Infrastructural facilities
-
మస్క్ కాస్కో.. టెస్లాకు పోటీగా ఇండియన్ కార్
రౌద్రం, రణం, రుధిరం సింపుల్‌గా ఆర్ఆర్ఆర్ భారతీయ మూవీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. మీన్ మెటల్ మోటార్ సింపుల్‌గా ఎంఎంఎం. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తాజాగా ఆసక్తి రేపిన స్టార్టప్. ఫస్ట్ ఇండియన్ సూపర్ కార్ తెస్తామంటూ రూట్‌మ్యాప్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో సంచలనం సృష్టించిన టెస్లాతో ఢీ అంటే ఢీ అంటున్నాడు భారత ఔత్సాహిక పారిశ్రామిక వేత్త శర్‌తక్‌పాల్. టెస్లా ఎస్ ప్లెయిడ్ 3ని మించిన ఫీచర్లతో కారు తయారు చేయబోతున్నట్టు ప్రకటించారు. టెస్లాకు సవాల్ విసిరాడు. సాక్షి, వెబ్‌డెస్క్: రెండు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకునే నేర్పు... గరిష్ట వేగం గంటకి 350 కిలోమీటర్లు.... 100 హార్స్ పవర్ కలిగిన శక్తివంతమైన ఇంజన్.... ఒక్క సారి రీఛార్జీ చేస్తే చాలు 700 కి.మీల ప్రయాణం చేయగల సామర్థ్యం, .. ఇవన్నీ చదువుతుంటే టెస్లా కంపెనీ ఎస్ ప్లెయిడ్ 3 ఎలక్ట్రిక్ కారు గుర్తొస్తుందా.. కానీ ఇది ఎస్ ప్లెయిడ్ కాదు ఎంఎంఎం అజానీ ఎలక్ట్రిక్ కారు. తయారు చేస్తోంది ఏ విదేశీ కంపెనీయో కాదు పక్కా భారతీయ సంస్థ. దాని ఓనర్ శర్‌తక్‌పాల్. ఇండియా వర్సెస్ టెస్లా భారత్‌లో దిగుమతి సుంకాలు ఎక్కువని, వాటిని తగ్గిస్తే ఇండియాలో టెస్లా ఈవీ కార్లనె తెస్తామంటూ టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ ప్రకటించారు. దీనికి ప్రతిగా ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే పన్ను రాయితీ గురించి ఆలోచిస్తామంటూ భారత ప్రభుత్వం ఫీలర్ వదిలింది. మరోవైపు ఈవీ వెహికల్స్ తయారు చేసే సత్తా భారతీయులకు ఉందంటూ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అధినేత భవీష్ అగర్వాల్ స్పందించారు. టెస్లాకి సవాల్ ఈవీ వాహనాలు.. ఎలన్‌మస్క్... భారత్‌ల మధ్య రాజుకున్న వేడి ఇంకా చల్లారలేదు. ఇంతలోనే ఎలన్‌మస్క్‌కు షాక్ ఇచ్చే న్యూస్ మరో భారతీయుడైన శర్‌తక్‌పాల్ నుంచి వచ్చింది. ఎలన్‌మస్క్ తనకు ఆదర్శమని, ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో టెస్లా ఓ బ్రాండ్ అని.. కానీ తాము బ్రాండ్ కిల్లర్ అంటూ సవాల్‌కు సై అన్నాడు. త్వరలో తన కంపెనీ నుంచి రాబోతున్న సూపర్ ఎలక్ట్రిక్ కారు విశేషాలను తెలియజేశాడు. భారత సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఎంఎంఎం మీన్ మెటల్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్. సింపుల్‌గా ఎంఎంఎం. ఈ స్టార్టప్‌ని ముగ్గురు మిత్రులతో కలిసి 19 ఏళ్ల శర్‌తక్‌పాల్ 2012లో నెలకొల్పాడు. ఆ తర్వాత 2014లోనే భవిష్యత్తును అంచనా వేసి అజానీ అనే బ్రాండ్ నేమ్‌తో ఇండియన్ మేడ్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలని ఎంఎంఎ లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టార్టప్‌లో శ్రమిస్తున్న వారి సంఖ్య నాలుగు నుంచి ఇరవైరెండుకి పెరగగా.... ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారు కాన్సెప్టు చివరి చేరుకుంది. త్వరలోనే అజానీ కారుతో సంచలనాలు సృష్టిస్తామంటూ తమ మార్కెట్ స్ట్రాటజీని ఇటీవల ఎంఎంఎ వెల్లడించింది. ఎంఎంఎం అజానీ ఎంఎఎం ప్రైవేట్ లిమిలెడ్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం... ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ కారుగా వస్తోన్న అజానీ గరిష్ట వేగం గంటలకు 350 కిలోమీటర్లు, ఇందులో అమర్చిన 120 కిలోవాట్ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు స్పీడ్ మోడ్‌లను బట్టి కనిష్టంగా 550 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 700 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. 986 బ్రేక్‌హార్స్ పవర్ ఇంజన్‌తో కేవలం రెండు సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడు అందుకోగల నేర్పు దీని స్వంతం. మార్కెట్లో హల్చల్ చేస్తోన్న స్పోర్ట్స్ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కారుని డిజైన్ ఉంటుంది. కంపెనీ రిలీజ్ చేసిన ఫోటోలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మార్కెట్‌కి వచ్చేది అప్పుడే అజానీ కారు 2022 ద్వితియార్థంలో అజానీ ప్రొటోటైప్ సిద్ధమవుతుందని ఎంఎంఎం ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. అనంతరం 2023 ప్రారంభంలో యూకేలో ఈ కారుని ఫస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఆ మరుసటి ఏడాది యూఏఈలో అందుబాటులోకి తేనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జెండా పాతిన తర్వాత 2025లో ఇండియాకు అజానీని తీసుకువస్తామని చెబుతున్నారు. ఇండియాలో ఈ కారు ధర ఇండియాలో కనిష్టంగా 89 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అన్నింటా భిన్నమే ప్రస్తుతం కార్ మాన్యుఫ్యాక్లరింగ్ యూనిట్లో ఐదో వంతు ఉండే యూనిట్‌తోనే అజానీ కార్లు తయారు చేయబోతున్నట్టు ఎంఎంఎం ప్రకటించింది. ఈ మేరకు కారు ఎయిరోడైనమిక్స్, రీసెచ్చ్ అండ్ డెవలప్మెంట్లకు సంబంధించి ఎంఎంఎం టీమ్ సభ్యులు అమెరికా, జర్మనీలకు చెందిన ఇంజనీర్లతో కలసికట్టుగా పని చేస్తున్నారు. వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు సమీకరిస్తున్నారు. రెండేళ్లలో మార్పు ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ఇటు ప్రభుత్వం, అటు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నా.. మౌలిక సదుపాయల కొరత ఎక్కువని ఎంఎంఎం సీఈవో శర్‌తక్‌పాల్ అంటున్నారు. రెండేళ్లలో ఈ సమస్య తీరిపోతుందని ఆయన అన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సంబంధించి పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇండియా వెనుకబడి ఉందని, అజానీ రాకతో ఈ పరిస్థితులో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
కొరతలతో రోగుల కలత
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న ఊరట లేకుండా బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్‌లు పంజా విసరటం మొదలైంది. కరోనా వైరస్ కేసులతో పోలిస్తే ఇవి తక్కువైనా అన్ని రాష్ట్రాల్లోనూ వీటి జాడ కనబడటం ఆందోళన కలిగించే అంశం. ఇంతవరకూ 12,000కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇవింకా పెరిగే అవకాశం కూడా వుందని నిపుణులు చెబుతున్న మాటలు దడ పుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒక రోగికి ఎండోస్కోపీ చేసినప్పుడు అతనిలో ఈ మూడు రకాల ఫంగస్‌లూ వున్నట్టు తేలింది. చివరకు ఆయన మరణించాడు. నిపుణులంటున్నట్టు ఈ ఫంగస్‌లు అంటువ్యాధులు కావచ్చు...కాకపోవచ్చు. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కానీ వీటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మహమ్మారిగా గుర్తించారు. కరోనా అరికట్టడానికి రోగులపై మోతాదుకు మించి వాడిన స్టెరాయిడ్లవల్ల ఈ ఫంగస్‌లు పుట్టుకొస్తు న్నట్టు గుర్తించారు. ఫంగస్ల నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలు తదితరాలపై ఇప్పటికే వైద్యులకు అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఇది ఎక్కువున్నట్టు తెలుసు కున్నారు. కానీ విషాదమేమంటే చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో వుండటం లేదు. ఈ నెల 19నాడే ఢిల్లీ హైకోర్టు ఈ పరిస్థితిని గుర్తించి ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయో గాలించి, ఆ మందులు తక్షణం అందుబాటులో వుండేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటికే వాటిని ఉత్పత్తి చేసే సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని, ప్రపంచ మార్కెట్లో కూడా కేంద్రం కొనుగోలు చేయడానికి సిద్ధంగా వున్నదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం వారణాసిలోని ఆరోగ్య సిబ్బందినుద్దేశించి జరిపిన ఆన్లైన్ సమావేశంలో ఫంగస్ ఇన్ఫెక్షన్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఏం ప్రయోజనం? పది రోజలు గడుస్తున్నా ఢిల్లీలో ఈ వ్యాధిగ్రస్తులకు ఎక్కడా మందులు దొరకటం లేదు. అక్కడే కాదు...మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి వుంది. వ్యాపారులు డబ్బు చేసుకోవడానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఫిర్యాదులొస్తున్నా పట్టించుకునేవారు కరువ య్యారు. ఈ విషయంలో కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మొదలుకొని విపక్షా లన్నీ కోరాయి. కానీ ఫలితం లేదని, పది రోజుల తర్వాత కూడా పరిస్థితి యధాతథంగా వున్న దని ప్రధాన నగరాల్లోని ఆసుపత్రుల్లో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనిస్తే అర్థమవు తుంది. ఆంధ్రప్రదేశ్ ఈ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నట్టు వెనువెంటనే ప్రకటిం చింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా వెనకబడే వున్నాయి. కరోనా అయినా, దాని పర్యవసానంగా వస్తున్న ఫంగస్ వ్యాధులైనా ఎలా వ్యాపించాయి.. కారకులెవరు అనే ప్రశ్నలు ఇంకా తేలవలసివుంది. కనీసం మందుల లభ్యత విషయంలోనైనా కేంద్రం అప్రమత్తంగా లేకపోవటం...న్యాయస్థానాలు ఆదేశించినా ఫలితం లేకపోవటం దిగ్భ్రాంతికరం. మొన్నటి వరకూ ఆక్సిజన్ కొరతతో సతమతమైన రోగులు ఇప్పుడు ఈ ఫంగస్ నివారణకు మందులు దొరక్క అల్లాడుతున్నారు. ఢిల్లీలో ఒక ప్రభుత్వాసుపత్రికి రోజుకు 3,000 ఇంజక్షన్లు కావాల్సివుండగా కేవలం 350 మాత్రమే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వున్నదో గ్రహించవచ్చు. ఢిల్లీ ఆసుపత్రులకు వారానికి 30,000 అవసరమైతే 3,850 మాత్రమే వస్తున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీనగర్ వంటిచోట్ల ఈ ఫంగస్లకు సరైన చికిత్స అందించేవారు లేకపోవటంతో అక్కడివారు ఎంత దూరమైనా లక్ష్యపెట్టక మహా రాష్ట్ర, గుజరాత్ వంటిచోట్లకు రావాల్సివస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా దేశ పౌరులు ఇలాంటి దుస్థితిలో వుండటం మనకు అప్రదిష్ట తెస్తుందన్న ఇంగిత జ్ఞానం కూడా పాలకులకు లేకుండాపోతోంది. పంటి నొప్పితో మొదలై సైనస్‌గా మారి, ఆ తర్వాత నోటికి, కనుబొమలకు వ్యాపించి, చివరకు కళ్లనూ, మెదడునూ కూడా దెబ్బతీసి ప్రాణాలు హరిస్తున్న ఈ ఫంగస్లకు చెందిన మందులు అందుబాటులో వుంచాలని గుర్తించకపోవటం విచారకరం. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా వెల్లడవుతున్న ప్రతి ఒక్క కేసుకూ, బయటపడని 23 కేసులుండొచ్చని నీతి ఆయోగ్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్ఫెక్షన్లు వున్నా పరీక్షల్లో బయటపడని స్థితి. ఒకపక్క కరోనా వైరస్ జనం ప్రాణాలతో ఆటలాడుతుంటే... వ్యాక్సిన్ల కొరత, మందుల కొరత జనంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ఫంగస్లకు ఇస్తున్న ఇంజెక్షన్లు కూడా మోతాదు మించితే ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మొదలుకొని రాష్ట్రాల్లో ఆ శాఖను చూసేవారి వరకూ అందరూ చురుగ్గా స్పందించాలి. ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా చూడాలి. తగినంతమంది నిపుణుల్ని అందుబాటులో వుండేలా చూసుకోవాలి. అదే సమయంలో ఇంజెక్షన్ల వాడకం హేతుబద్ధంగా వుండేట్టు తగిన మార్గదర్శకాలు రూపొందించాలి. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి నిర్దిష్టమైన ప్రోటోకాల్ కొరవడటం వల్లే ఈ ప్రమాదకర మైన ఫంగస్‌లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వీటి విషయంలో కూడా నిర్లక్ష్యంగా వుంటే మరేం జరుగుతుందో అనూహ్యం. అందుకే మందులు అందుబాటులో వుండేలా చూడటంతోపాటు రోగులకు ఉచిత చికిత్స అందేందుకు ప్రభుత్వాలన్నీ తగిన చర్యలు తీసుకోవాలి. -
ఇంటర్ విద్యకు ‘చైనా’ వైరస్
సాక్షి, హైదరాబాద్: అవన్నీ ఐదారు అంతస్తుల భవనాలు.. వాటిల్లో ఒకట్రెండు లిఫ్టులున్నా అవి విద్యార్థులు వినియోగించడానికి వీల్లేదు! భవనాల చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరగడం కాదు కదా కనీసం ఆయా భవనాల్లో ఉండాల్సినన్ని అగ్నిమాపక పరికరాలకూ దిక్కులేదు!! ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే ఇక అంతే సంగతులు. ప్రమాదం అంచున వేల మంది విద్యార్థుల జీవితాలు. ఇదీ శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో పరిస్థితి. ఫైర్ సేఫ్టీ కచ్చితంగా ఉండాల్సిందేనని ఇంటర్మీడియెట్ బోర్డు ఏటా నోటీసులు ఇవ్వ డం.. అందినకాడికి ముడుపులు పుచ్చుకోవ డం.. ఆ తరువాత మిన్నకుండిపోవడం పరిపాటిగా మారింది. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందనే సాకుతో ఏళ్ల తరబడి షరతులతోనే ఆ కాలేజీలను యాజమాన్యాలు కొనసాగిస్తున్నా యి. ఈసారీ అదే ఆయుధాన్ని ఉపయోగిం చాయి. అయితే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో 2020– 21విద్యా సంవత్సరంలో ఆయా కాలేజీ లపై పక్కా చర్యలు చేపడతామని ఇంటర్మీడియెట్ బోర్డు చెబుతున్నా ఎంతవరకు ఆచరిస్తుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు అనుమతుల్లేకుండా కొనసాగుతున్న ఆయా కాలేజీల హాస్టళ్లు నరకానికి నకళ్లుగా ఉన్నా అధికారులకు కనీస పట్టింపు లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఆ రెండింటివే 44 కాలేజీలు... ఫైర్ సేఫ్టీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కాలేజీలు రాష్ట్రంలో 79 ఉండగా అందులో 44 కాలేజీలు ఆ రెండు విద్యాసంస్థలకు సంబంధించినవే ఉన్నట్లు ఇంటర్ బోర్డు తేల్చింది. అందులో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన జూనియర్ కాలేజీలు 18 ఉండగా, నారాయణ విద్యా సంస్థలకు చెందిన కాలేజీలు 26 ఉన్నాయి. ఇక శ్రీగాయత్రి విద్యాసంస్థలకు చెందిన కాలేజీలు 8 ఉండగా ఎన్ఆర్ఐ విద్యాసంస్థలకు చెందిన కాలేజీలు 5 ఉన్నాయి. ఇవే కాకుండా తపస్యా జూనియర్ కాలేజీ, క్వీన్ మేరీ, లియో, క్షత్రియ, క్వీన్ మేరీ, గౌతమి తదితర కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ఆ విద్యార్థుల కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే... తమిళనాడు కుంభకోణంలోని ఓ పాఠశాలలో 2004లో జరిగిన అగ్నిప్రమాదంలో 94 మంది విద్యార్థులు సజీవదహనమయ్యారు. ఆ తరువాత సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫైర్ సేఫ్టీ, అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండా బహుళ అంతస్తుల భవనాల్లో ఎలాంటి విద్యాసంస్థలను కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయినా రాష్ట్రంలో ఆ నిబంధనలను అమలు చేయడంలో ఇంటర్ బోర్డు, పాఠశాల విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. 15 మీటర్లకు మించిన భవనాల చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగేలా సెట్ బ్యాక్స్ ఉండాలన్న నిబంధనను కార్పొరేట్ విద్యాసంస్థలు అమలు చేయడం లేదు. కనీసం భవనాల్లో సరిపడా అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తూ విద్యార్థుల జీవితాలను ప్రమాదం అంచుకు నెట్టేస్తున్నాయి. హాస్టళ్లలో పరిస్థితి దుర్భరం.. అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండా కొనసాగుతున్న కాలేజీలను కొనసాగి స్తున్న విద్యా సంస్థలే హాస్టళ్లను సైతం నిర్వహిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే రాష్ట్రంలో దాదాపు 500 హాస్టళ్లను జూనియర్ కాలేజీలకు అనుబంధంగా కొనసాగిస్తున్నాయి. మూడేళ్ల కిందట హాస్టళ్ల నియంత్రణను ఇంటర్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినా అది అచరణకు నోచుకోలేదు. పైగా అందులో అత్యధికంగా ఉన్నవన్నీ బహుళ అంతస్తుల భవనాల్లో కొనసాగుతున్నవే. వాటికి అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. ఇక ఆయా హాస్టళ్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి మరీ దుర్భరం. ఒక్కో గదిలో నలుగురు విద్యార్థుల చొప్పున ఉండాల్సి ఉన్నప్పటికీ 8 మందిని కుక్కుతున్నట్లు ఇంటర్ బోర్డు తనిఖీల్లో తేల్చింది. అంతేకాదు సరిపడా టాయిలెట్లు లేని దుస్థితి నెలకొందని గుర్తించింది. ఏసీ గదుల పేరుతో ఫీజులు వసూలు చేస్తూ కనీసం ఫ్యాన్లకు దిక్కులేని పరిస్థితిని యాజమాన్యాలు కల్పిస్తున్నాయని కనుగొంది. ఒకట్రెండు లిఫ్ట్‌లు మాత్రమే పెట్టి, అవీ విద్యార్థులను వాడనీయకుండా చేస్తున్నాయి. విద్యార్థులు రోజూ నాలుగైదు అంతస్తులు ఎక్కి దిగేందుకు ఇబ్బందులు పడతున్నా యాజమన్యాలు లేదా అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అడ్డూ అదుపులేని ఫీజులు.. కాలేజీల్లో ఫీజల నియంత్రణ ఇంటర్ బోర్డుకు పట్టడం లేదు. రకరకాల పేర్లతో రూ. లక్ష నుంచి మొదలుకొని రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టడం లేదు. 10–20 మంది టాప్ ర్యాంకర్లను ఎరగా చూసి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. ఫీజు చెల్లించడంలో ఆలస్యమైతే విద్యార్థులను టీసీ ఇచ్చి పంపేస్తున్నాయి. ఇటీవల అవినాష్ కాలేజీలో ఫీజు చెల్లించలేదన్న సాకుతో వేధిస్తున్నారంటూ దీపక్ అనే విద్యార్థి సూసైడ్ నోట్ రాయడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. అనుమతులు లేకుండానే రాష్ట్రంలో దాదాపు 500 హాస్టళ్లను జూనియర్ కాలేజీలకు అనుబంధంగా కొనసాగిస్తున్నాయి. మూడేళ్ల కిందట హాస్టళ్ల నియంత్రణను ఇంటర్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినా అది ఆచరణకు నోచుకోలేదు. పైగా అందులో అత్యధికంగా ఉన్నవన్నీ బహుళ అంతస్తుల భవనాల్లో కొనసాగుతున్నవే. వాటికి అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. ఇక ఆయా హాస్టళ్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి మరీ దుర్భరం. ఒక్కో గదిలో నలుగురు విద్యార్థుల చొప్పున ఉండాల్సి ఉన్నప్పటికీ 8 మందిని కుక్కుతున్నట్లు ఇంటర్ బోర్డు తనిఖీల్లో తేల్చింది. అంతేకాదు సరిపడా టాయిలెట్లు లేని దుస్థితి నెలకొందని గుర్తించింది. ఏసీ గదుల పేరుతో ఫీజులు వసూలు చేస్తూ కనీసం ఫ్యాన్లకు దిక్కులేని పరిస్థితిని యాజమాన్యాలు కల్పిస్తున్నాయని కనుగొంది. ఒకట్రెండు లిఫ్ట్‌లు మాత్రమే పెట్టి, అవీ విద్యార్థులను వాడనీయకుండా చేస్తున్నాయి. విద్యార్థులు రోజూ నాలుగైదు అంతస్తు లు ఎక్కి దిగేందుకు ఇబ్బందులు పడుతున్నా యాజమాన్యాలు లేదా అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అడ్డూ అదుపులేని ఫీజులు: కాలేజీల్లో ఫీజల నియంత్రణ ఇంటర్ బోర్డుకు పట్టడం లేదు. రకరకాల పేర్లతో రూ. లక్ష నుంచి మొదలుకొని రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టడం లేదు. 10–20 మంది టాప్ ర్యాంకర్లను ఎరగా చూసి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. ఫీజు చెల్లించడంలో ఆలస్యమైతే విద్యార్థులను టీసీ ఇచ్చి పంపేస్తున్నాయి. ఇటీవల అవినాష్ కాలేజీలో ఫీజు చెల్లించలేదన్న సాకుతో వేధిస్తున్నారంటూ దీపక్ అనే విద్యార్థి సూసైడ్ నోట్ రాయడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. -
పాక్‌లో ఉగ్రవాద శిక్షణకు సకల సౌకర్యాలు
పాకిస్తాన్లో వేలాది మంది యువకులను బలవంతంగా ఉగ్రవాదులు 'డీరాడికలైజేషన్ క్యాంప్స్' కేంద్రాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నట్లు భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీకి సమాచారం అందింది. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ పాకిస్తాన్‌లోని పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతాలలో డజనుకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసి 700 మందికి శిక్షణ అందించే విధంగా రూపొందించినట్లు ఉపగ్రహ చాయా చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది యువకులకు శిక్షణ ఇస్తూనే వారి అవసరాల మేరకు అత్యున్నత మౌళిక సదుపాయాలతో నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో ప్రార్థనలు చేసేందుకు మసీదు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, విలాసవంతమైన గదులను ఏర్పాటు చేశారు. (కత్తెరించినా తెగని ఉక్కు కంచె ఏర్పాటు) ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శిక్షణ పొందుతున్న వారిలో 92శాతం 35 కన్నా తక్కువ వయసువారే కావడం, మరో 12 శాతం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారని తెలిసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనడానికి వారు శిక్షణ అందిస్తున్న హైటెక్ శిబిరాలే చెబుతున్నాయని ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. జమ్మూ కాశ్మీర్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చొరబాట్లను ఆపేందుకు ఉక్కు కంచె నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యల తర్వాత పాక్ డీరాడికలైజేషన్ శిబిరాలు చర్చనీయాంశంగా మారాయి. -
బడ్జెట్ 2019 : మౌలికరంగ వసతుల కల్పనకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ : రైల్వేలకు రూ.64,587 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు పీయూష్ గోయల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం రూ.19 వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం దేశంలో రోజుకు 27కి.మీ. రహదారిని నిర్మిస్తున్నాం. ప్రపంచంలో అత్యంత వేగంగా రహదారులను నిర్మిస్తున్న దేశంగా భారత్ నిలిచిందన్నారు. కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్లను తొలగించామని తెలిపారు. అత్యధిక వేగంగా ప్రయాణించే ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ త్వరలో రానుందని ప్రకటించారు. ‘సాగర్ మాల’ కింద పోర్టుల ద్వారా సరకు రవాణా సులభం చేశామన్నారు. బ్రహ్మపుత్ర నది ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరకు రవాణా కల్పించామని తెలిపారు. సోలార్ విద్యుదుత్పత్తిలో 10 రెట్ల వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానించినట్లు తెలిపారు. -
సమస్యలతో సతమతం
వాంకిడి : గిరి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా అవి క్షేత్రస్థాయిలో మారుమూల గ్రామాలకు చేరడం లేదు. నేటికీ ఆ గ్రామాలు అనేక సమస్యలతో సతమతమవుతూనే ఉన్నా యి. పాలకులు మారుతున్నా గ్రామాల పరిస్థితి మాత్రం మారడం లేదు. దీనికి నిదర్శనం మండలంలోని వెల్గి గ్రామ పంచాయతీ పరిధిలో కోపగూడ. పారిశుధ్యం అస్తవ్యస్తం... గ్రామంలో 30 కుటుంబాకు వంద వరకు జనాభా ఉంది. ఈ గ్రామంలో ఉన్న నాలుగు చేతిపంపుల్లో మూడు మాత్రమే పని చేస్తున్నాయి. అవి కూడా సరిగా పని చేయడం లేదు. గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు లేక పోవడంతో గ్రామంలో పారిశుధ్యం లోపించిందని గ్రామస్తులు వాపోతున్నారు. వర్షాకాలంలో రోడ్లు, ఇంటి పరిసరాలు బురదగా మారడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గ్రామానికి సందర్శించిన ప్రజా ప్రతినిధులు గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చెప్పిన వారు నేడు గ్రామాన్ని తొంగి కూడా చూడడం లేదని ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి పారిశుధ్య పనులు నిల్! గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టక పోవడంతో చెత్తా చెదారం పేరుకుపోయి పారిశుధ్యం లోపించిదని గ్రామస్తులు చెబుతున్నారు. నెలల తరబడి పారిశుధ్య పనులు చేపట్టక పోవడంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు సంక్రమిస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు గ్రామ సమస్యలపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. సీసీ రోడ్లు నిర్మించాలి గ్రామంలో అంతర్గ రోడ్లు, డ్రెయినేజీలు లేక పోవడంతో గ్రామంలో పారిశుధ్యం లోపిస్తోంది. వర్షాకాలంలో ఇంటి నుంచి కాలు బయట పెట్టలేక పోతున్నాం. చాలా ఇబ్బందిగా మారింది. ఎన్నికల సమయంలో గ్రామనికి వచ్చిన నాయకులు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఇప్పటివరకు ఒక్క రోడ్డు గాని డ్రెయినేజీ గాని నిర్మాణం జరగలేదు. – మడావి భీంరావు, గ్రామస్తుడు పారిశుధ్య పనులు చేపట్టాలి గ్రామంలో పారిశుధ్యం లోపించి దుర్గంధం వ్యాపిస్తోంది. నెలల తరబడి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టడం లేదు. దీంతో గ్రామంలో పారిశుద్ద్యం లోపించడంతో గ్రామస్తులు రోగాల భారీన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను గుర్తించి గ్రామంలో ఎప్పటికప్పుడు పారశుధ్య పనులు చేపట్టాలి. గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలి. – సిడాం మెంగు, గ్రామస్తుడు సమస్యలు తెలుసుకుంటా గ్రామ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తా. సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాల కోసం అధికారులకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపిస్తా. నిధులు మంజూరు కాగానే గ్రామంలో సౌకర్యాలు కల్పిస్తాం. ప్రభుత్వం విడతల వారీగా మారుమూల గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తోంది. నిధులు రాగానే పనులు చేపట్టి గ్రామస్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. – అర్జున్పవార్, ఈవోపీఆర్డీ, వాంకిడి -
సౌకర్యాలు మృగ్యం..
బెల్లంపల్లిరూరల్ : చాకేపల్లి...మండలంలోని ఏకైక గిరిజన గ్రామమైన ఇక్కడ మౌలిక వసతులు కానరావడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా..అధికారులు వస్తూ వెళ్తున్నా గ్రామ రూపురేఖలు మారడం లేదు. కనీస సౌకర్యాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ గ్రామం చాకేపల్లిలో కనీస సౌకర్యాల లేమిపై ‘సాక్షి’ కథనం.. వెయ్యికి పైగా జనాభా ఉన్న చాకేపల్లిని దశాబ్దాల క్రితమే ప్రభుత్వం ఏజెన్సీ గ్రామంగా ప్రకటించింది. ఏజెన్సీ గ్రామంగా ఉండీ ఏ అభివృద్ధికి నోచడం లేదు. పంచాయతీకి మంజూరవుతున్న అరకొర నిధులే తప్పా ఐటీడీఏ నుంచి నిధులు లేకపోవడంతో అభివృద్ధి పడకేసింది. గ్రామంలో ప్రధానంగా అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. సీసీ రోడ్డు ఊసే లేకుండా పోతుంది. ప్రధాన వాడలకు సైతం సరైన రోడ్లు లేవు. మట్టి రోడ్లు గుంతలు పడి, కంకర పైకి తేలి అధ్వానంగా ఉన్నాయి. అధ్వానంగా కాలువలు.. గ్రామంలో మురుగునీటి పారుదల సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పూడిక నిండి కంపు వాసన కొడుతున్నాయి. మురుగు బయటకు వెళ్లడానికి సౌకర్యం కరువైంది. కొన్ని వాడలలో ఇంకా మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణానికి నోచడం లేదు. దీంతో మురుగు మొత్తం రోడ్లపైనే ప్రవహిస్తోంది. తాగునీటికి తంటాలు.. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. కొన్ని వాడలలో చేతిపంపులు ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయిలో అవి పనిచేయడం లేదు. ఎండాకాలంలో నీటి సమస్య రెట్టింపవుతుంది. ప్రతి వేసవిలో గ్రామస్తులకు నీటి తిప్పలు తప్పడం లేదు. పట్టింపులేని ఐటీడీఏ.. గిరిజన గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఐటీడీఏ శ్రద్ధ వహించడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. గ్రామంలో ఇప్పటి వరకు చెప్పుకో తగ్గ పనులేమీ చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. ఆరోగ్య ఉపకేంద్రం కోసం ఓ భవనం నిర్మించి, కొద్దిమొత్తంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం తప్పా మరే ఇతర పనులు కల్పించలేదు. అసలు ఐటీడీఏ అధికారులు ఏడాదికోసారైనా గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. -
అంగన్వాడీ అస్తవ్యస్తం
నిర్మల్అర్బన్ : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల కు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం విస్మరిస్తోంది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఆయా పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం చేస్తోంది. దీంతో పలు అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. నోటిఫికేషన్ వెలువడి మూడు నెలలైనా ఇ ప్పటివరకు భర్తీకి నోచుకోలేదు. దీంతో ఖాళీగా ఉన్న కేంద్రాల్లో చిన్నారుల ఆలనాపాలన కరువవుతోంది. ఓ వైపు సిబ్బంది కొరత, మరోవైపు సౌకర్యాల లేమి.. వెర సి రేపటి పౌరుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలోని కొన్ని కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అ ద్దె భవనాల్లో కొన్ని, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. దీంతో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణమే లేకుండా పోతోంది. సరైన గదులు లేక ఇరుకైన, చీకటి గదుల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అంగన్వాడీ సమాచారం అంగన్వాడీ కేంద్రాలు : 816 మినీ అంగన్వాడీలు : 110 నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలు: 242 (టీచర్–55, ఆయా–151, మినీ అంగన్వాడీ టీచర్–36) అద్దె భవనాలు.. అరకొర వసతులు.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించింది. సొంత భవనాల నిర్మాణం, వసతుల కల్పనను విస్మరించింది. చాలా కేంద్రాలు అద్దె భవనాలు, అరకొర వసతుల మధ్య కొనసాగుతుండగా.. నిత్యం కేంద్రాలకు వచ్చే కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నారులు గాలి, వెలుతురు లేని ఇరుకైన గదుల్లోనే చదువు కొనసాగించాల్సి వస్తోంది. చిన్నారుల ఆట, పాటలకు సరైన వసతులు లేవు. కొన్ని అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం చెల్లించే అద్దె కూడా సక్రమంగా రాకపోవడంతో నిర్వహణ కష్టతరంగా మారుతోంది. దీంతో అంగన్వాడీ టీచర్లు ఇంటి యజమానుల కు అద్దె చెల్లించేందుకు పాట్లు పడుతున్నారు. వివాదంతో నిలిచిన పోస్టుల భర్తీ.. జిల్లా వ్యాప్తంగా 926 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 816 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 110 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో ఆరేళ్లలోపు చిన్నారులు సుమారు 64,335 మంది ఉన్నారు. 7,170 మంది వరకు గర్భిణులు, 6,081 మంది వరకు బాలింతలున్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రతీరోజు గుడ్డు, పౌష్టికాహారాన్ని అందించాలి. పిల్లలకు బాలామృతం, గుడ్లు, పౌష్టికాహారం అందించాలి. వీటితో పాటు చిన్నారులకు కథలు చెప్పాలి. అక్షరాలు నేర్పించాలి. అయితే.. జిల్లాలో 242 అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్తులు ఖాళీగా ఉండడంతో సేవల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటి భర్తీ కోసం అక్టోబర్ 2017లో ప్రభుత్వం నోటిí œకేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ పూ ర్తయి, తుది జాబితా వెలువడింది. అయితే ఇందులో స్థానికేతరులు, అనర్హులకు పోస్టులు కేటాయించారని కొందరు కలెక్టర్ ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విచారణ చేపట్టి మెరిట్ ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మే రకు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. పోస్టు ల నియామకం కలెక్టర్ ఆదేశాల మేరకు తర్వలోనే చేపడతామని జిల్లా మహిళా శిశు సంక్షే మ శాఖ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. -
సమస్యల సంక్షేమం
తాండూర్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం సమస్యలకు నిలయంగా మారింది. మౌళిక వసతులు కానరావడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టూ వెక్కిరిస్తున్న సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఈ వసతి గృహంలో మొత్తం 85 మంది నిరుపేద విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. సుదుర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సమీప పాఠశాలల్లో చేరి చదువు కొనసాగిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలతో ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు వసతి గృహంలో ఏర్పడిన సమస్యలతో సతమతమవుతున్నారు. మౌలిక సదుపాయాలు మృగ్యం.. వసతి గృహ ప్రాంగణంలో సుమారు రూ.7 లక్షలతో నీటి ట్యాంకు నిర్మించి ఐదేళ్లు గడుస్తుంది. అయినా నేటికీ దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. పాత నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుని నీరు నిలువ ఉండటం లేదు. ఎప్పటికప్పుడు మోటార్ వేసుకుని ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే ఒకసారి స్నానం చేసే పరిస్థితి నెలకొంది. నీటి సరఫరా లేకపోవడం వల్ల మరుగుదొడ్లు ఉపయోగపడడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు రెల్వే ట్రాక్ పక్కన బహిర్భూమికి వెళుతున్నారు. దీనికి తోడు వసతిగృహానికి ప్రహరీ లేదు. దీంతో పందులు స్వైర విహారం చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. చలికి గజగజ.. హాస్టల్ గదుల్లో తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. దీంతో విద్యార్థులు చలికి గజగజ వణుకుతూ రాత్రిళ్లు నిద్రించాల్సిన దుర్భర పరిస్థితులు ఉన్నాయి. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ (ఆర్వో ) ప్లాంటు నేటికీ నిరుపయోగంగానే ఉంది. ఇలా అనేక సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సమయంలో విద్యార్థులు సమస్యలు ఏకరువు పెట్టారు. సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఉన్నతాధికారులను ఆదేశించినా మార్పేమి లేకుండా పోయింది. ఐదేళ్లుగా ఇన్‌చార్జిలే... సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఐదేళ్లుగా ఇన్చార్జి వార్డెన్లే కొనసాగుతున్నారు. 2012 వరకు రెగ్యూలర్ వార్డెన్ నియమించిన అధికారులు ఆ తరువాత ఇన్చార్జిలతో సరిపెడుతున్నారు. ప్రస్తు తం ఉన్న వార్డెన్‌కు ఓ చోట రెగ్యులర్‌గా డ్యూటీ నిర్వహిస్తుండగా, మరో మూడిం టికి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. దీంతో హాస్టల్, విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులతో పాటు పలువురు కోరుతున్నారు. -
అర్జీలే..అర్జీలు
ముగిసిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలు * ప్రజల నుంచి సుమారు 2.50 లక్షల దరఖాస్తులు * 27 వేల మందికి పింఛన్ల నిలిపివేత * కొత్తగా పింఛన్లు కోరుతూ 25 వేల దరఖాస్తులు * 100 వాటర్ ప్లాంట్లతో సరి ఏలూరు : జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. చివరి రోజున పెంటపాడు మండలం పడమర విప్పర్రు, పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం గ్రామాల్లో సభలు నిర్వహించారు. అక్టోబర్ 2న ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, హుద్‌హుద్ తుపాను కారణంగా గత నెల 11 నుంచి వారుుదా వేశారు. తిరిగి నవంబర్ 1నుంచి కార్యక్రమాలు ప్రారంభం కాగా, ఆ రోజున ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో జరిగిన గ్రామ సభల్లో పాల్గొన్నారు. పింఛను మొత్తాలను పెంచిన ప్రభుత్వం జిల్లాలో సుమారు 27 వేల మంది పింఛనుదారులను అనర్హులుగా పేర్కొంటూ.. వారికి ఆ మొత్తాలను ఇవ్వడం నిలిపివేయడం విమర్శలకు తావిచ్చింది. ఘుల్లుమన్న లబ్ధిదారులు న్యాయం చేయండంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. కొత్తగా పింఛన్లు మంజూ రు చేయూలంటూ 25 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. జన్మభూమిలో భాగంగా చేపట్టిన నీరు-చెట్టు, స్వచ్ఛ భారత్‌పై అవగాహన కార్యక్రమాలు మొక్కుబడిగానే సాగాయి. అర్జీలు ఫుల్.. పరిష్కారం నిల్ సామాజిక సమస్యలు, మౌలిక వసతుల కల్పన, ఇతర అంశాలపై ప్రజల నుంచి రమారమి 2.50 లక్షల అర్జీలు అందారుు. మండలాల వారీగా వచ్చిన అర్జీలను కేటగిరీల వారీగా విభజించి పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతి అర్జీని ఆన్లైన్లో పొందుపర్చడానికి చాలా సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో పంచాయతీలకు అభివృద్ధి పనుల నిమిత్తం రూ.5 నుంచి రూ.20 లక్షల వరకు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మొత్తాలను జన్మభూమి సభల సందర్భంగా వెలుగు చూసిన సమస్యల పరిష్కారానికి వినియోగించేలా చర్యలు చేపడితే ఎంతోకొంత ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం టీడీసీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 100 వాటర్ ప్లాంట్ల ప్రారంభం రక్షిత నీరు లభ్యం కాని నివాసిత ప్రాంతాల్లోని ప్రజలకు రూ.2కే 20 లీటర్ల మంచినీటిని అందించేందుకు వీలుగా వాటర్ ప్లాంట్లను నెలకొల్పుతామన్న ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. జిల్లాలో కనీసం 340 వాటర్ ప్లాం ట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటిం చగా, సుమారు 100 ప్లాంట్లను మాత్రమే ప్రారంభించారు. కొన్నిచోట్ల ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్న ప్లాంట్లకు కొత్త రంగులు వేసి వాటిని కొత్తగా ఏర్పాటు చేసినట్టు ప్రకటిం చడం విమర్శల పాలైంది. కాగా, జన్మభూమి గ్రామ సభల సందర్భంగా 1,400 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు యంత్రాంగం చెబుతోంది. -
హవ్వ.. ఇదేం దుస్థితి!
సర్కార్ బడుల్లో మరుగుదొడ్ల ఏర్పాటు కలేనా? - ఎవ్వరికీ పట్టని విద్యార్థినుల గోస - సుప్రీంకోర్టు హెచ్చరించినా ఫలితం శూన్యం - ఆర్వీఎం, ఆర్డబ్ల్యూఎస్ మధ్య సమన్వయ లోపం - ముందుకు సాగని పనులు.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని విద్యాహక్కు చట్టం చెప్తున్నా.. అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. పాఠశాలల దుస్థితి మారడం లేదు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం వంటి కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సమయాల్లో.. పాఠశాల నుంచి దూరంగా వెళ్లలేక.. ఎవరికీ చెప్పుకోలేక బాలికలు లోలోపలే కుంగిపోతున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో నిర్మించిన టాయిలెట్స్‌కు నిర్వహణ లేక, శుభ్రపరిచేందుకు సిబ్బంది, నిధులు, నీటి వసతులు లేక కంపుకొడుతున్నాయి. ఫలితంగా నిర్మించిన మూణ్నాళ్లకే నిరుపయోగంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించినా.. విద్యాశాఖ(రాజీవ్ విద్యామిషన్), ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో పనులు ముందుకు సాగడంలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండాలి. ఈ లెక్కన 138 ప్రభుత్వ పాఠశాలల్లో 1,230 మరుగుదొడ్లు అవసరమని అధికారులు తేల్చి చెప్పారు. కాగా విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో వసతులు లేవని ఆరోపిస్తూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు తక్షణమే అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించాలని ఆదేశించడంతో విద్యాశాఖ అధికారుల్లో చలనం వచ్చింది. ప్రతి పాఠశాలలో బాలురకు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలి. ప్రతి 40 మంది బాలికలకు ఒకటి, ప్రతి 80 మంది బాలురకు ఒకటి చొప్పున మరుగుదొడ్లు ఉండాలని కోర్టు సూచించింది. దీంతో జిల్లా అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటివరకు 138 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, 70 పాఠశాలల్లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని నిర్ధారించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 238 మరుగుదొడ్లు లేవని అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు అత్యవసర సమయాల్లో పాఠశాల నుంచి దూరంగా వెళ్లాల్సి వస్తోందని, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో 240 పాఠశాలలకు తాగునీటి సౌకర్యం లేదు. కాగా విద్యార్థులు తాగడానికే నీరు లేకపోవడంతో ఉన్న టాయిలెట్స్‌ను శుభ్రం చేసే పరిస్థితి లేక కంపు కొడుతున్నాయి. సమన్వయ లోపంతోనే జాప్యం జిల్లాలో పలు పాఠశాలకు టాయిలెట్స్ మంజూరు కాకపోగా మంజూరైనవాటిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సకాలంలో పూర్తి చేయడంలేదు. ఆర్వీఎం, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనులు ముందుకు సాగడంలేదని విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిధులు మంజూరు చేశారు. వీటితో మరుగుదొడ్లు, తాగునీటి వసతుల యూనిట్లు నిర్మించాలని ఈ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించారు. ఈ పనులు అప్పగించి 15 నెలలు కావస్తున్నా నేటికి 450 మరుగుదొడ్లు, 400 తాగునీటి యూనిట్లు మాత్రమే పూర్తిచేశారు. మిగిలిన పనులు నిలిచిపోయాయి.