‘ఉగ్రవాదులను భారీగా పంపే కుట్ర’ | Pakistan has increased attempts to push terrorists into J&K: Arun Jaitley | Sakshi
Sakshi News home page

‘ఉగ్రవాదులను భారీగా పంపే కుట్ర’

Published Fri, Aug 4 2017 6:15 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

‘ఉగ్రవాదులను భారీగా పంపే కుట్ర’

‘ఉగ్రవాదులను భారీగా పంపే కుట్ర’

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను దొంగదారిలో పంపించేందుకు పాకిస్థాన్‌ పలుమార్లు ప్రయత్నించిందని కేంద్ర రక్షణ మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. సరిహద్దు గుండా దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు పలుమార్లు ప్రయత్నించారని, వారికి పాకిస్థాన్‌ పెద్ద మొత్తంలో సహాయపడిందని, అయినా ఆ దేశానికి భారీ నష్టం జరిగిందని తెలిపారు. పలు దాడులను దేశ సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. సరిహద్దులో చొరబాట్లు, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద సంఘటనలు, భద్రతకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం ఆయన లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు.

‘భారతదేశంలోకి చొరబాట్లను పెంచేందుకు పాక్‌ ప్రయత్నించింది. అయితే, అవతలివైపే ఎక్కువగా నష్టం చోటు చేసుకుంది. ఇది గతంతో పోలిస్తే రికార్డు స్థాయి. ఈ ఒక్క ఏడాదిలోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ 285సార్లు అతిక్రమించింది. ఇది 2016లో 228గా ఉంది. ఈ ఏడాది పాక్‌ జరిపిన కాల్పుల్లో సరిహద్దు వెంబడి ఉన్న గ్రామల్లో ఎనిమిది మంది ప్రాణాలుకోల్పోయారు. ఇక బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ గస్తీ కాస్తున్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 221సార్లు పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే, వీటిని మన బలగాలు తిప్పికొట్టాయి. అంతేకాకుండా ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు యాంటీ ఇన్‌ఫిల్‌ట్రేషన్‌ అబ్‌స్టాకిల్‌ సిస్టంను ప్రారంభించాం’ అని జైట్లీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement