ఫేస్‌బుక్‌, గూగుల్‌పైనా తీర్పు ప్రభావం | One of the biggest implications of the SC judgement will be on Aadhaar | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌, గూగుల్‌పైనా తీర్పు ప్రభావం

Published Fri, Aug 25 2017 9:48 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఫేస్‌బుక్‌, గూగుల్‌పైనా తీర్పు ప్రభావం - Sakshi

ఫేస్‌బుక్‌, గూగుల్‌పైనా తీర్పు ప్రభావం

సాక్షి, న్యూఢిల్లీ : గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పుతో దీని ప్రభావం ఆధార్‌పై ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కేం‍ద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు సహా అన్నింటికీ ఆధార్‌ అనుసంధానం అనివార్యం చేయడంతో తాజా తీర్పు పర్యవసానాలపై పలు సందేహాలు ముందుకొచ్చాయి. సుప్రీం తీర్పు ప్రాతిపదికగా ఆధార్‌ చెల్లుబాటుపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఆధార్‌ అనుసంధానంపై కోర్టు సహేతకు నియం‍త్రణలకు అనుమతించడంతో సామాజిక సంక్షేమ పథకాలకు ఆధార్‌ జోడింపును మినహాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు గోప్యత ప్రాథమిక హక్కని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధేశించడంతో పౌరుల గోప్యతను కాపాడేందుకు ప్రభుత్వం విదేశీ కంపెనీలను స్థానికంగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, ఇక్కడ సర్వర్లు నెలకొల్పాలని కోరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇక పౌరుల సమాచారాన్ని సేకరించే గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలపైనా సుప్రీం రూలింగ్‌ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement