Neelam Sanjiva Reddy
-
Indira Gandhi: ముందస్తు ఎమర్జెన్సీ పరాజయం
సొంత పార్టీయే బయటకు పొమ్మంది. అయినా, ఆమె తగ్గలేదు. ఉక్కు సంకల్పంతో పోరాడారు. ప్రజాక్షేత్రంలోనే బలం నిరూపించుకున్నారు. తిరుగులేని ఎత్తులతో ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని తస్మదీయులనూ చిత్తు చేశారు. లోక్‌సభను ఏడాది ముందే రద్దు చేసి ప్రజాతీర్పు కోరిన ఇందిరాగాంధీ అనుకున్నది సాధించారు. ఘర్షణకు దిగిన పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పడమే గాక పోఖ్రాన్ అణు పరీక్షతో మన శక్తిని ప్రపంచానికి చాటారు. కానీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత చీకటి కోణంగా చెప్పదగ్గ ఎమర్జెన్సీ విధింపు నిర్ణయంతో చెరగని మచ్చ మిగుల్చుకున్నారు. ఇలాంటి ఎన్నో విశేషాలకు 1971–77 ఐదో లోక్‌సభ కాలం సాక్షిగా నిలిచింది... సాక్షి, నేషనల్ డెస్క్: నాలుగో లోక్‌సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్‌గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిండికేట్ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. విప్ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్‌సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. నాలుగో లోక్‌సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్‌గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిండికేట్ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దించారు. విప్ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్‌సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. విపక్షాలు గుంపుగా వచ్చిన... ఇందిరను ఏకాకిని చేసేందుకు భారతీయ జనసంఘ్, స్వతంత్ర, సోషలిస్టు పార్టీలతో కాంగ్రెస్ (ఓ) చేతులు కలిపినా లాభం లేకపోయింది. 238 స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ (ఓ) గెలిచింది 16 మాత్రమే. బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణం రద్దు వంటి నిర్ణయాల ప్రాతిపదికన ప్రజామోదం కోరి ఇందిర ఘనవిజయం సాధించారు. అభ్యర్థులను కాకుండా తనను చూసి ఓటేయాలన్న ఆమె పిలుపు బాగా క్లిక్కయింది. అలాగే ‘గరీబీ హటావో, దేశ్ బచావో’ నినాదమూ సూపర్‌హిట్టయింది. ఇందిరా కాంగ్రెస్43.68 శాతం ఓట్లతో ఏకంగా 352 సీట్లు సొంతం చేసుకుంది. ప్రాంతీయ పారీ్టల ఎదుగుదలను మాత్రం ఇందిర అడ్డుకోలేకపోయారు. సీపీఎం 25, సీపీఎం 23, భారతీయ జనసంఘ్ 22 సీట్లు నెగ్గగా స్వతంత్ర పార్టీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. డీఎంకే 23 లోక్‌సభ స్థానాలతో బలమైన ప్రాంతీయ పారీ్టగా నిలదొక్కుకుంది. విశేషాలు... ► ఐదో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 1971 మార్చి 1 నుంచి 10 మధ్య కేవలం పది రోజుల్లోనే పూర్తయింది. ► 1952 నుంచి లోక్‌సభ, దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు జమిలిగా కొనసాగుతూ వస్తున్న ఎన్నికలకు ఇందిర ముందస్తు నిర్ణయంతో తొలిసారి తెర పడింది. ► దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. హరిత విప్లవ ఫలాలు అందివచ్చాయి. ► 1971లో పాక్ మనపై యుద్ధానికి తెగబడింది. తూర్పు పాకిస్తాన్ ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతుగా భారత బలగాలు బరిలో దిగి 13 రోజుల్లోనే పాక్ పీచమణిచాయి. పాక్ ► ఆర్మీ చీఫ్ జనరల్ నియాజీ ఏకంగా 93,000 మంది సైనికులతో లొంగిపోయారు. ► డిసెంబర్ 16న బంగ్లాదేశ్ అవతరించింది. ► 1974 మే 18న రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో తొలి అణ్వస్త్ర పరీక్షలు విజయవంతంగా జరిగాయి. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా తర్వాత అణు సామర్థ్యమున్న దేశంగా భారత్ అవతరించింది. చెరగని మరక... ఎమర్జెన్సీ 1975 జూన్ 25. ఎమర్జెన్సీ విధిస్తూ ఇందిర నిర్ణయం తీసుకున్న రోజు. భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే దుర్దినంగా మిగిలిపోయింది. ప్రజల సాధారణ హక్కులనూ కర్కశంగా కాలరాసిన ఈ కఠిన నిర్ణయానికి ఇందిర మొగ్గు చూపడానికి పలు కారణాలు చెబుతుంటారు. వాటిలో ముఖ్యమైంది మాత్రం 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా ఆమె గెలుపు చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచి్చన తీర్పే! అధికార యంత్రాంగాన్ని ఇందిర దుర్వినియోగం చేశారని, అనుమతించిన పరిమితికి మించి ఖర్చు చేశారని ఆమె చేతిలో ఓడిన రాజ్ నారాయణ్ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ 1975 జూన్ 12న కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమె ఎన్నికను రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా ప్రకటించారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ పదవినీ చేపట్టకుండా నిషేధం విధించారు. ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లగా కొన్ని షరతులతో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ జూన్ 24న తీర్పు వెలువరించింది. మర్నాడే లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో లక్ష మందితో కూడిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీని ఉద్దేశించి ఉర్రూతలూగించే ప్రసంగం చేశారు. దాంతో అదే రోజు ఇందిర ఎమర్జెన్సీ విధించారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా వెనక్కు తగ్గలేదు. 1977 మార్చి 21 దాకా ఎమర్జెన్సీ అరాచకాలు కనీవినీ ఎరగని రీతిలో కొనసాగాయి. ఫలితంగా 1977 ఎన్నికల్లో ఇందిర ఘోర ఓటమి చవిచూడటంతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారు గద్దెనెక్కింది. -
చరిత్రలో ప్రత్యేకం.. అప్పట్లో సర్వేపల్లి, నీలం సంజీవరెడ్డి.. మళ్లీ ద్రౌపది ముర్ము
సాక్షి, భద్రాచలం: భద్రాచలానికి వీఐపీల రాక ప్రత్యేకం కానప్పటికీ.. అత్యున్నతస్థాయి హోదా గల రాష్ట్రపతి రావడం భద్రాచల చరిత్రలో ఎంతో ప్రత్యేకం. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు హాజరవడం పరిపాటే. కానీ జాతీయ స్థాయిలో అధికార హోదాలో భద్రాచలంలో పర్యటించటం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత ఆ స్థానం ద్రౌపది ముర్ముకే దక్కింది. భద్రాచలం – సారపాక మధ్య గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవానికి 1965 జూలై 13న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చారు. ఇప్పుడు ప్రసాద్ పథకంలో భాగంగా రూ.41 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ద్రౌపదిముర్ము వస్తున్నారు. అయితే నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా భద్రాచలం వచ్చినప్పటికీ.. ఆయన కేవలం స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్లారు. చదవండి: భద్రాచలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో నాటి అర్చకులు, తదితరులు (ఫైల్) -
మహోజ్వల భారతి: వ్యక్తులు, ఘటనలు, సందర్భాలు, స్థలాలు, సమయాలు
సంస్కృతి–సంప్రదాయం టాగోర్ సోదరుడు సత్యేంద్రనాథ్ బ్రిటిష్ ఇండియాలో తొలి ఐఏఎస్. ఉద్యోగరీత్యా ఆయన బ్రిటన్ వెళుతున్నప్పుడు ఆయన భార్య జ్ఞానదానందినీ దేవి భర్త వెంట ఆరు గజాల చీరకట్టు లోనే వెళ్లారు. బ్రిటన్‌లో అంతా ఆమెను చిత్రంగా చూశారు! చీరకట్టు మన భారతీయ మహిళలకు కొత్త కాకపోయినా, ఆరు గజాల చీరకట్టును ‘ఇన్వెంట్’ చేసింది మాత్రం జ్యానదానందినీ దేవేనని అంటారు. సత్యేంద్రనాథ్ 1842 జూన్ 1న జన్మించారు. జ్ఞానదానందినీదేవి, రవీంద్రనాథ్ టాగోర్ వదిన. స్ఫూర్తి గాంధీజీ భారత 6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు, కొన్ని త్యాగాలూ ఆయన జీవితంలో ఉన్నాయి. 1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్య్ర పోరాటం వైపు దృష్టి సారించారు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్లారు నేడు నీలం వర్ధంతి. 1913 మే 19న ఇల్లూరులో జన్మించిన సంజీవరెడ్డి 1996 జూన్ 1న బెంగళూరులో కన్ను మూశారు. నెహ్రూను కదిలించిన ‘మదర్ ఇండియా’ ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన పదేళ్లకు 1957లో ‘మదర్ ఇండియా’ చిత్రం విడుదలైంది. మహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ చిత్రంలో నర్గిస్ దత్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్ నటించారు. ఈ సినిమా 1958 లో ఆస్కార్ అవార్డుకు ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో నామినేట్ అయింది. మహబూబ్ ఖాన్ స్వాతంత్య్రానికి పూర్వం 1940లో ఔరత్ (స్త్రీ) అనే చిత్రం నిర్మించారు. దాని ఆధారంగానే ‘మదర్ ఇండియా’ నిర్మించారు. భారతదేశపు గ్రామ పరిసరాలను ప్రతిబింబించే ఈ చిత్రంలో భారతీయ సగటు స్త్రీ తన కుటుంబంకోసం, తన పిల్లలకోసం పడే పాట్లను హృద్యంగా చిత్రీకరించారు. మదర్ ఇండియా ప్రధాన కథానాయికగా నర్గిస్ మహామహుల ప్రశంసలు అందుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్, ఇందిరా గాంధీ ఈ చిత్రం ప్రివ్యూ సందర్భంగా నర్గిస్ నటనను కొనియాడారు. నెహ్రూ అయితే ఎమోషనల్ అయ్యారని చిత్ర బృందం అప్పటి మీడియాకు వెల్లడించింది. నర్గిస్ తన కెరీర్ ను పసితనంలోనే ప్రారంభించారు. బాలనటిగా 1935 లో ‘తలాషె హక్’ చిత్రంలో తన ఆరవయేట నటించారు. ఆ చిత్రంలో ఈమె పేరు బేబీ నర్గిస్. ఇదే పేరు తరువాత స్థిరపడిపోయింది. ఆ తరువాత నర్గిస్ ఎన్నో సినిమాలలో నటించారు. తన 14వ యేట మెహబూబ్ ఖాన్ సినిమా తక్దీర్ (1943) లో ఆమె కనిపించారు. బర్సాత్ (1949), అందాజ్ (1949), ఆవారా(1951), దీదార్(1951), శ్రీ420(1955), చోరీ చోరీ (1956) చిత్రాలు నర్గిస్‌కు మంచి పేరు తెచ్చాయి. నేడు నర్గిస్ జయంతి. 1929 జూన్ 1న కలకత్తాలో జన్మించారు. -
ఒక్కసారే చాన్స్!
పార్లమెంటులో ప్రతిష్టాత్మకమైన పదవి స్పీకర్ పదవి. పార్లమెంటు మొత్తానికీ స్పీకర్ అత్యున్నతాధికారి. అధికారంలో ఉన్న పార్టీ అభీష్టానికి అనుగుణంగా సీనియర్ లోక్‌సభ సభ్యులను స్పీకర్ పదవికి ఎంపిక చేస్తారు. గత పదహారు లోక్‌సభల్లో ఒక్కరు మినహా మిగిలినవారెవ్వరినీ రెండోసారి స్పీకర్ పదవి వరించిన పరిస్థితి మన దేశంలో లేదు. గత రెండు దశాబ్దాల్లో అయితే స్పీకర్ గా ఉన్న ఏ ఒక్కరూ లోక్‌సభకు తిరిగి ఎన్నికవలేదు. గత 16 లోక్‌సభల్లో ఒకసారి స్పీకర్‌గా పనిచేసిన వారిలో కేవలం 10 మంది మాత్రమే తిరిగి లోక్‌సభకి ఎన్నికయ్యారు. మొత్తం 16 లోక్‌సభల్లో నీలం సంజీవరెడ్డిని మాత్రమే రెండు సార్లు స్పీకర్ పదవి వరించింది. ఒకసారి స్పీకర్‌గా పనిచేసినవారిలో తిరిగిపోటీ చేసిన కొందరు ఎన్నికల్లో ఓడిపోవడం, కొందరు అసలు పోటీయే చేయకపోవడం, మరికొందరికి పార్టీ తిరిగి సీటు ఇవ్వకపోవడం దీనికి కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2014లో పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా స్పీకర్ పదవికి ఎంపికైన ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్ కి సీటు కేటాయించలేదు. ఇండోర్ నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో తాను అసలు పోటీయే చేయనని సుమిత్రా మహాజన్ తాజాగా ప్రకటించారు. 67 ఏళ్ళ లోక్‌సభ చరిత్రలో సుమిత్రా మహాజన్ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ద్వితీయ మహిళ. సుమిత్రా మహాజన్‌కన్నా ముందున్న స్పీకర్ మీరా కుమార్ తొలి మహిళా స్పీకరే కాకుండా తొలి దళిత మహిళా స్పీకర్‌గా కూడా రికార్డుకెక్కారు. మీరా కుమార్ కన్నా ముందు తొలి కమ్యూనిస్టు దిగ్గజం అయిన సోమనాథ్ ఛటర్జీ సీపీఎం నుంచి లోక్‌సభ స్పీకర్ పదవిని అలంకరించారు. అయితే ఛటర్జీ కష్టాలు కూడా అదే లోక్‌సభలో ప్రారంభం అయ్యాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా వామపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని నిర్ణయించినప్పుడు స్పీకర్‌గా రాజీనామా చేసి, లోక్‌సభ సభ్యుడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించింది. అయితే సోమనాథ్ ఛటర్జీ మార్క్సిస్టు పార్టీ నిర్ణయాన్ని తోసిపుచ్చి స్పీకర్ పదవి హుందాతనాన్ని కాపాడారు. అంతేకాకుండా తాను ఆపై ఎన్నికల్లో పోటీ చేయనని కూడా స్పష్టం చేశారు. పార్టీ బహిష్కరణ తరువాత కమ్యూనిస్టు దిగ్గజం ఛటర్జీ రాజకీయ ప్రస్థానాన్ని అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. శివసేన వ్యవస్థాపకుల్లో ఒకరు, శివసేన అధినాయకుడు బాల్ థాకరే అతి సన్నిహితుడూ అయిన మనోహర్ జోషీ సోమనాథ్ ఛటర్జీకన్నా ముందు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. స్పీకర్ పదవిని చేపట్టడానికన్నా ముందు మనోహర్ జోషీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మనోహర్‌జోషీ గెలిచారు. అయితే జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో మనోహర్ జోషీని స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోషీ అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తే కాకుండా శివసేన సీనియర్ నాయకుడు కూడా కావడంతో ఆయనను స్పీకర్ పదవి వరించింది. ఆ తరువాత 2004 ఎన్నికల్లో జోషీ ఓడిపోవడంతో ఆయన తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టలేదు. భారత చట్టసభల తొలి స్పీకర్ జీఎస్. మాల్వంకర్ 1952లో ఎన్నికయ్యారు. 1956లో ఆయన మరణించారు. ఇక ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 ఎన్నికల తరువాత తొలి లోక్‌సభకు కేఎస్.హెగ్డే స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈయన కూడా తిరిగి రెండోసారి లోక్‌సభకు ఎన్నిక కాలేదు. -
నిజాయితీకి నిదర్శనం నీలం..
శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యులుగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా, లోక్‌సభ స్పీకర్‌గా అన్నిటికీ మించి దేశ ప్రథమ పౌరునిగా అనితరసాధ్యమైన రాజకీయ పయనం, మహోన్నత వ్యక్తి ఓ సామాన్య కుటుంబం నుండి వచ్చారంటే ఆశ్చర్యమ నిపిస్తుంది. రాజకీయాల్లో మేరునగ ధీరుడిగా పేరొందిన నీలం సంజీవరెడ్డి జీవితం ‘అనంత’ చరిత్రతో కలగలసిపోయింది. నిశితంగా పరిశీలిస్తే ఆయన వల్లే ‘అనంత’ కీర్తి దేశవ్యా ప్తమైంది. ఆ తరానికి చెందిన రాజకీయ నాయకులు కావడంతో విలువలకు ప్రాధాన్యతనిచ్చి పదవులను తృణప్రాయంగా వదిలేసి, ఆదర్శప్రాయుడు, నిజాయితీకి నిదర్శనంగా నిలిచారు. స్వాతంత్రోద్యమం నుంచి తనువు చాలించేదాకా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిల్చిన నీలం సంజీవరెడ్డి జీవిత విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి. – గుంటి మురళీకృష్ణ సాక్షి అనంతపురం కల్చరల్ :కరువుకు పర్యాయపదంగా మారిన అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామం ఇల్లూరులో నీలం సంజీవరెడ్డి 1913 మే 19న జన్మించారు. 1931లో జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. 1946లో మద్రాసు అసెంబ్లీ సభ్యుడుయ్యారు. 1947లోభారత రాజ్యాంగ సభ్యులుగా ఎన్నికయ్యారు. చాలామంది రాజ్యాంగ రచన అంటే అంబేడ్కర్ ఒకరే అనుకుంటారు. రాజ్యాంగ నిర్మాణంలో నీలం సంజీవరెడ్డి కూడా కీలక పాత్ర వహించారు. మద్రాసురాష్ట్ర ప్రభుత్వంలో 1949 నుండి 1952 వరకూ మద్యపాన నిషేధశాఖామంత్రిగా పనిచేశారు. 1952లో రాజ్యసభ సభ్యులయ్యారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకాశం మంత్రి వర్గంలో, 1955లో బెజవాడ గోపాలరెడ్డి మంత్రి వర్గంలోనూ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1959లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులయ్యారు. 1962లో తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. అందుకే బస్సుల జాతీయికరణ అంశం న్యాయస్థానం పరిశీలనకు తలొగ్గి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లాల్‌బహుదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ఉక్కుగనుల శాఖామంత్రిగా, ఇందిరాగాంధి మంత్రి వర్గంలో రవాణా, విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. హిందూపురం నుండి లోక్‌సభ సభ్యుడై 1967–69 మధ్య స్పీకర్‌గా పనిచేశారు. 1977లో నంద్యాల నుండి లోకసభకు ఎన్నికై , మార్చి నుండి జూలై వరకు మరోసారి లోకసభ స్పీకర్‌గా ఉన్నారు. అదే ఏడాది జూలై 25 నుండి 1982 జూన్ 24వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. పదవీవిరమణ అనంతరం చాలా కాలం జిల్లా కేంద్రంలోని నాగవిహార్‌లో ఉన్నారు. కొంతకాలం బెంగళూరులో నివశించారు. ఎటువంటి వివాదాంశాలకు తావివ్వని విధానాలతో జీవితాన్ని సాకారం చేసుకున్న ఆయన చివరకు 1996 జూన్ 1 న మరణించారు. ఆయన బ్రతికి ఉన్న రోజుల్లోనే శ్రీకంఠం సర్కిల్లో ఆయనకు శిలావిగ్రహం ఏర్పాటు చేశారు. -
ఎస్వీయూ యశస్సు
• దూసుకెళుతున్న ఎస్వీ యూనివర్సిటీ • తాజా ర్యాంకింగులతో మరో కీర్తి కిరీటం • ఇప్పటికే పలు పురస్కారాలు సొంతం • పరిశోధనల్లోనూ ఉన్నత సోపానాలు శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదిస్తోంది. అంచెలంచెలుగా ఎదుగుతూ రాయలసీమకు గర్వకారణంగా నిలుస్తోంది. వెనుకబడిన ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో 1954 సెప్టెంబర్ 2న ఏర్పాటైన ఎస్వీయూ అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. తాజాగా జాతీయ,అంతర్జాతీయ సంస్థల ర్యాంకింగ్ల్లో మెరుగైన స్థానాలు పొంది రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కృషి ఫలితంగా ఏర్పాటైన ఈ వర్సిటీ 63 వసంతాలు పూర్తి చేసుకుంది. యూనివర్సిటీక్యాంపస్: తిరుపతిలోని ఎస్వీయూనివర్సిటీ జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకట్టుకుంది. తెలుగు వర్సిటీలో అగ్రగామిగా నిలిచి సమున్నత స్థానాన్ని సాధించింది. 1954లో 1000 ఎకరాల స్థలంలో ఈ వర్సిటీ ఏర్పాటైంది. టీటీడీ 1000 ఎకరాల స్థలంతో పాటు రెండు భవనాలను కూడా యూనివర్సిటీ ఏర్పాటుకు అందించింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జువాలజీ, ఫిజిక్స్, ఫిలాసపీ విభాగాలతో ఏర్పడి ఇప్పుడు క్యాంపస్‌లో 54 విభాగాల్లో 72 కోర్సులను అందిస్తోంది. 300 మంది అధ్యాపకులు, 1500 మంది నాన్‌టీచింగ్ సిబ్బంది, 5 వేల మంది విద్యార్థులు కొనసాగుతున్నారు. బోధన, పరిశోధన విస్తరణ రంగాలతో పాటు ఇతర రంగాల్లో కూడా దూసు కెళుతోంది. మూడు సదస్సుల నిర్వహణ ఎస్వీయూ ఇటీవల మూడు ప్రతిష్టాత్మక సదస్సులను నిర్వహించింది. డిసెంబర్27 నుంచి 29 వరకు అఖిలభారత ఎకనామిక్స్ కాన్పరెన్స్‌ను నిర్వహించింది. జనవరి 3 నుంచి 7వతేదీ వరకు 104వ సైన్స్ కాంగ్రెస్‌ను, ఫిబ్రవరి 3నుంచి 5వతేదీ వరకు 91వ అఖిల భారత వీసీల సదస్సును నిర్వహించింది. ఈ మూడు సదస్సులకు దేశ,విదేశాల్లోని పలువురు నిపుణులు హాజరయ్యారు. ఇండియన్‌సైన్స్ కాంగ్రెస్‌కు నోబుల్ అవార్డు గ్రహీతలు సైతం హాజరయ్యారు. ఈ సదస్సు నిర్వహణతో ఎస్వీయూ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు 2015 డిసెంబర్లో కేంద్ర మానవవనరుల శాఖ ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్‌లో ఎస్వీయూకు జాతీయ స్థాయిలో 63వ ర్యాంకు లభించింది. పరిశోధన రంగంలో 13వ స్థానంలో నిలిచింది. గత ఏడాది సెప్టెంబర్ 22న టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లో ఎస్వీయూకు 601–800ల ర్యాంకు లభించింది. ఆసంస్థ బోధన, పరిశోధన, అంతర్జాతీయ ప్రమాణాలు, పారిశ్రామిక రంగాలు తదితర అంశాల ఆధారంగా సర్వే నిర్వహించి ర్యాంకు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో దక్షిణ భారతదేశంలో ఎస్వీయూ మొదటిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చి 16న టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రకటించిన ఏషియన్ యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో ఎస్వీయూకు ఆసియా ఖండం నుంచి 191–200ల మధ్య ర్యాంకు సాధించింది. దక్షిణ భారతదేశంలో మొదటిస్థానంలో నిలిచింది. తాజాగా సోమవారం కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించిన ఎన్ఐఆర్ ర్యాంకింగ్‌లో ఎస్వీయూ ఓవరాల్ ర్యాంకింగ్‌లో 68వ ర్యాంకు, యూనివర్సిటీ స్థాయిలో 42వ స్థానంలో నిలిచింది. పరిశోధన పరంగా జాతీయ స్థాయిలో 33వ స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలవడం విశేషం. అందరి కృషి తోనే క్యాంపస్‌లోని అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, బోధనేతర సిబ్బంది కషివల్లే ఎస్వీయూకు మంచి ర్యాంకు లభించింది. ఈర్యాంకు రావడానికి అధికారులు ఎంతో శ్రమించారు. -
‘హవ్’ హమ్ హైద్రాబాదీ!
హైద్రాబాదీ షాయరీలు (కవితా గోష్టులు) ఆహ్లాదకరమైనవి. దక్కనీ భాషలో షాయరీ పాడుతోంటే ప్రేక్షకులు తెరలు తెరలుగా కడుపుబ్బ నవ్వేవారు! ఈ వాతావరణంలో పిల్లలు హైద్రాబాద్‌లోనే పుట్టిపెరుగుతున్నారు. అప్పుడప్పుడూ సకుటుంబంగా ఉత్తరాది బంధువుల దగ్గరకు వెళ్లేవారం. దేశ విభజనలో భాగంగా పంజాబ్ రెండు భాగాలైనప్పటికీ పంజాబ్ నా స్వరాష్ట్రం కదా! పంజాబ్‌లో, ఢిల్లీలో నివసించే బంధువులతో పిల్లలు మాట్లాడేప్పుడు వారి నోటి వెంట హైద్రాబాదీ పదాలు అసంకల్పితంగా వచ్చేవి. ‘ఇది తీసుకో’ అని ఉత్తరాది వాళ్లు అన్నారనుకోండి, ‘వద్దు’ అనదలచుకున్న మా పిల్లలు ‘నక్కో’ అనేవారు! తోటి పిల్లలు ఫక్కున నవ్వేవారు! వారి దృష్టిలో అది మోటు పదం! వద్దు అనాలంటే ‘న’ లేదా ‘నహీ’ అనాలి! ఏకీచ్ అంటే మోటు.. ఏక్హీ అనాలి! మీరు మోటుగా మాట్లాడతారు, సంస్కారం లేదు అని పిల్లలను వెక్కిరించేవారు! నా దృష్టిలో హైద్రాబాదీలతో పోలిస్తే ఉత్తరాదివారికి సగం కూడా కల్చర్ లేదు! లేదంటే వింటారా! ‘నై బోలేతో సున్తే క్యా’! ‘నై బోలేతో సున్తే నై’ ! ‘వద్దంటే వినదు/వినరు’ అనే అర్థం వచ్చే పై మకుటంతో దక్కనీ షాయరీ సిటీలో ప్రాచుర్యంలో ఉండేది. అందులోని అనేక చరణాల్లో కొన్ని... కర్నే కొ జో కామా హైసొ / చేయాల్సిన పనులన్నీ జైసేకే వైసే హీచ్ హై / ఎక్కడివక్కడే ఉన్నాయి నై కర్నేకె కామా కర్రై/ చేయకూడని పనులు చేస్తున్నావు నై బోలేతో సున్తేనై / వద్దంటే వినడం లేదు ఉమర్కె పీఛే మత్ భాగో / వయసు వెనుక పరుగెత్తొద్దు గయేసీ జవానీ ఆతీనై / పోయిన వయసు రాదు మేకప్ గీకప్ నక్కో/మేకప్ గీకప్ వద్దు నైబోలేతో సున్తేనై /వద్దంటే వినడం లేదు అచ్ఛే అచ్ఛే డ్రామే దేఖో / మంచి మంచి నాటకాలు చూడు కిత్తా కిత్తా సమ్ఝాయా/ ఎంతెంతగా నచ్చచెప్పా గంధే ఫిల్మే మత్ దేఖో/ పాడు సినిమాలు చూడొద్దని నై బోలేతో సున్తేనై / వద్దంటే వినడం లేదు సంజీవరెడ్డి మామా ! సమైక్యరాష్ట్రం ఏర్పడిన కొత్తలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు! హైకోర్టు అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యకు స్పందనగా పదవికి రాజీనామా చేయసారు, ప్రధాని నెహ్రూకు చెప్పకుండా! అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉండగా విమర్శించడం అంత తేలిక కాదు కదా! సర్వార్ దండా అనే మషూర్ కవి ‘సంజీవరెడ్డి మామా’ అనే షాయరీ రాసారు. విన్నవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వే అనేక చరణాల్లో ఒక చరణం.. పోలీస్ కి డైరీ మె/ పోలీసుల డైరీలో దండె కి షాయిరీ మె/దండె కవిత్వంలో న ఫుల్ స్టాఫ్ న కామా/ఫుల్స్టాప్ ఉండదు కామా ఉండదు సంజీవ్ రెడ్డి మామా/సంజీవరెడ్డి మామా ఓల్డ్ సిటీలో నేటికీ పాడుకునే ఒక ‘నక్కొ’ నుడికారం పూపీ సాస్ నక్కొ/మేనత్త అత్తగా వద్దు భతీజీ బాబు నక్కొ/సోదరుడి కూతురు కోడలుగా వద్దు బందీ సౌకాన్ నక్కొ/పని మనిషి సవతిగా వద్దు ఘర్ మె సాలా నక్కొ/బావమరిది ఇంట్లో వద్దు కతిల్ పితల్ కా సాజ్ నక్కొ/ఇత్తడి ఆభరణాలు వద్దు బూఢే మరద్ కి రాజ్ నక్కొ/ముసలి వాడితో సంసారం వద్దు ఆహ్లాదకరమైన దక్కనీ సారస్వత వాతావరణంలో పెరిగిన పిల్లలు ఉత్తరాది వారి దృష్టిలో మోటు మనుషులు! ఉత్తరాది వారు హిందీ లేదా ఉర్దూలో మాట్లాడతారు. ఒక ఉత్తరాది వ్యక్తికి హైద్రాబాదీకి జరిగిన సంభాషణను ఆరోజుల్లో హైద్రాబాదీలు హాస్యంగా చెప్పుకునేవారు! ఒక ఉత్తరాది వ్యక్తి హైద్రాబాదీ పిల్లవాడిని అడుగుతున్నాడు ‘ ఈ రోడ్డు హైద్రాబాద్‌కు పోతుందా?’ పిల్లవాడు ‘హవ్ (అవును)’ అన్నాడు. ‘హవ్’ అని నీచంగా మాట్లాడావు నువ్వు అన్నాడు పెద్దాయన. మరేమనాలి సార్ అన్నాడు పిల్లవాడు. ‘జీ హా’ అనాలి అన్నాడు. అంటే ‘హవ్’ నీచమైన పదం అన్నమాట అన్నాడు పిల్లవాడు. పెద్దాయన ‘హవ్’ అన్నాడు! ఇంతటి హాస్యం ఉన్న దక్కనీ.. ఉర్దూ కంటే లేక హిందీ కంటే తక్కువ ఎలా అవుతుంది? అసలు దక్కనీ భాషే ఈ రెండు భాషలకూ మాతృక. ఆ చారిత్రక వైనం మరోసారి.. -
నీలం సంజీవరెడ్డికి ప్రణబ్ ఘన నివాళి
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘన నివాళులర్పించారు. నీలం సంజీవరెడ్డి 101 జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ లోని నీలం చిత్రపటం వద్ద ప్రణబ్ ముఖర్జీ పుష్పగుచ్చాలను ఉంచి నివాళులర్పించారు. జాతికి నీలం సంజీవరెడ్డి చేసిన సేవలను ప్రణబ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలోని ఇల్లూరు గ్రామంలో 1913 సంవత్సరం మే 13 తేదిన నీలం సంజీవరెడ్డి జన్మించారు. 1977 సంవత్సరం జూలై 25 నుంచి 1982 జూలై 25 వరకు రాష్ట్రపతిగా సేవలందించారు. 1996 జూన్ 1 తేదిన నీలం సంజీవరెడ్డి మరణించారు. -
మధ్యంతర ఎన్నికల్లో ఇందిర ప్రభంజనం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో చీలిక తరువాత 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరా గాంధీ దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ఆవిర్భవించారు. ఇందిరా గాంధీ హవా ఢిల్లీలోని ఏడు సీట్లపై పడింది. ఏడింటికి ఏడు స్థానాలను ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ గెలుచుకుంది. 1967 లోక్‌సభ ఎన్నికల నాటికి ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్‌ల మధ్య నాయకత్వం కోసం కొనసాగిన పోరు ఆ తరువాత జరిగిన రాష్ట్రపతి ఎన్నికల నాటికి పతాకస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ ఇందిరా గాంధీ మాత్రం అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న వీవీ గిరి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆత్మప్రబోధంతో ఓటు వేయాలని ఎంపీలను కోరారు. ఈ ఎన్నికల్లో వీవీ గిరి గెలిచారు. దీంతో కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ రెండుగా చీలిపోయింది. సీనియర్ కాంగ్రెస్ నేతలు పలువురు మొరార్జీ దేశాయ్ వెంట పాత కాంగ్రెస్‌లో ఉండిపోయారు. ఇందిరా గాంధీ నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ఏర్పాటైంది. గరీబీ హటావో నినాదంతో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికల శంఖారావం పూరించారు. ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 441 స్థానాల్లో పోటీచేయగా 342 సీట్లు గెలిచింది. పాత కాంగ్రెస్ 238 స్థానాలలో పోటీచేసి 16 సీట్లు మాత్రమే గెలుచుకుంది. రెండు కాంగ్రెస్‌ల మధ్య జరిగిన పోటీలో జన్‌సంఘ్ కూడా దెబ్బతింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలకు 64 మంది అభ్యర్థులు తలపడ్డారు. ఇందిరా గాంధీ నిలబెట్టిన అభ్యర్థులు ఆమె పేరు బలంపైనే గెలిచారు. ఢిల్లీలోని ఏడు స్థానాలలో సికిందర్ భఖ్త్, రాజేష్ శర్మ, శాంతిదేశాయ్, పి.కె. చందాలా వంటి నేతలు పాత కాంగ్రెస్‌లో ఉండిపోయారు. బ్రహ్మ ప్రకాశ్ రాజకీ యాలకు దూరంగా ఉండిపోయారు. కొత్త కాంగ్రెస్ నిలబెట్టిన కొత్త నేతలు అన్ని స్థానాలలో గెలిచి తొలిసారి ఎంపీలయ్యారు. ఈ ఎన్నికలలో ఢిల్లీ నుంచి ఇద్దరు మహిళలు పార్లమెంటు సభ్యులయ్యారు. సుభద్రా జోషీ చాందినీ చౌక్ నుంచి, ముకుల్ బెనర్జీ న్యూఢిల్లీ నుంచి గెలిచారు. అంతకు ముందు ఇతర చోట్ల నుంచి లోక్‌సభ ఎన్నికలలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సుభద్రా జోషీకి చాందినీ చౌక్ టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు వ్యతిరేకించినప్పటికీ ఆమె సికిందర్ భఖ్త్ వంటి సీనియర్ నేతను ఓడించి ఇందిరా ప్రభంజనాన్ని చాటిచెప్పారు. సౌత్ ఢిల్లీలో న్యాయవాది శశిభూషణ్ జన్‌సంఘ్ నేత బల్రాజ్ మధోక్ని ఓడించారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి హెచ్‌కేఎల్ భగత్ తొలిసారి ఎంపీగా గెలిచి తరువాతి రోజుల్లో ఢిల్లీలో బలమైన కాంగ్రెస్ నేతగా ఎదిగారు. సదర్ నుంచి అమర్నాథ్ చావ్లా, ఔటర్ ఢిల్లీ నుంచి దీలీప్ సింగ్, కరోల్ బాగ్ నుంచి టి. సోహన్‌లాల్ గెలిచారు.