రజనీకాంత్‌తో పూనమ్ మహాజన్ భేటీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ ఆదివారం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బీజేపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చలో సెక్రటేరియ ట్ ఆందోళన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలి హోదాలో పాల్గొనేందుకు ఆదివారం ఆమె చెన్నైకి చేరుకున్నారు. అరగంటసేపు ఆమె రజనీతో భేటీ అయ్యారు. రజనీ రాజకీయ ప్రవేశంపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రజనీని బీజేపీలోకి ఆహ్వా నించే ప్రయత్నాల్లో భాగంగానే పూనమ్ ఆయనను కలుసుకున్నారని తెలుస్తోంది.