న్యూఢిల్లీ: సెలబ్రిటీలు నటించే వాణిజ్య ప్రకటనలకు సంబంధించి వారిని బాధ్యులను చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. ఈ ప్రకటనల ద్వారా తప్పుదోవ పట్టించే సెలబ్రిటీలకు ఇకపై అవసరమైతే ఐదేళ్ల జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా విధించాలని నివేదికలో పేర్కొంది.
ఈ మేరకు వినియోగదారుల భద్రతా బిల్లు-2015పై ఏర్పడిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నేతత్వంలోని పార్లమెంటరీ కమిటీ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కళ్లెం వేయాలని అలాంటి కంపెనీలకు, అందులో నటించే సెలబ్రిటిలకు తీవ్రమైన జరిమానా, శిక్షలు, అవసరమైతే లెసైన్సులను సైతం రద్దు చేయాలని సూచించింది.
సెలబ్రిటీలు ప్రకటనల్లో తప్పుదోవ పట్టిస్తే జైలే
Published Wed, Apr 27 2016 1:22 AM | Last Updated on Thu, Aug 9 2018 8:43 PM
Advertisement
Advertisement