V Narayanasamy
-
మాస్కుల పరిశ్రమలో 70 మందికి కరోనా
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాస్కులు తయారు చేసే యూనిట్లో పెద్ద మొత్తంలో కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలో పని చేసిన 70 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్లాంట్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే 70 మంది కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. (పరుగో పరుగు!) దీనికి కారణమైన సదరు ప్లాంట్‌ను వెంటనే సీల్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీన్ని నడుపుతున్న ప్రైవేటు కంపెనీపైనా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. వైరస్ సోకిన కార్మికులు ఫ్యాక్టరీకి ఏయే గ్రామాల నుంచి వస్తారో వాటిపైనా అధికారులు దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో వీరికి సన్నిహితంగా మెదిలిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పుదుచ్చేరిలో ఇప్పటివరకు 461 కేసులు నమోదవగా ఇందులో 276 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు) -
రైతు ఆత్మహత్యలకు కారణం ఆయనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 4,500 మంది రైతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే కారణమని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఆరోపించారు. తమది చిన్న రాష్ట్రమే అయినా సొంత వనరులతో రైతులకు రుణమాఫీ చేశామని, తమ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని చెప్పారు. కేసీఆర్‌కు రాష్ట్ర రైతాంగంపై ఎలాంటి శ్రద్ధ లేదని, అందుకే ఇంతమంది రైతులు చనిపోయారన్నారు. సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ ఏం చేశారో తనకన్నా ఇక్కడి ప్రజలకే బాగా తెలుసునని నారాయణస్వామి అన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే రాష్ట్రాన్ని నడిపిస్తోందని ఆరోపించారు. అసలు ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ఏ సీఎం అయినా వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. మహారాజునని అనుకుంటున్నారు.. కేసీఆర్ సీఎం అయ్యాక ఆయన మనస్తత్వంలో మార్పు వచ్చిందని నారాయణస్వామి ఆరోపించారు. తనకు తాను మహారాజులా ఆయన భావిస్తున్నారని విమర్శించారు. అన్నీ కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులనే కేసీఆర్ తనవిగా చెప్పుకుంటున్నారని, కేసీఆర్ తన పాలనలో గుర్తింపు పొందే పని ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీకి ‘బీ’టీంగా టీఆర్ఎస్ పనిచేస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ చేయమంటేనే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ నేతలను కలిసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్‌లిద్దరూ ఒకటేనని చెప్పారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ఇచ్చిన సోనియాకు, కాంగ్రెస్‌కు ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారని, ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనను పేకాటలోని నాలుగు ‘కే’(రాజు)లతో పోలుస్తూ టీపీసీసీ రూపొందించిన ఓ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కుటుంబం, కేసీఆర్, కేటీఆర్, కవితలు నాలుగు ‘కే’లుగా పోస్టర్లో అభివర్ణించారు. హవ్వా... 300 కోట్లతో ఇల్లా! కేసీఆర్ రూ.300 కోట్లతో తన అధికారిక నివాసాన్ని కట్టుకున్నారన్న వార్తలు విని షాక్ అయ్యామని పుదుచ్చేరి సీఎం వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వ నివాసంలో కూడా ఉండటం లేదని, తన సొంత ఇంటిలోనే ఉంటున్నానని, కనీసం ప్రభుత్వ కారు వాడటం లేదన్నారు. సొంత ఫార్చ్యూనర్ కారులోనే తిరుగుతున్నానని, ల్యాండ్ క్రూయిజర్‌లో కాదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సింపుల్‌గా ఉంటేనే ప్రజలు ఇష్టపడతారని, తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుకొస్తారని అభిప్రాయపడ్డారు. ఇదేనా అభివృద్ధి నమూనా దేశంలోనే రైతులు ఎక్కువగా ఉన్న రెండో రాష్ట్రం తెలంగాణే అని.. అలాగే అవినీతిలో కూడా దేశంలో రెండోస్థానంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయని నారాయణస్వామి అన్నారు. ఇదేనా అభివృద్ధి నమూనా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనపై కాకుండా కేవలం కుటుంబంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. 9 నెలల ముందు ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్లో ఒక్క మహిళ కూడా లేకపోవడం, కనీసం మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేయకపోవడం కేసీఆర్ పాలనలోని లింగ వివక్షకు నిదర్శనమని విమర్శించారు. -
‘మెర్శల్’కు ముఖ్యమంత్రి మద్దతు
తమిళసినిమా (చెన్నై): మెర్శల్ చిత్రానికి రాజకీయ మద్దతు పెరుగుతోంది. విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మెర్శల్. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఇందులో జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలపై డైలాగ్‌లు ఉండటంతో బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా విమర్శించిన నేపథ్యంలో తాజాగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి మెర్శల్ వివాదంపై ఆదివారం ఓ ప్రకటనలో స్పందించారు. భారతదేశంలో పత్రికల స్వేచ్ఛను, భావస్వేచ్ఛను గత రాజకీయ పార్టీ నేతలు కాపాడుకుంటూ వచ్చారనీ, దాన్ని ఇప్పుడు బీజేపీ హరించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిపై చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. -
రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన సీఎం
ఢిల్లీ: పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య వివాదం రాష్ట్రపతి వద్దకు చేరింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి సోమవారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తీరుపై ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాకుండా కిరణ్ బేడీ అడ్డుకుంటున్నారని నారాయణ స్వామి రాష్ట్రపతి వద్ద వాపోయారు. లెఫ్టినెంట్ గవర్నర్.. ప్రభుత్వంపై పెత్తనం చేయాలని చూస్తున్నారని సీఎం రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఆయన హోంమంత్రి రాజనాథ్ సింగ్‌ను సైతం కలిశారు. పుదుచ్చెరిలో కిరణ్ బేడీ వ్యవహారశైలిపై అధికార కాంగ్రెస్‌తో పాటు, డీఎంకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
కిరణ్ బేడీ రబ్బర్ స్టాంప్ కాదా?
న్యూఢిల్లీ: పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి, ఆయన మంత్రివర్గ సభ్యులపై రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సోమవారం అవినీతి ఆరోపణలు చేస్తూ చిందులు వేయడం సోషల్ మీడియాలో రోజంతా హల్చల్ చేసింది. తాను రబ్బర్ స్టాంప్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉండదల్చుకోలేదని, సమర్థురాలైన పాలనాధికారిగా ఉండాలనుకుంటున్నానని కూడా నొక్కి చెప్పారు. ఉన్నతాధికారులంతా తనకే రిపోర్ట్ చేయాలని, తన ఆదేశాలకే కట్టుబడి పనిచేయాలని కూడా ఆమె ఇదివరకే ఆదేశించారు. కిరణ్ బేడీ నిజంగా సమర్థరాలైన పాలనాధికారే అయినట్లయితే దేశ ప్రజస్వామ్య వ్యవస్థ గురించి, సమాఖ్య స్ఫూర్తి గురించి సరైన అవగాహన ఉండి ఉండాలి. నారాయణ స్వామి, ఆయన మంత్రివర్గ సభ్యులు, శాసన సభ్యులు అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనవారు. ముఖ్యమంత్రి మాటను కూడా ఖాతరు చేయకుండా కిరణ్ బేడీ ఏకపక్షంగా వ్యవహరించడం ఏ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తున్నట్లు? పుదుచ్చేరి ప్రైవేటు వైద్య కళాశాల సీట్ల యాజమాన్య కోటా సీట్ల భర్తీ విషయంలో అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అందులో జోక్యం చేసుకునే అధికారం లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఉండదు. సీట్ల భర్తీలో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు అందితే తనకున్న అధికారాల మేరకు దర్యాప్తు జరిపించి అవినీతిపరులపైన చర్యలు తీసుకోవచ్చు. తానే 26 మంది విద్యార్థుల జాబితాను కళాశాల అధికారులకు ఇచ్చి వారందరికీ సీట్లు ఇమ్మని హుకుం జారీ చేసే అధికారం ఆమెకు ఎక్కడిది? అది అవినీతి, ఆశ్రితపక్షపాతం కిందకు రాదా? అవినీతి ఆరోపణలను నిరూపించినట్లయితే అందుకు ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నప్పుడు చట్ట ప్రకారం చర్యలకు సిద్ధం కావచ్చుగదా! కిరణ్ బేడీ రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. అధికారులు ‘వాట్సాప్’ గ్రూపును ఉపయోగించడాన్ని ముఖ్యమంత్రి గత జనవరిలో నిషేధించినప్పుడు జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పరిధాపై చర్యకు ఏప్రిల్ నెలలో ఆదేశించారు. అసెంబ్లీ స్పీకర్ వైథిలింగం ఆదేశాలపై పుదుచ్ఛేరి మున్సిపల్ కమిషనర్‌ను తొలగించిందుకు చీఫ్ సెక్రటరీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పుదుచ్చేరి ప్రభుత్వంపై లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పెత్తనం చెలాయించడమంటే కేంద్రం పెత్తనం సాగించడమే. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ రాష్ట్రాల పట్ల కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించాలని అనేవారు. బీజేపీ కూడా రాష్ట్రాలపై కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ సమాఖ్య స్ఫూర్తిని మంటగలుపుతోందని తరచూ విమర్శించేది. ప్రధాన మంత్రయ్యాక నరేంద్ర మోదీ అప్పుడప్పుడు సమాఖ్య స్ఫూర్తి అంటున్నారుగానీ, బీజేపీ ఒక్కసారి కూడా సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడటం లేదు. కేంద్రం కనుసన్నల్లో నడుచుకునే గవర్నర్లు రబ్బరు స్టాంపులుకాకుండా మరేమిటో! -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
సీఎం, గవర్నర్ మాటల యుద్ధం
పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కిరణ్ బేడీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీరిద్దరూ పరస్పరం విమర్శస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. కిరణ్‌బేడీ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న సీఎం.. అధికారులకు ఆంక్షలు విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవొద్దని, తప్పనిసరైతే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియలో అనవసరంగా కిరణ్‌బేడీ జోక్యం చేసుకుంటున్నారని గతవారం నారాయణస్వామి విమర్శించారు. మంత్రులను, ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం మానుకోవాలని, అగౌరపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని అసెంబ్లీ వేదికగా ఆమెకు సూచించారు. నారాయణస్వామి వైఖరిని కిరణ్‌బేడీ తప్పుబట్టారు. ‘మీరు కోరుకుంటున్నది రబ్బర్ స్టాంపునా లేదా బాధ్యతాయుతమైన పాలకురాలినా’ అని నారాయణస్వామిని అని ప్రశ్నించారు. పుదుచ్చేరికి న్యాయం, నైతిక నిష్ఠ, మంచి పాలన కావాలని పేర్కొన్నారు. కాగా, కిరణ్ బేడీని పదవి నుంచి తొలగించాలని సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
ఉప ఎన్నికల్లో సీఎం ఘనవిజయం
-
ఉప ఎన్నికల్లో సీఎం ఘనవిజయం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. పుదుచ్చేరి నెల్లితోప్పె అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి ఓంశక్తి శేఖర్‌పై 11,151 ఓట్ల తేడాతో గెలుపొందారు. గత మే 16న జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో వీ నారాయణస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే, ఆయన శాసనసభ్యుడు కాకపోవడంతో ఉప ఎన్నికల బరిలోకి దిగారు. నారాయణస్వామి సీఎంగా కొనసాగాలంటే ఈ ఎన్నికలో తప్పక గెలువాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసకక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తిశేఖర్ గట్టిపోటీ ఇచ్చారు. దీంతో ఆసాంతం ఈ ఉప ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని నాలుగు లోక్‌సభ స్థానాలకు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. త్రిపురలోని బర్జాలా అసెంబ్లీ స్థానాన్ని సీపీఎం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జితేంద్ర సర్కార్ రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ సీపీఎం దూకుడు ప్రదర్శించింది. అదేవిధంగా సీపీఎం ఎమ్మెల్యే సమీర్ దేబ్ సర్కార్ మృతితో కోవాయి అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరుగగా.. ఈ స్థానాని కూడా సీపీఎం కైవసం చేసుకుంది. అసోం లఖీంపుర లోక్‌సభ స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ లోక్‌సభ స్థానంలోనూ, నేపనగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. -
రాహుల్ చెప్పులు మోసిన మాజీ మంత్రి!
-
రాహుల్ చెప్పులు మోసిన మాజీ మంత్రి!
పుదుచ్చేరి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం పుదుచ్చేరిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ కోసం సాక్షాత్తూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ వీ నారాయణస్వామి చెప్పులు మోస్తూ కనిపించారు. వీ నారాయణస్వామి యూపీఏ హయాంలో ప్రధానమంత్రి కార్యాలయ మంత్రిగా ఉన్నారు. వరద ప్రాంతాలకు చేరుకున్న తర్వాత రాహుల్ తన బూట్లు విప్పారు. అప్పటివరకు తన చేతుల్లో పట్టుకొని ఉన్న చెప్పులను వీ నారాయణస్వామి రాహుల్ కు అందించారు. ఆయన కూడా మోహమాట పడకుండా వాటిని వేసుకున్నారు. ఈ వీడియో దృశ్యాలు వెలుగులోకి రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి వీరపూజకు ఈ ఘటన నిదర్శనమంటూ విమర్శలు రాగా.. వాటిని పుదుచ్చేరి ఎంపీ అయిన నారాయణస్వామి తోసిపుచ్చారు. వరద నీళ్లలో రాహుల్ గాంధీ వట్టి పాదాలతో నడిస్తే బాగుందని భావించి.. మర్యాదపూర్వకంగా ఆయనకు తన చెప్పులు ఇచ్చానని, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి భజన లేనేలేదని ఆయన చెప్పారు. వరద ప్రాంతాల్లో సందర్శించే సందర్భంగా రాహుల్ తన బూట్లను తానే చేతుల్లో పట్టుకున్నారని, భద్రతా సిబ్బందికి ఇచ్చేందుకు కూడా ఒప్పుకోలేదని చెప్పారు.