
బిపిన్ రావత్, పాక్ ఆక్రమిత కశ్మీర్
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. గిల్గిత్–బల్టిస్తాన్, పీఓకేలు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నాయని శుక్రవారం పేర్కొన్నారు. 1947 అక్టోబర్ 24న మహారాజ హరిసింగ్ భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే కశ్మీర్ భారత్‌లో విలీనమైందన్నారు. ఆర్టికల్ 370 కూడా తాత్కాలికమైందేనన్నారు. భారత భూభాగాలైన పీఓకే, గిల్గిత్–బల్టిస్తాన్‌లను పాక్ ఆక్రమించుకొని వాటిని ఉగ్రస్థావరాలుగా మార్చిందన్నారు.
ఇటీవల యాపిల్ వ్యాపారులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనపై స్పందించారు. ఇది ముమ్మాటికి పాక్ ఉగ్రవాదుల పనేనని, కశ్మీర్‌లో దుకాణాలు తెరవనివ్వకుండా భయపెట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులను సైతం భయపెడుతున్నారన్నారు. శాంతియుత పరిస్థితులను కల్లోలంగా మార్చడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం కశ్మీర్‌లో శాంతిని, అభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment