కలకలం.. గదిలో చిన్నారులు, మహిళలు నిర్బంధం | Person Holding Children And Few Women Hostage In House At Uttar Pradesh | Sakshi
Sakshi News home page

కలకలం.. గదిలో చిన్నారులు, మహిళలు నిర్బంధం

Published Thu, Jan 30 2020 10:04 PM | Last Updated on Thu, Jan 30 2020 10:21 PM

Person Holding Children And Few Women Hostage In House At Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫరుఖాబాద్‌లో కలకలం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో 15 మంది చిన్నారులు, మహిళలను గుర్తుతెలియని దుండగుడు నిర్బంధించాడు. పుట్టినరోజు పార్టీ అని పిలిచి.. పిల్లల్ని గృహ నిర్బంధం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఆరుగంటలుగా వారిని రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే పోలీసులు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకోవడంతో..  దుండగుడు పోలీసులపై గ్రనేడ్ విసిరాడు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులతో సహా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా ఘటనా స్థలంలో పోలీసుల ఆపరేషన్‌ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  తాజా ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తీవ్రంగా స్పందించారు. స్థానిక కలెక్టర్‌, పోలీసుశాఖతో మాట్లాడి.. ఘటనపై ఆరా తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement