
భువనేశ్వర్: ఇటీవల ఒడిశాలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల కనీసం 20 మంది మరణించారు. సుమారు 3 లక్షల మందిపై ఈ ప్రకృతి ప్రకోప ప్రభావం పడింది. రాష్ట్ర స్పెషల్ రీలీఫ్ కమిషనర్(ఎస్‌ఆర్సీ) కార్యాలయం బుధవారం ఈ వివరాలు వెల్లడించింది. ఈ నెల 15–16, 20–23 మధ్య రెండు దశల్లో కురిసిన వర్షాలు ఒడిశాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు పిడుగుపాటు, వర్షాల వల్ల మరణించగా, 15 మంది వరద సంబంధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారని డిప్యూటీ ఎస్‌ఆర్సీ ప్రవత్ రంజన్ మోహపాత్ర తెలిపారు.