బెంగాల్‌ బస్సులో డాలర్ల కట్టలు! | Over 88,000 USD recovered from a bus | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ బస్సులో డాలర్ల కట్టలు!

Published Sat, Oct 14 2017 5:03 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

Over 88,000 USD recovered from a bus - Sakshi

తెహట్టా: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలోని చాప్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఓ బస్సులో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు రూ.57 లక్షల(88,200) విలువైన అమెరికన్‌ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం ఆధారంగా క్రిష్ణానగర్‌ నుంచి వస్తున్న ఆ బస్సును ఆపి సోదాలు చేయగా ఓ బ్యాగులో ఈ డబ్బు బయటపడింది. అవన్నీ 100 డాలర్ల నోట్లేనని అధికారులు చెప్పారు. ఆ డబ్బును కస్టమ్స్‌ శాఖకు అప్పగించామని తెలిపారు. ఈ వ్యవహారంలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement