సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పట్ల భయాందోళన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ నుంచి ఎవరికి వారు స్వయంగా రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై తాను పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా సమీక్షించానని ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త చర్యలకు సంబంధించిన ఇమేజ్‌ను ప్రధాని ట్వీట్ చేశారు.
చదవండి : కరోనా నుంచి తప్పించుకోండిలా..
ఈ జాగ్రత్తలను పాటించడంతో పాటు తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, దగ్గు..తుమ్ములు వచ్చినప్పుడు నోటికి బట్టను అడ్డుపెట్టుకోవాలని సూచించారు. కాగా కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 90,000 మందికి సోకగా 3000 మందికి పైగా మరణించారు. ఈ వైరస్ పుట్టుకొచ్చిన చైనాలోనే అత్యధిక మరణాలు చోటుచేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment