
జమ్ము: పదే పదే పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి శుక్రవారం తెల్లవారుజాము నుంచి పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు.
దీంతో అప్రమత్తమైన భారత బలగాలు వారికి ధీటుగా జవాబిస్తున్నాయి. గత రెండు రోజులుగా కేజీ సెక్టార్‌లో కాల్పులు కొనసాగుతుండటంతో.. స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. మోటర్ల ద్వారా కాల్పులు జరుగుతుండటంతో.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment