పట్నా: దృఢచిత్తం ముందు దురదృష్టం తలవంచింది. ఎదురీతతో విధిరాతను మార్చుకుంది. సంకల్పంతో ముందడుగు వేసింది. తనకు అవమానాన్ని భరించి దిగమింకుని చదువులో సత్తా చాటింది. బిహార్ లోని నలంద ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక పదవ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాసైంది. 67 శాతం ఉత్తీర్ణతతో 335 మార్కులు సాధించింది. మ్యాథ్స్ లో 76 శాతం మార్కులు తెచ్చుకుంది.
పరీక్షలకు కొద్ది రోజుల ముందే ఆమెపై లైంగిక దాడి జరిగింది. ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ షాక్ నుంచి కోలుకుని ఆమె పరీక్షల్లో ప్రథమశ్రేణిలో పాసవడం పట్ల బాలిక కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఆమె బాగా చదువుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంటి దగ్గరే ట్యూషన్ పెట్టించి చదువు చెప్పించినందుకు జిల్లా అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
షాక్ నుంచి తేరుకుని సత్తా చాటింది!
Published Mon, May 30 2016 11:36 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement