టీ కప్పును మీద ఒలకబోసుకోం. వాళ్లేమీ స్వాతంత్య్ర సంగ్రామ యువ కిశోరాలు కాదు. వాళ్లను ఉరితీశారన్న వార్తను చూసి మనం కోమాలోకి వెళ్లిపోడానికి. మన సంగతి అలా ఉంచండి. నిర్భయ తల్లి ఆశాదేవి మాత్రం ఈసారి కోమాలోకి వెళ్లిపోయేట్లే ఉన్నారు. వాళ్ల ఉరి తేదీ ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ కనుక వాయిదా పడితే! శుక్రవారం ఆమెది దాదాపుగా అదే పరిస్థితి. ఢిల్లీ కోర్టు ఉరిని వాయిదా వేసిందని తెలియగానే నిస్పృహ ఆమె కళ్లలోంచి ఉబికి ఉబికి వచ్చింది. ‘హమే బస్ తారీఖ్ పే తారీఖ్ మిల్ రహీ హై’ (తేదీ తర్వాత తేదీ మాత్రమే మాకు లభిస్తోంది) అని ఆక్రోశించారు. ‘‘నా కూతుర్ని పాడు చేసినట్లే, ఆ నలుగురూ న్యాయదేవతనూ పాడు చేస్తున్నారు’’ అని వేదన పడ్డారు. ప్రతిసారీ ఆమెకు ఇలాగే అవుతోంది. కోర్టు శిక్షను విధించినప్పుడు తన కూతురికి న్యాయం జరిగిందని కళ్లు తుడుచుకోవడం, శిక్ష అమలు వాయిదా పడగానే తన కూతురికి అసలు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందా అని కన్నీళ్లు పెట్టుకోవడం! నవ్విస్తే అంతలోనే నవ్వి, ఏడిపిస్తే అంతలోనే ఏడ్చే పిల్లలా తయారైంది ఆమె మానసిక స్థితి. జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరిని ఖరారు చేస్తూ ఈ నెల 7న కోర్టు డెత్ వారంట్ జారీ చెయ్యగానే తన ఏడేళ్ల పోరాటం ఫలించిందనే నిర్భయ తల్లి అనుకున్నారు. ఆ లోపలే ఉరి ఫిబ్రవరి అనే మాట! ఉరికి తీహార్‌లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తలారి కూడా తాళ్లు పేనుకుని కూర్చున్నాడు. దోషుల బరువుకన్నా యాభై కిలోలు ఎక్కువ బరువున్న ఇసుక బస్తాలను ‘ఉరి తీసి’ పరీక్షించుకున్నారు. కుటుంబ సభ్యులొచ్చి చివరి చూపు చూసి వెళ్తున్నారు. ఇక అంతా అయిపోయినట్లే.. మిగిలింది అంతిమశ్వాసే అనుకుంటుండగా.. మరోసారి ఉరి వాయిదా. ఇంత సాగతీత ఏమిటని నిర్భయ తల్లి హృదయం క్షోభించడం న్యాయమే. అయితే చట్టం తీసుకుంటున్న సమయం కూడా ఆ తల్లికి న్యాయం చేయడానికే. మూడేళ్ల క్రితమే 2017 మే 5 న సుప్రీంకోర్టు.. ‘ఉరే సరి’ అని కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అదే సమయంలో ఉరిని తప్పించుకునేందుకు దోషులకు చట్టంలో ఉన్న మూడు దారులను కూడా చూపించింది. మొదటిది రివ్యూ పిటిషన్. అది ఫలించకపోతే క్యురేటివ్ పిటిషన్. అదీ నిష్ఫలం అయితే క్షమాభిక్ష పిటిషన్. మొదటి రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో వేసేవి. క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతికి సమర్పించుకునేది. దోషులు నలుగురూ ఒకేసారి ఒక దాని తర్వాత ఒకటిగా ఈ మూడు దారుల్లోనూ వెళ్లిపోయి, అక్కడ కూడా వాళ్లకేమీ దక్కకపోయుంటే ఈ సరికి బహుశా ఉరి అమలు జరిగి ఉండేది. కానీ అలా జరగలేదు. మొదట ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా ఏమాత్రం జాప్యం లేకుండా రివ్యూ పిటిషన్లు వేశారు. వేసిన ఏడాది తర్వాత 2018 జూలై 9న సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. అక్షయ్ ఠాకూర్ ఒక్కడూ 2019 డిసెంబర్ 10న రివ్యూ పిటిషన్ వేశాడు! నిజానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నెలలోపే రివ్యూ పిటిషన్ వెయ్యాలి. అయితే బలమైన కారణాలేవో చూపించి అక్షయ్ తరఫు న్యాయవాదులు ఆలస్యంగా రివ్యూ పిటిషన్ వేశారు. వేసిన ఎనిమిది రోజుల్లోనే అది తిరస్కరణకు గురైంది. ఇక ఈ నలుగురికీ మిగిలిన రెండో దారి క్యురేటివ్ పిటిషన్. గత ఏడాది జనవరి 9న ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ క్యురేటివ్ పిటిషన్‌ను పెట్టుకున్నారు. కోర్టు వాటిని ఐదు రోజులకే (జనవరి 14న) తిరస్కరించింది. అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా అసలు క్యురేటివ్ పిటిషనే పెట్టుకోలేదు. రివ్యూ పిటిషన్లా నెలలోపు కాకుండా, ఉరి తేదీ లోపు ఎప్పుడైనా క్యురేటివ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి 1న ఉరి అన్నారు కాబట్టి ఆ లోపు అక్షయ్, పవన్ క్యురేటివ్ పిటిషన్ పెట్టుకునే వీలు ఉంటుంది. ఆ తర్వాత ఇక ఈ నలుగురికీ మిగిలి ఉండే ఏకైక మార్గం రాష్ట్రపతి క్షమాభిక్ష. ముఖేశ్ సింగ్ ఒక్కడే ఈ జనవరి 14న క్షమాభిక్ష కోరాడు. రాష్ట్రపతి దానిని జనవరి 17నే తిరస్కరించారు. క్షమాభిక్షను తిరస్కరించిన తర్వాత ఉరి తీయడానికి కనీసం వ్యవధి 14 రోజులు ఉండాలి కనుక రెండో డెత్ వారెంట్ ఫిబ్రవరి 1 అయింది. తక్కిన ముగ్గురూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోలేదు.వీళ్లలో ఒకరో ఇద్దరో లేక ముగ్గురూనో క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుని, ఆ పిటిషన్ ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రభుత్వానికి వెళ్లి, అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరి, ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే. ఆ తీసుకున్న తేదీ నుంచి ఉరి మళ్లీ పద్నాలుగు రోజులు వాయిదా పడుతుంది.ఒకే నేరంలో దోషులుగా నిర్థారణ అయినవారిని విడివిడిగా ఉరి తీసిన సందర్భాలు గతంలో లేవు కాబట్టి.. చివరి మూడు దారులనూ ఉపయోగించుకున్న ముఖేశ్ సింగ్ కూడా.. క్యురేటివ్ పిటిషన్, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ వెయ్యని అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా; క్యురేటివ్ పిటిషన్ వేసినా, క్షమాభిక్ష పిటిషన్ వెయ్యని వినయ్ శర్మల మార్గాలన్నీ మూసుకుపోయే వరకు క్షణాలను లెక్కపెడుతూ ఉండవలసిందే. ఈ నలుగురితో పాటు క్షణాలను లెక్కిస్తూ ఉన్న ఐదో వ్యక్తి నిర్భయ తల్లి ఆశాదేవి. అక్షయ్, ముఖేశ్, వినయ్, పవన్.. ఈ ఏడాది జనవరి ఏడున డెత్ వారంట్ వచ్చినప్పటి నుంచి మాత్రమే క్షణాలను లెక్కిస్తూ ఉంటే.. ఆశాదేవి, ఏడేళ్లుగా దోషుల చివరి క్షణాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ►ఇందిరా జైసింగ్ విజ్ఞప్తిని పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే కనుక.. ఈ దేశంలో రోజుకు 90 మంది తల్లులు తమ కూతుళ్లపై అత్యాచారం చేసిన దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడానికి క్యూలో నిలబడవలసి వస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. దేశంలో రోజూ సగటున తొంభై రేప్‌లు జరుగుతున్నాయి మరి! -
ఉరితో రేప్‌లకు చెక్!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు భారత రాష్ట్రపతి కూడా తిరస్కరించడంతో నలుగురుకి ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా నిర్భయ తల్లి ఆశాదేవీని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరారు. నేరస్థులకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ గత ఏడేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున ఆశాదేవీ క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తే లేదు. పైపెచ్చు ఉరిశిక్ష వల్ల తనకు న్యాయం జరిగిందంటూ ఆమె సంతప్తి కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. రేప్‌లకు ఉరిశిక్షలు అమలు చేయాలంటూ ఆందోళనలు చేస్తున్న సామాజిక కార్యకర్తలంతా స్వీట్లు పంచుకొని ఆనందోత్సవాలు కూడా జరుపుకోవచ్చు. అసలు ఉరిశిక్షల వల్ల మహిళలపై అత్యాచారాలు తగ్గుతాయా ? అన్నది ప్రస్తుతం ప్రజాస్వామ్యవాదుల ప్రశ్న. నిర్భయ అత్యాచారం, హత్య సంఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగిన నేపథ్యంలో దారుణమైన అత్యాచార సంఘటనల్లో ఉరిశిక్షలు విధించేందుకు వీలుగా కేంద్రం 2013లో చట్ట సవరణ తీసుకొచ్చింది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కల ప్రకారం 2015 నుంచి 2017 మధ్య దేశంలో 31 శాతం మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. ఎక్కువ కేసుల్లో మహిళలపై అత్యాచారం జరిపి అనంతరం హత్యలు చేశారు. ఇది అంతకుముందు చాలా అరుదుగా జరిగేది. బాధితురాలు బతికుంటే తమకు మరణ శిక్షలు పడే అవకాశం ఉందన్న భావంతోనే ఈ హత్యలు జరిగాయని న్యాయ నిపుణులు విశ్లేషించారు. వీటికన్నా అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగితేనే సానుకూల ప్రభావం ఉంటుందని, శిక్షలు కఠినం అవుతున్న కొద్దీ విచారణ ప్రక్రియ చాలా జాప్యం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2018లో జరిగిన అత్యాచార కేసుల్లో 85 కేసుల్లో చార్జిషీట్లు నమోదు కాగా, వాటిలో శిక్షలు పడేవరకు వెళ్లిన కేసులు కేవలం 27 శాతం మాత్రమే. పైగా అత్యాచార కేసుల్లో నేరస్థులు ఎక్కువగా పరిచయస్థులు, స్నేహితులు లేదా ఇరుగుపొరుగు వారే ఉంటున్నారు. అపరిచితులు తక్కువగా ఉంటున్నారు. పరిచయస్థులు కనక కేసులవుతే మరణ శిక్షలు ఖాయమనుకొని సాక్ష్యాధారాల నిర్మూలనలో భాగంగా మహిళలను ఎక్కువగా హత్య చేస్తున్నారని సామాజిక విశ్లేషకులు తెలిపారు. నిర్భయ లాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు భావోద్వేగాలకు గురై కఠిన చట్టాల కోసం ఆందోళనలకు దిగడం సహజం. ప్రజల భావోద్వేగాలకు అనుకూలంగా న్యాయ నిర్ణేతలు చట్టాలు తీసుకరావడం ప్రమాదకరం. కఠిన చట్టాలే పరిష్కారమైతే నిర్భయ చట్టం తర్వాత హైదరాబాద్‌లో ‘దిశ’ దారుణ అత్యాచార, హత్య సంఘటన జరిగి ఉండేది కాదు. మరణ శిక్ష పడుతుందనే భయాందోళనలతోనే ఆ కేసులో నేరస్థులు దిశను కాల్చివేశారు. చదవండి : దోషులను క్షమించడమా... ఆ ప్రసక్తే లేదు! ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం -
అదంతా అబద్ధం.. నిర్భయ తల్లి ఆశాదేవీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్భయ తల్లి ఆశాదేవి పోటీ చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం కేజ్రీవాల్‌పైనే ఆమె పోటీకి దిగుతారని.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ చేసిందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వార్తలపై ఆశాదేవీ వెంటనే స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని.. తాను ఏ పార్టీతో సంప్రదింపులు జరుపలేదని స్పష్టం చేశారు. అయితే, తన కూతురు నిర్భయ విషయంలో న్యాయం జరిగితే చాలని అన్నారు. తన కూతురుకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరకుండా పోరాటం కొనసాగిస్తానన్నారు. కాగా నిర్భయ దోషులకు ఉరిశిక్షను విధించాలని ఆశాదేవీ పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయం తెలిసిందే. (నిర్భయ దోషులకు కొత్త డెత్‌వారెంట్లు జారీ) -
నా బిడ్డలానే ప్రియాంకా బలైంది: నిర్భయ తల్లి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగటం చాలా బాధాకరమన్నారు. ఆడపిల్లలు బయటకు వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి దేశంలో లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పాశవిక దాడులు జరుగుతుంటే పోలీసులు, అధికార వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్థమవుతోందని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన అనంతరం శుక్రవారం ఆమె స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. తన బిడ్డలానే ప్రియాంక కూడా కామాంధుల దాహనికి బలైపోయిందని గుర్తుచేశారు. ప్రియాంకను హతమార్చిన వారిని వెంటనే అరెస్ట్ చేసి ఉరి శిక్షను వేయాలని ఆమె డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు కనీస భద్రత లేకుండాపోయిందని, దీనికి కేంద్రప్రభుత్వం తగు చర్యలను తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి ఘటనలు జరకుండా ఉండాలంటే దోషులకు కఠిన శిక్షలు వేయాలని అన్నారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్న దోషులకు ఇంకా ఉరిశిక్ష అమలు చేయకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను ఉరి తీసేంతవరకు తమ పోరాటం ఆగదని ఆశాదేవి తెలిపారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని నిర్భయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఈ కేసును సుమోటాగా తీసుకుని.. విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించేవరకు పోరాడుతామని స్పష్టం చేసింది. దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారని.. ఇలాంటి దారుణ ఘటనలు జరిగితే మహిళలు స్వేచ్ఛగా ఎలా తిరగలుగుతారని మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఓ లేఖ రాశారు. కాగా వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ప్రియాంకరెడ్డి హత్య తమను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
తండ్రికి వ్యతిరేకంగా కూతురు పోటీ
పాట్నా : ‘కన్న కూతురికి న్యాయం చేయలేని వాడు సమాజానికి ఏం న్యాయం చేస్తాడు. కూతుర్ని పట్టించుకోని వ్యక్తి బేటీ బచావో.. బేటీ పడావో అంటూ నినదాలు చేయడం హాస్యాస్పదంగా ఉందం’టూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌పై ఆయన అల్లుడు అనిల్ సాధు మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను, తన భార్య ఆశా దేవి, రామ్ విలాస్ పాశ్వాన్‌కు,ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు వ్యతిరేకంగా పోటి చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ సాధు మాట్లాడుతూ.. సొంత కూతురికి న్యాయం చేయలేని వ్యక్తి సమాజంలోని ఆడవారిని ఎలా ఉద్దరిస్తారని ప్రశ్నించారు. రామ్ విలాస్, పాశ్వన్ సామాజిక వర్గాన్ని దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. అంతేకాక కన్న కూతురికి న్యాయం చేయలేని వ్యక్తి ‘బేటీ బచావో..బేటీ పడావో’ అంటూ నినదించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రామ విలాస్ తన కుమార్తె కన్నా కొడుకు పట్లనే అధిక ప్రేమ చూపేవాడని తెలిపారు. అందుకే ఆయన తన కుమారుడు చిరాగ్‌ని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపాడు.. కానీ కూతుర్ని మాత్రం గ్రామంలోనే ఉంచాడని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ నినదిస్తున్నారు. కానీ జనాలు ఆయన మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరని తెలిపాడు. అంతేకాక రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య ఆశా దేవి, రామ్ విలాస్ పాశ్వన్ మీద.. తాను రామ్ విలాస్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిల్ సాధు ప్రకటించారు. రాష్ట్రీయా జనతా దళ్ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక వేళ తమకు టికెట్ ఇవ్వకపోయినా రామ్ విలాస్‌కు, అతని కొడుకుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో రామ్ విలాస్‌ను ఆయన కుమారుడిని ఓడించడమే తన లక్ష్యంగా అనిల్ సాధు పేర్కొన్నారు. ఆశా దేవి రామ్ విలాస్ పాశ్వాన్ మొదటి భార్య రాజ్ కుమారి దేవి కూతురు. కానీ రామ్ విలాస్ ఆశా తల్లికి విడాకులు ఇచ్చి 1983లో రీనా అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. చిరాగ్, రామ్ విలాస్ - రీనాల కుమారుడు. -
‘నిర్భయ’కు ఐదేళ్లు.. వాళ్ల సంగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా ఐదేళ్ల క్రితం. దేశ రాజధాని నడిబొడ్డున దాష్టీకం. 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరు మృగాల చేతిలో చిత్రవధలకు గురయిన రోజు. చెప్పుకోటానికి కూడా వీల్లేని రీతిలో కిరాతకంగా అనుభవించి.. నగ్నంగా రోడ్డు పైకి విసిరేశాయి. ఆ వార్తతో యావత్ దేశం ఉలిక్కి పడింది. తల మరియు పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో 2012, డిసెంబర్ 29 న బాధితురాలు తుదిశ్వాస విడిచారు. ‘‘అమానత్, దామిని, నిర్భయ’’ పేర్లతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నలుమూలల నుంచి హస్తినకు చేరిన యువత గర్జించటంతో ఢిల్లీ పీఠం కదిలింది. దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్‌ఠాకూర్ (28), పవన్‌గుప్తా (19), వినయ్‌శర్మ (20) లకు ఢిల్లీ కోర్టు విధించిన మరణ శిక్షను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా నిలుపుతోందని కోర్టు అభివర్ణించింది. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఒక నిస్సహాయ మహిళపై దోషుల అమానవీయ, భయానక చర్యలు జాతి అంతరాత్మను నిర్ఘాంతపరచాయని.. మహిళలపై నేరాలను సహించబోమనే సందేశం పంపటానికి వీరికి తీవ్రమైన శిక్ష అవసరమని న్యాయమూర్తి తీర్పులో స్పష్టంచేశారు. కానీ, ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారికి శిక్ష అమలు కాలేదు. ఐదేళ్ల తర్వాత న్యాయం... మరి శిక్ష అమలు? ఘటన తర్వాత సీసీ పుటేజీ ఆధారంగా బస్సు డ్రైవర్ రామ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత అతని తమ్ముడు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ వినయ్ గుప్తా, అక్షయ్ ఠాకూర్లను అరెస్ట్ చేశారు. చివరి నిందితుడు, మైనర్ అయిన రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ హోంకు తరలించి చివరకు విడిచిపెట్టారు. రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకోగా.. మిగిలిన నలుగురికి మరణ శిక్షలు ఖరారు అయ్యాయి. ‘దోషులు చనిపోయే వరకూ ఉరితీయాలి’ అంటూ కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి శిక్షను ప్రకటించారు. నిస్సహాయురాలైన బాధితురాలిని చనిపోవటానికి గురిచేసిన చిత్రహింసలు, గాయాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత మే 5, 2017న అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ కోర్టు తీర్పుతో ఏకీభవించింది. 8 నెలలు గడుస్తున్నా తీర్పు ఇప్పటిదాకా అమలు కాలేదు. జైలు అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవటంతో మధ్యలో ఓసారి ఆశా దేవీ ఢిల్లీ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా సంఘం జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. అయినా ఇంత వరకు స్పందన లేదు. ఇదిలా ఉండగా.. దోషులు వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తాలు తాజాగా మరణశిక్ష తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణ వచ్చే నెల(జనవరి 2018) 22వ తేదీకి వాయిదా వేసింది. నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయేవరకూ ఉరితీయటమే సరైందన్న వాదన నేడు మరోసారి తెరపైకి వచ్చింది. కాలంలో ఇరుక్కున్నాం.. ఆశాదేవి కిరాతకానికి బలైనా నిర్భయ కొన ఊపిరి ఉన్నంతవరకు కూడా మొక్కవోని ధైర్యం ప్రదర్శించింది. కిరాతకులను ఎదురించింది. కాబట్టే ప్రభుత్వం, అధికారులు ఆమె పేరును దాచి పెట్టాలని చూసినా తల్లి ఆశాదేవి మాత్రం అందుకు నిరాకరించారు. ఢిల్లీ నగర బొడ్డున ఓ సమావేశంలో తమ కూతురు పేరు జ్యోతి సింగ్‌గా ప్రకటించారు. ‘‘ఘటన జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఆ రాక్షసులు ఇంకా బతికే ఉన్నారు. మా కుటుంబం ఇంకా ఆ ఘటనను, ఈ రోజునే గుర్తు చేసుకుంటూ అక్కడే ఆగిపోయాం. ఇలాంటి సమయాల్లో చట్టాలపై ప్రజలకు గౌరవం పోతుంది. ప్రతీ ఒక్కరి ఆలోచనా ధోరణి మారే విధంగా బలమైన చట్టాల రూపకల్పన జరగాలి. అప్పుడే నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుంది’’ అని ఆశాదేవి చెబుతున్నారు. నిర్భయ ఘటన తర్వాత హడావుడి తప్ప పరిస్థితి ఇప్పటికీ ఏం మారలేదు. కఠిన చట్టాలు చేస్తాయన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించటం లేదు. అందుకే ఉద్యమంలో ఇంకా నేను కొనసాగుతూనే ఉన్నా. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, వాళ్ల భవిష్యత్ తదితర దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ముందుకు రావటం లేదు. వారిలో అవగాహన పెరిగి.. ముందుకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని అని ఆమె అభిప్రాయపడుతున్నారు. -
నిర్భయ తల్లి థాంక్స్ ఎందుకు చెప్పింది?
సాక్షి, న్యూఢిల్లీ : ఐదేళ్ల క్రితం దేశ రాజధాని వీధుల్లో సైకోథెరపీ చదువుతున్న యువతి హత్యాచార ఘటన ‘నిర్భయ ఉదంతం’గా సంచనలం రేపిన విషయం తెలిసిందే. నిందితులను శిక్షించాలంటూ దేశ యువత మొత్తం నగరం నడిబొడ్డుకు చేరి చేపట్టిన ఆందోళన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తన కంటతడి మరే తల్లికీ రావొద్దని.. ఈ మేరకు కఠిన చట్టాల రూపకల్పన కోసం జరుగుతున్న ఉద్యమాల్లో నిర్భయ తల్లి ఆశాదేవి పాలు పంచుకున్నారు. అయితే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉందని ఆమె అంటున్నారు. ఆశా దేవి తనయుడు(23) ప్రస్తుతం భారత నావికా దళానికి ఎంపికయ్యాడు. అందుకు రాహుల్ అందించిన ప్రోత్సాహమే కారణమంట. ‘‘సోదరి మరణం అనంతరం నా కొడుకు కుంగిపోయాడు. చదువుల మీద దృష్టిసారించలేకపోయాడు. ఆ సమయంలో ఆయన(రాహుల్) ఫోన్ చేసి మాట్లాడారు. సాధించాల్సింది ఎంతో ఉందంటూ నా కుమారుడిని ప్రేరేపించారు’’ అని ఆమె చెప్పారు. 2013లో సీబీఎస్సీ పరీక్షలు అయిపోగానే రాయ్ బరేలీ(రాహుల్ నియోజకవర్గం)లోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ అర్బన్ అకాడమీలో అతనికి సీటు దక్కింది. దీంతో ఆ కుటుంబం మొత్తం అక్కడికి మకాం మార్చింది. ఆ సమయంలో ఆర్మీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమైన ఆ కుర్రాడు.. అది కష్టతరమని భావించాడు. ఆ సమయంలో రాహుల్ సూచన మేరకు పైలెట్ ట్రెయినింగ్ కోర్సులో చేరి లక్ష్యాన్ని సాధించగలిగాడు. దాదాపు ప్రతీ రోజూ రాహుల్ మాట్లాడి చదువు గురించి ఆరా తీసేవాడంట. జీవితంలో వెనకడుగు వెయొద్దని.. ముందుకు సాగాలిని చెప్పేవాడంట. మొత్తానికి ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అతగాడికి ఇప్పుడు గుర్‌గ్రామ్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చోటు దక్కింది. తమ కుమారుడు ఇప్పుడు ఈ స్థాయికి చేరాడంటే.. అందుకు రాహుల్ అందించిన ప్రోత్సాహమే కారణమని ఆశాదేవి చెబుతున్నారు. రాహుల్ మాత్రమే కాదు.. ఆయన సోదరి ప్రియాంక కూడా తమకు తరచూ ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాకబు చేసేదని ఆశాదేవి తెలిపారు. నిర్భయ తండ్రి ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఉద్యోగం చేస్తుండగా, వారి చిన్న తనయుడు పుణేలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. తీహార్ జైలుకు నోటీసులు... నిర్భయ ఘటనలో దోషులను ఉరి తీయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడి ఐదు నెలలు గడుస్తున్నా జైలు అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవటంతో ఆశా దేవీ ఢిల్లీ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా సంఘం జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. -
రాహుల్ హామీయిచ్చారు: ఆశాదేవి
న్యూఢిల్లీ: జువైనల్ జస్టిస్ చట్టసవరణ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీయిచ్చారని నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు. రాజ్యసభలో బిల్లు ఆమోదానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ మంగళవారం రాహుల్ గాంధీని ఆమె కలిశారు. మరోవైపు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఈ ఉదయం నిర్భయ తల్లిదండ్రులు కేంద్ర మంత్రి ముక్తాస్ అబ్బాస్ నఖ్వీని కలిశారు. జువైనల్ జస్టిస్ చట్టసవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందేలా చూడాలని కోరారు. బిల్లు ఆమోదానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని వారికి మంత్రి హామీయిచ్చారు. కాగా, బిల్లు ఆమోదంపై కాంగ్రెస్, జేడీ(యూ), ఎన్సీపీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. జువైనల్ జస్టిస్ చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్‌లో ఉండడం తెలిసిందే. -
'నేరం గెలిచింది.. మమ్మల్ని పాతాళానికి తొక్కారు'
న్యూఢిల్లీ: తమ విషయంలో నేరమే గెలిచిందని ఢిల్లీలో లైంగిక దాడికి గురై ప్రాణాలుకోల్పోయిన నిర్భయ(జ్యోతిసింగ్) తల్లి ఆశాదేవీ అన్నారు. తమ మూడు సంవత్సరాల పోరాటం వృధా అయిందని, శూన్యంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరస్తుడు(ప్రస్తుతం 20 ఏళ్లు) ఆదివారం బాల నేరస్తుల సంరక్షణ గృహం నుంచి విడుదలయ్యాడు. అతడిని తన సొంతప్రాంతం ఉత్తరప్రదేశ్‌కు పంపించకుండా ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు అప్పగించారు. అతడి విడుదల సందర్భంగా నిరసన తెలుపుతున్న నిర్భయ(జ్యోతిసింగ్) తల్లిదండ్రులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రవర్తన తీరు, దేశ న్యాయవ్యవస్థపట్ల వారు తీవ్రంగా కలత చెందారు. మిగిలిన నలుగురు నేరస్తులను కూడా విడిచిపెడతారా అని ప్రశ్నించారు. తమ మూడేళ్ల పోరాటం శూన్యంగా మిగిలిందంటూ కంటతడిపెట్టారు. ఈ న్యాయవ్యవస్థ తమ కుటుంబాన్ని పాతాళానికి తొక్కేసిందని అన్నారు. బాల నేరస్తుల చట్టంలో మార్పులు తీసుకురావడానికి ఇంకా ఎన్ని అత్యాచారాలు, హత్యలు జరగాలి అని కూడా ఆమె ప్రశ్నించారు. -
ఆశాదేవి (నిర్భయ తల్లి) రాయని డైరీ
నేరము-శిక్ష! చట్టానికి ఇంతవరకే తెలుసు. మహామహులు దీర్ఘంగా ఆలోచించి, ఆ ఆలోచనల్ని పెద్ద బౌండ్ బుక్కులా కుట్టి, దానికో గట్టి అట్ట వేసి, అల్మరాలో భద్రంగా పెట్టి వెళ్లిన చట్టానికి ఇంతవరకే తెలుసు. పుస్తకంలో ఏ నేరానికి ఏ శిక్ష రాసి ఉంటే ఆ శిక్షను వేసి చేతులు దులుపుకుంటుంది చట్టం. పుస్తకానికి అంటుకుని ఉన్న దుమ్మును మాత్రం దులపదు. చేతులు దులుపుకున్నాక పుస్తకాన్ని దులిపితే మళ్లీ ఆ దుమ్ము తన చేతులకు అంటుకుంటుందనేమో.. తిరిగి ఆ పుస్తకాన్ని ముట్టుకోదు. తిరిగి ఆ పుస్తకాన్ని తిరగేయదు. తిరిగి ఆ పుస్తకాన్ని తిరగరాయదు. ఎప్పుడో ఇంకో నేరస్థుడు వస్తాడు. అప్పుడే ఆ పుస్తకమూ బయటికి వస్తుంది. నేరస్థుడిని బోనులో నిలబెట్టాక న్యాయకోవిదులు వాదనలు వినే చట్టం ఒకటి, నేరస్థుడిని విడిపించుకోడానికి కోర్టు మెట్లు ఎక్కి వస్తూ న్యాయవాదులు తమ వెంట తెచ్చుకునే చట్టం ఒకటి. వాదనల కోసం రాసుకున్న ఈ పుస్తకాలలో వేదనలకు ఉపశమనాలుంటాయా?! ఉంటే ఈ తీర్పులు ఇలా ఉంటాయా? నేరస్థుడిని విడుదల చేస్తున్నారట! ఇవాళో రేపో బయటికి వస్తాడట. ‘పిల్లవాడు’ అని వదిలేస్తున్నారట! అలా అని చట్టంలో ఉందట! మృగాన్ని బయటి ప్రపంచంలోకి వదిలిపెడితే మనుషులు ఏమైపోతారోనని చట్టం ఆలోచించడం లేదు. మృగానికి మనుషులెక్కడ హాని తలపెడతారోనని ఆలోచిస్తోంది! మనుషుల్లోకి వెళ్లబోతున్న మృగం.. మనిషిలా మారడానికి చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తోంది! ఆ మృగం చేత టైలరింగ్ షాపు పెట్టిస్తోంది. ఆ షాపుకో సైన్ బోర్డు రాయిస్తోంది. షాపులోకి టైలరింగ్ మెటీరియల్‌ని, రసీదు పుస్తకాలను తెప్పిస్తోంది. షాపు ప్రారంభోత్సవానికి తప్పనిసరిగా ముఖ్యమంత్రి కూడా వెళ్లి తీరాలన్న రూలు చట్టంలో లేదేమో మరి! ఇన్నాళ్లూ చట్టం ఆ మృగం పేరును మాత్రమే దాచిపెట్టింది. ఇప్పుడు ఆ మృగాన్నే దాచిపెడుతోంది. నాకైతే ‘చట్టం’ అనే పుస్తకాన్ని కడిగిపారేయాలనిపిస్తోంది. నా కూతురు.. మా జీవనజ్యోతి.. ప్రాణాలతో పోరాడి పోరాడి, ఆశలలో రెపరెపలాడి ఆడి, ఆరిపోయాక.. ఈ ప్రపంచమే నాకు ధైర్యం చెప్పింది. చెంతకొచ్చి కన్నీళ్లు తుడిచింది. చనిపోయిన నా కూతురికి నామకరణం చేసింది. ఇక నుంచీ ప్రతి కూతురి పేరూ ఇదేనని ఇల్లిల్లూ ప్రతిధ్వనించేలా చెప్పింది. నిర్భయంగా చదువుకొమ్మని, నిర్భయంగా ఉద్యోగాలు చేసుకురమ్మని ఆడపిల్లలకు చెప్పింది. మీ కూతుళ్లను నిర్భయంగా బయటికి పంపండని కన్నవాళ్లకు చెప్పింది. కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లి పడే ఆవేదన లోకంలో ఎవరూ తీర్చలేనిదని తీర్పునిచ్చింది. ఆ మాత్రం తీర్పును ఈ చట్టం ఇవ్వలేకపోయింది! కడుపు రగిలిపోతుంటే.. నాకివాళ కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. కన్నీళ్లతో కడిగితే చట్టం ప్రక్షాళన అవుతుందా? ఓ తల్లి కన్నీళ్లకు కరిగిపోయేంత మానవీయత ఈ చట్టానికి ఉందా? చట్టాలను తీర్చిదిద్దడానికి మహామహులు మాత్రమే సరిపోరు. వారిలో మహనీయులు కూడా ఉండాలి. -మాధవ్ శింగరాజు -
నా కూతురు పేరు జ్యోతిసింగ్
ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ‘నిర్భయ’ తల్లి వెల్లడి న్యూఢిల్లీ: దేశప్రజల మదిలో ‘నిర్భయ’గా నిలిచిపోయిన తన కూతురు పేరు జ్యోతిసింగ్ అని మూడేళ్లక్రితం ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌కు గురై ప్రాణాలుకోల్పోయిన యువతి తల్లి వెల్లడించింది. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగి మూడేళ్లు గడిచిన సందర్భంగా బుధవారం ఢిల్లీలో మహిళా, పౌరసంఘాలు జంతర్‌మంత్ వద్ద నిర్వహించిన ‘నిర్భయ చేతన దివస్’ నివాళి కార్యక్రమంలో యువతి తల్లి ఆశాదేవి మాట్లాడారు. ‘నా కూతురు పేరు జ్యోతిసింగ్. నా కూతురు పేరు చెప్పడానికి నేనేం సిగ్గుపడట్లేదు. రేప్‌లాంటి అమానుషమైన నేరాలకు పాల్పడే వారిని బహిరంగంగా ఉరితీయాలి.’ అన్నారు. మహిళాసమస్యలపై పార్టీలకతీతంగా ఎంపీలు ఏకం: మహిళాసమస్యలపై యువతలో అవగాహన కల్పించేందుకు పార్టీలకతీతంగా 20 మంది ఎంపీలు ఏకమయ్యారు. లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన ఎంపీలు సుప్రియా సూలె(ఎన్సీపీ), గౌరవ్ గొగోయ్(కాంగ్రెస్), ప్రీతమ్ ముండే, శతాబ్ది రాయ్(టీఎంసీ)సహా 20 మంది ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి లింగ సమానత, మహిళావిద్య, మహిళాసాధికారత వంటి అంశాలపై తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కాగా, డబ్బు లేని కారణంగా నిర్బంధంలో ఉన్న వారికి బెయిల్ మంజూరులో జాప్యం జరగడంపై పార్లమెంటరీ కమిటీ సభ్యుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని కేసు వాదనకు మంచి లాయర్లను వినియోగించాలని సూచించింది.