![Police Lathicharge On Jamia Millia Islamia University Students At Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/11/Delhi.jpg.webp?itok=rp86tVkA)
సోమవారం ఢిల్లీలోని జామియా నగర్‌లో సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలో పాల్గొన్న ఓ మహిళను బ్యారికేడ్ నుంచి పక్కకు నెట్టేస్తున్న మహిళా పోలీసులు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులు చేప్టటిన నిరసనల్లో హింస చోటుచేసుకుంది. పార్లమెంటు వద్దకు ర్యాలీగా వెళుతూ నిరసనలు తెలిపేందుకు విద్యార్థులకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ.. విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు వారిని బారికేడ్లతో అడ్డుకున్నారు. మరిన్ని బలగాలను రప్పించి విద్యార్థులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులు తమపై లాఠీచార్జీ చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టు కింది భాగంలో లాఠీలతో కొట్టారని, కాళ్లకేసి కొట్టారని చెప్పారు. అంతేగాక బారికేడ్ల వద్ద ముందు వరుసలో ఉన్న వారి మర్మావయవాలపై పోలీసులు దాడి చేశారని, ఇందులో ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయని విద్యార్థులు ఆరోపించారు. కొంత మందిని గొంతుపట్టుకొని ఊపిరి ఆడకుండా చేశారని చెప్పారు. దీంతో పలువురు నిరసనల అనంతరం 20 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. అందులో ఎనిమిది మందికి వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపారని, ఈ 8 మందిలో 5 మంది అమ్మాయిలే ఉన్నారని విద్యార్థులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment