
వడ్డీ ఇవ్వండి లేదా.. మొత్తం ఇచ్చేయండి!
పీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగం వదిలిపెట్టేంతవరకు దాచుకున్న దానికి వడ్డీ ఇవ్వాలని లేని పక్షంలో దాచుకున్న మొత్తాన్ని ఇచ్చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ సహా కార్మిక సంఘాలు ఈపీఎఫ్‌వోను డిమాండ్ చేశాయి.
న్యూఢిల్లీ: పీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగం వదిలిపెట్టేంతవరకు దాచుకున్న దానికి వడ్డీ ఇవ్వాలని లేని పక్షంలో దాచుకున్న మొత్తాన్ని ఇచ్చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ సహా కార్మిక సంఘాలు ఈపీఎఫ్‌వోను డిమాండ్ చేశాయి. కేంద్ర కార్మిక మంత్రిని కూడా ఇదే విషయంపై డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించాయి.
పీఎఫ్ నిధులను ఉద్యోగులు తీసుకోవటంపై ఈ నెలారంభంలో కార్మిక మంత్రి చట్టాలను కఠినతరం చేయనున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం ఇన్నాళ్లూ ఉద్యోగి.. రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత తాను దాచుకున్న మొత్తాన్ని తీసుకునే సౌకర్యం ఉండేది. అయితే మారిన నిబంధనల ప్రకారం ఇందులో 90 శాతం మాత్రమే తీసుకునేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో అన్ని సంఘాలు ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.