పార్లమెంటులో వాయిదా పర్వం
- నోట్ల రద్దుపై మూడోరోజూ స్తంభించిన ఉభయసభలు
- క్యూలైన్ మృతుల సంతాప తీర్మానంపై రాజ్యసభలో గందరగోళం
- విపక్షాలు తప్పించుకోవాలని చూస్తున్నాయి: జైట్లీ
న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై పార్లమెంటులో గందరగోళం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయసభలూ చర్చ జరగకుండానే వాయిదా పడ్డాయి. విపక్షాలు సభాకార్యక్రమాలను అడ్డుకోవటం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు యత్నించారుు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకు క్యూలైన్లలో ప్రాణాలు కోల్పోరుున వారిపై (70 మంది) సంతాప తీర్మానం కోసం రాజ్యసభలో విపక్షాలంతా ఏకమై డిమాండ్ చేశారుు. దీనిపై చర్చకు ఓటింగ్ పెట్టాలని ఒత్తిడి చేశారుు. సభాకార్యక్రమాలను అడ్డుకున్నారుు. దీంతో తీవ్ర గందరగోళం నడుమ సభ మంగళవారానికి వారుుదా పడింది. అటు లోక్‌సభలో వారుుదా తీర్మానంకు విపక్షాలు పట్టుబట్టడంతో వరుసగా మూడోరోజూ ఎలాంటి చర్చ జరగకుండానే సభ వారుుదా పడింది. రూల్ 193 కింద (స్వల్పకాలిక) చర్చకు సిద్ధమన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ ప్రకటనను విపక్షాలు తిరస్కరించాయి.
రాజ్యసభలో సంతాప తీర్మానంపై పట్టు
రాజ్యసభలో ప్రధాని సభకు రావాలంటూ చర్చను అడ్డుకుంటున్న విపక్షాలు.. నోట్ల మార్పిడి కారణంగా లైన్లలో నిలబడి మృతిచెందిన వారికి సంతాపం తెలిపే తీర్మానాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారుు. వెల్‌లోకి వచ్చి ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారుు. దీంతో సభ వారుుదా పడింది. సభ తిరిగి ప్రారంభమైనా ఆందోళన కొనసాగటంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నోట్ల మార్పిడి లాభాలు నష్టాలపై చర్చ జరగాలి. కానీ విపక్షాలు ఈ చర్చకు సిద్ధంగా లేవని స్పష్టమైంది. అందుకే రోజుకో కారణంతో సభను స్తంభింపజేస్తున్నారుు’అని విమర్శించారు.
పదిపార్టీలు ఒక్కటై..: నోట్ల రద్దుపై ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని విపక్షాలు నిర్ణరుుంచారుు. సోమవారం పది విపక్షాలు (కాంగ్రెస్, తృణమూల్, జేడీయూ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, ఆర్జేడీ, జేఎంఎం, డీఎంకే) ప్రత్యేకంగా సమావేశమయ్యారుు. లోక్‌సభలో వారుుదా తీర్మానానికి పట్టుబట్టాల్సిందేనని నిర్ణరుుంచారుు. బుధవారం పార్లమెంటు కాంప్లెక్సులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లాలని నిర్ణరుుంచాయి.
మోదీ కొందరి వాడే: రాహుల్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉదయాన్నే ఢిల్లీలోని ఆనంద్ పర్‌బాత్, జకీరా, ఇంద్రలోక్, జహంగీర్ పురీ ప్రాంతాల్లో పలు ఏటీఎంల వద్ద క్యూల్లో ఉన్న వారిని పరామర్శించారు. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకుల నుంచి దొంగదార్లో కొందరు వ్యక్తుల కోసం కొత్తనోట్లు బయటకు వెళ్తున్నాయని ఆరోపించారు. ‘ప్రజలు నోట్లను కాదు ప్రధానిని మార్చాల’ని పంజాబ్ పర్యటనలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విటర్లో విమర్శించారు. కాగా, కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్తున్న పార్టీలను మోదీ బెదిరిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. పెద్దనోటు విడుదల చేస్తున్నప్పుడు ఆర్బీఐ చట్టానికి అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని.. మోదీ ప్రభుత్వం రూ.2వేల నోటు విషయంలో నిబంధనలను ఉల్లంఘించిందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు.