నీలం సంజీవరెడ్డికి ప్రణబ్ ఘన నివాళి
నీలం సంజీవరెడ్డికి ప్రణబ్ ఘన నివాళి
Published Mon, May 19 2014 4:07 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘన నివాళులర్పించారు. నీలం సంజీవరెడ్డి 101 జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.
రాష్ట్రపతి భవన్ లోని నీలం చిత్రపటం వద్ద ప్రణబ్ ముఖర్జీ పుష్పగుచ్చాలను ఉంచి నివాళులర్పించారు. జాతికి నీలం సంజీవరెడ్డి చేసిన సేవలను ప్రణబ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలోని ఇల్లూరు గ్రామంలో 1913 సంవత్సరం మే 13 తేదిన నీలం సంజీవరెడ్డి జన్మించారు. 1977 సంవత్సరం జూలై 25 నుంచి 1982 జూలై 25 వరకు రాష్ట్రపతిగా సేవలందించారు. 1996 జూన్ 1 తేదిన నీలం సంజీవరెడ్డి మరణించారు.
Advertisement
Advertisement