చైనా మరో నిర్ణయం.. మోదీతో భేటీకి నై | No Bilateral Meet For PM Modi, Xi Jinping At G20 | Sakshi
Sakshi News home page

చైనా మరో నిర్ణయం.. మోదీతో భేటీకి నై

Published Thu, Jul 6 2017 3:51 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

చైనా మరో నిర్ణయం.. మోదీతో భేటీకి నై - Sakshi

చైనా మరో నిర్ణయం.. మోదీతో భేటీకి నై

భారత ప్రధాని నరేంద్రమోదీతో తమ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సమావేశమయ్యేటంత సాధారణ పరిస్థితులు లేవని చైనా స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీతో తమ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సమావేశమయ్యేటంత సాధారణ పరిస్థితులు లేవని చైనా స్పష్టం చేసింది. త్వరలో హాంబర్గ్‌లో జరగనున్న జీ 20 సదస్సులో జిన్‌పింగ్‌ ప్రధానితో మోదీతో అవనున్న భేటీని రద్దు చేసుకున్నట్లు తెలిపింది. సిక్కింలో ఏర్పడిన సరిహద్దు వివాదంపై గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ నేడు హాంబర్గ్‌ వెళ్లనున్నారు. జీ 20 సదస్సులో భాగంగా ఆయా దేశాల నేతలను మోదీ మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈ జాబితాలో తొలుత జీ జిన్‌పింగ్‌ కూడా ఉన్నట్లు తెలిసినా భారత్‌ నుంచి మాత్రం అది ఉంటుందా లేదా అనే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ లోగానే ప్రస్తుతం తమ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భేటీని రద్దు చేసుకున్నట్లు చైనా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement