సాక్షి, కర్ణాటక: గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని తప్పుబడుతూ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బీజేపీ నాయకులు ఆయనపై విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా మళ్లీ ప్రకాష్‌రాజ్‌ను బీజేపీ కార్యకర్తలు టార్గెట్ చేశారు. ఇటీవల సిర్సిలోని రాఘవేంద్ర మఠంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ‘మన రాజ్యాంగం- మన హోదా’ పేరుతో వామపక్ష మేధావులు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డెపై ప్రకాష్‌రాజ్ విమర్శలు చేశారు.
తర్వాత ఆ సమావేశ ప్రాంగణాన్ని బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు గోమూత్రంతో శుద్ధి చేశారు. తమ పుణ్యక్షేత్రాన్ని కొంతమంది సోకాల్డ్ మేధావులు అపవిత్రం చేశారని, అందుకే గోమూత్రంతో శుద్ధి చేశామని బీజేపీ యువ మోర్చా నేత విశాల్ మరాటె అన్నారు. ఇటువంటి అసాంఘిక వామపక్ష మేధావులను సమాజం క్షమించదని వ్యాఖ్యానించారు.
బీజేపీ యువ మోర్చా కార్యకర్తల తీరుపై ప్రకాష్‌రాజ్ స్పందించారు. నేను ఎక్కడికెళ్లినా అలాగే గోమూత్రంతో శుద్ధి చేస్తారా..? అని ట్వీట్ చేశారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, అయితే పదేపదే సవాల్ చేస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమేనని ప్రకాష్‌రాజ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
BJP workers cleaning and purifying the stage ..from where I spoke in Sirsi town ...by sprinkling cow urine (divine gomoothra)...🤭🤭🤭...will you continue this cleaning and purification service where ever I go..... #justasking pic.twitter.com/zG1hKF8P4r
— Prakash Raj (@prakashraaj) January 16, 2018
Comments
Please login to add a commentAdd a comment