రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన సీఎం
ఢిల్లీ: పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్‌ల మధ్య వివాదం రాష్ట్రపతి వద్దకు చేరింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి సోమవారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తీరుపై ఆయన ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాకుండా కిరణ్ బేడీ అడ్డుకుంటున్నారని నారాయణ స్వామి రాష్ట్రపతి వద్ద వాపోయారు. లెఫ్టినెంట్ గవర్నర్.. ప్రభుత‍్వంపై పెత్తనం చేయాలని చూస్తున్నారని సీఎం రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఆయన హోంమంత్రి రాజనాథ్ సింగ్‌ను సైతం కలిశారు. పుదుచ్చెరిలో కిరణ్ బేడీ వ్యవహారశైలిపై అధికార కాంగ్రెస్తో పాటు, డీఎంకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.