నక్సల్స్ కోటలో నేడు ప్రధాని పర్యటన | Prime Minister's visit to naxasls castle | Sakshi
Sakshi News home page

నక్సల్స్ కోటలో నేడు ప్రధాని పర్యటన

Published Sat, May 9 2015 2:05 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

Prime Minister's visit to naxasls castle

రాయ్‌పూర్: నక్సల్స్ కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించనున్నారు. దంతెవాడలోని దిల్మిలి గ్రామంలో అల్ట్రా మెగా ఉక్కు కర్మాగారానికి, రావ్‌ఘాట్-జగదల్‌పూర్ రైల్వేలైన్ రెండో దశకు శంకుస్థాపన చేయనున్నారు.  పేద పిల్లలకు విద్యావకాశాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ సిటీని సందర్శిస్తారు. పర్యటన కోసం గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

పర్యటనను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు.నయా రాయ్‌పూర్‌లో మోదీ శనివారం పాల్గొననున్న సభావేదిక పందిరి కూలడంతో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు సహా 50 మంది గాయపడ్డారు. కాగా, మోదీ సింగపూర్ పర్యటన ఖర్చులు వివరాలు ఇవ్వడానికి ప్రధాని కార్యాలయం నిరాకరించింది. అవి అస్పష్టం, విస్తృతమైనవి అని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement