
కమల్ హాసన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ పెట్టబోయే పార్టీతో పొత్తు అంశాన్ని కాలమే నిర్ణయిస్తుందని నటుడు కమల్ హాసన్ తెలిపారు. ఒకవేళ ఎన్నికల్లో కలసి పోటీచేయాలంటే తాను, రజనీ బాగా ఆలోచించాల్సి ఉంటుందన్నారు. తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్’కు రాసిన వ్యాసంలో కమల్ తన అభిప్రాయాన్ని తెలిపారు.
రజనీతో పొత్తు సినిమాకు నటీనటుల్ని ఎంపిక చేసుకున్నంత సులభం కాదనీ, ఇవి రెండూ పూర్తి భిన్నమైన అంశాలన్నారు. పొత్తు కోసం ఇరు పార్టీల సిద్ధాంతాల్లో కూడా సారూప్యత కూడా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు కమల్‌తో పొత్తుపై రజనీ స్పందిస్తూ.. ‘నేను మీకు ఇప్పటికే చెప్పా. కాలమే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పగలదు’ అని వ్యాఖ్యానించారు.