న్యూఢిల్లీ : రైల్వేలకు రూ.64,587 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు పీయూష్ గోయల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం రూ.19 వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం దేశంలో రోజుకు 27కి.మీ. రహదారిని నిర్మిస్తున్నాం. ప్రపంచంలో అత్యంత వేగంగా రహదారులను నిర్మిస్తున్న దేశంగా భారత్ నిలిచిందన్నారు. కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్‌లను తొలగించామని తెలిపారు. అత్యధిక వేగంగా ప్రయాణించే ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ త్వరలో రానుందని ప్రకటించారు.
‘సాగర్ మాల’ కింద పోర్టుల ద్వారా సరకు రవాణా సులభం చేశామన్నారు. బ్రహ్మపుత్ర నది ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరకు రవాణా కల్పించామని తెలిపారు. సోలార్ విద్యుదుత్పత్తిలో 10 రెట్ల వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment