రాంచీ/జమ్మూ: జార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. జార్ఖండ్‌లోని 13 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు, జమ్మూకశ్మీర్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
జమ్మూకశ్మీర్ లోని 15 స్థానాలకు జరగనున్న మొదటి విడత పోలింగ్ లో ఏడుగురు మంత్రులతో సహా 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 123 మంది పోటీలో ఉన్నారు.