
మహిళల భద్రతకు మొబైల్ ఆప్
భువనేశ్వర్: మహిళల భద్రత కోసం ఒడిశా ప్రభుత్వం ఓ మొబైల్ ఆప్ను ప్రారంభించింది. శుక్రవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 'మో సతి' పేరిట దీన్ని ఆరంభించారు. భువనేశ్వర్, కటక్ నగరాల్లోని మహిళల రక్షణ ఈ ఆప్ను రూపొందించారు.
'మహిళలకు ఈ ఆప్ అంకితం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మహిళలు ఈ టెక్నాలజీ సాయంతో రక్షణ పొందవచ్చు. మహిళల రక్షణ, గౌరవం కాపాడేందుకు మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది' అని నవీన్ పట్నాయక్ చెప్పారు.