మధ్యప్రదేశ్ నుంచి నిర్మలా సీతారామన్?
భోపాల్: కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ లను మధ్య ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక చేసేందుకు ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసింది.
ఇప్పటి వరకు ఏ చట్ట సభల్లోనూ సభ్యుత్వం లేకుండానే ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర సమాచార శాఖా మంత్రిగా జవదేకర్, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ లు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
ఆరునెలల్లోపు రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉండటంతో మధ్యప్రదేశ్ లో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటు నుంచి ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసేలా ప్రయత్నాలు చేపట్టింది.
మాండ్లా లోకసభ స్థానం నుంచి ఫగన్ సింగ్ కులాస్టే విజయం సాధించడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఖాళీ ఎర్పడిన రాజ్యసభకు సోమవారం నుంచి నామినేషన్లను ఎన్నికల కమిషన్ స్వీకరిస్తోంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది జూన్ 9 తేది. జూన్ 19 తేదిన రాజ్యసభ సీటుకు ఎన్నికలు నిర్వహిస్తాను.