
ఆర్ధిక ప్రగతే లక్ష్యం : నిర్మలా సీతారామన్
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నవ భారత్ కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. లోక్‌సభలో శుక్రవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన సీతారామన్ జాతీయ భద్రత, ఆర్థిక ప్రగతి తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఆహార భద్రతపై ఖర్చును రెట్టింపు చేశామని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ మార్పు చూడగలిగేలా చేశామని అన్నారు. దేశంలోని ప్రతి మూలకూ పథకాలను ప్రజలకు చేరువ చేశామని చెప్పారు. సంస్కరణలు పనిచేయడం ద్వారా కొత్త ఒరవడి సృష్టించామని అన్నారు.