ఆర్థిక విధ్వంసం నోట్ల రద్దుపై రాహుల్‌ | Rahul Gandhi to address rally in Dharamshala today | Sakshi
Sakshi News home page

ఆర్థిక విధ్వంసం నోట్ల రద్దుపై రాహుల్‌

Published Sun, Dec 25 2016 1:52 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

ఆర్థిక విధ్వంసం నోట్ల రద్దుపై రాహుల్‌ - Sakshi

ఆర్థిక విధ్వంసం నోట్ల రద్దుపై రాహుల్‌

ధర్మశాల: ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు పెంచారు. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైందన్నారు. పేదలు, రైతులు, కష్ట జీవులపై ఇది బాంబు దాడిలాంటిదన్నారు. దేశాన్ని పేద–ధనిక వర్గాలుగా విభజించిందని శనివారం ఇక్కడ జరిగిన ర్యాలీలో ఆరోపించారు. ‘పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర పర్యాటక, ఉద్యాన, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం చూపించడం ద్వారా హిమాచల్‌ ప్రదేశ్‌ టోపీని తొలగించింది. ఇక్కడి సాగు భూములను చిరునవ్వుతో మోదీ తగులబెట్టారు. ఇది నల్లధనం, అవినీతిపై లక్షిత దాడి కాదు. పేదలు, రైతులు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థపై బాంబు దాడి. 

దేశంలో 6 శాతం నల్లధనం మాత్రమే ఉంది. మిగిలిన 94 శాతం నల్లధనం రియల్‌ఎస్టేట్, బంగారం, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోంది. మోదీజీతో కలిసి అమెరికాకు వెళ్లేవారి వద్దే నల్లధనం ఉంది. ప్రధాని మోదీ పేదలకు రూ.3 లడ్డూ ఇచ్చారని, బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్‌ మాల్యాకు మాత్రం రూ.1,200 కోట్ల లడ్డూ ఇచ్చారని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement