
ప్రచారంలోకి ప్రియాంక
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ కీలక పాత్ర పోషించనున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న తమ వినతిని ప్రియాంక అంగీకరించారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రాజ్‌బబ్బర్ చెప్పారు. ఆమె సేవలను పార్టీ వినియోగించుకుం టుందన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన వెంటనే ప్రియాంక ఎన్నికల ప్రచారంపై స్పష్టత వస్తుందన్నారు. ప్రియాంక రాక వల్ల పార్టీ కార్యకర్తల్లోనే గాక, రాష్ట్రప్రజల్లోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, కొత్త ఉత్సాహం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు.