ఐదు డిమాండ్లు పాటిస్తే.. సెల్యూట్ చేస్తాం
ఐదు డిమాండ్లు పాటిస్తే.. సెల్యూట్ చేస్తాం
Published Fri, Apr 15 2016 3:23 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఆయన ముందు ఐదు డిమాండ్లను ఉంచారు. ''ప్రధానమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వీటిని పాటిస్తే దేశం ఆయనకి సెల్యూట్ చేస్తుంది'' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
1. ట్విటర్ లో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వారిని ఫాలో అవకండి.
2. రోహిత్ వేముల మృతికి కారణమైన కేంద్రమంత్రులను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. (కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.)
3. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయకూడదు. ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వాలను ఏర్పాటు చేయండి. దొడ్డి
దారిన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం మానాలి.
4. ఢిల్లీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని అంగీకరించండి.
5. భారత్ మాతాకీ జై అనని వారిపై దాడులు చేయడం మానండి. దాడులు చేసినవారిని జైలులో పెట్టండి. ప్రజల ఆహారపు విషయాలలో జోక్యం చేసుకోకండి.
Advertisement